- Home
- Entertainment
- నిక్కరు వేసుకుని నటించడానికి శోభన్ బాబు గ్రీన్ సిగ్నల్, వద్దన్న డైరెక్టర్, కట్ చేస్తే సినిమా బ్లాక్ బస్టర్ హిట్,
నిక్కరు వేసుకుని నటించడానికి శోభన్ బాబు గ్రీన్ సిగ్నల్, వద్దన్న డైరెక్టర్, కట్ చేస్తే సినిమా బ్లాక్ బస్టర్ హిట్,
శోభన్ బాబు మిస్ అయిన ఓ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అది కూడా హీరో డీ గ్లామర్ రోల్ లో కనిపించిన ఆ సినిమాలో నటించడానికి శోభన్ బాబు ఒకే అన్నారు. కాని ఆ మూవీని ఆయన ఎలా మిస్ అయ్యారు?

తెలుగు సినీ చరిత్రలో గ్లామర్‌కు ప్రతీకగా నిలిచిన నటుడు శోభన్ బాబు. తన కెరీర్ మొత్తం మంచి నటనతో పాటు గ్లామరస్ పాత్రలతోనే కొనసాగించిన స్టార్. డీ గ్లామర్ రోల్ లో శోభన్ బాబును ఆడియన్స్ అస్సలు ఒప్పుకునేవారు కాదు. ఆయన ఎప్పుడూ సోగ్గాడు, అందగాడిగానే చూసేవారు. హీరోయిన్లు కూడా చాలామంది ఆయనతో ప్రేమలో పడినవారు ఉన్నారు.
ఎప్పుడూ మెరిసే రూపంతో, స్టైలిష్ డ్రెస్ లతో, అదిరిపోయే హెయిర్ స్టైల్ తో కనిపించే శోభన్ బాబు ఒక్కసారి మాత్రం డీ గ్లామర్ పాత్ర కోసం కూడా సిద్ధమయ్యారట. అందులోనూ నిక్కర్ వేసి కనిపించేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. కానీ ఆ పాత్ర ఆయన చేయలేదు. ఆ సినిమా మాత్రం తెలుగు చిత్రరంగంలో ఎప్పటికీ గుర్తుండిపోయే క్లాసిక్ హిట్ గా నిలిచింది.
ఈ ఆసక్తికర విషయానికి కారణమైన సినిమా “పదహారేళ్ల వయస్సు”. ఈ సినిమా హీరోయిన్ ఓరియెంటెడ్ ప్రధానంగా కథ సాగుతుంది. అయితే ఈ సినిమాలో హీరో పాత్రకు ముదుగా శోభన్ బాబునే తీసుకోవాలని దర్శకుడు కె. రాఘవేంద్రరావు నిర్ణయించారు. అయితే ఆ పాత్రలో నిక్కర్ వేసుకుని కనిపించాల్సి ఉండటంతో శోభన్ బాబు ఆ విషయాన్ని గమనించినప్పటికీ, పాత్రకు ఓకే చెప్పారు.
శోభన్ బాబు అంటే ఇండస్ట్రీలో ఓ ఇమేజ్ ఉంది. ఆయన అందాల నటుడు, ఆయన అందంగా కనిపిస్తేనే ఆడియన్స్ యాక్సప్ట్ చేస్తారు. డీ గ్లామర్ రోల్ చేస్తే ఆయన ఫ్యాన్స్ హర్ట్ అవుతారు. అందుకే దర్శకులు కాని, నిర్మాతలు కాని శోభన్ బాబును ఇంకాస్త అందంగా చూపించడానికే ప్రయత్నించేవారు కానీ.. ఆయనన్ను డీగ్లామర్ లో చూపించే సాహసం చేసేవారు కాదు.
దాంతో ఈసినిమాలో కూడా చంద్రమోహన్ పోషించిన పాత్రకోసం ముందుగా శోభన్ బాబు అయితేనే బాగుంటాడు అనుకున్న రాఘవేంద్రరావు.. ఆతరువాత మనసు మార్చుకున్నారట. శోభన్ బాబు సరే అన్నా కాని.. దర్శకుడికి మాత్రం ఎక్కడో తేడా కొడుతున్నట్టు అనిపించింది, ఆ పాత్ర ఆయన గ్లామర్ ఇమేజ్‌కు సరిపోదని అనిపించింది.
“అందాల నటుడు”గా పేరు తెచ్చుకున్న శోభన్ బాబును అలాంటి పాత్రలో చూపించలేనని భావించిన రాఘవేంద్రరావు చివరకు చంద్రమోహన్ ను ఆ పాత్రకు ఎంపిక చేశారు. చంద్రమోహన్ కూడా పూర్తి నిక్కర్ సీన్‌కి కాకుండా, ఎక్కువగా పంచె ధరించిన వేషాలలో కనిపించేలా దర్శకుడు సన్నివేశాలను మోడిఫై చేశారని తెలుస్తోంది.
ఇక ఈ పాత్ర ఎంత హైలెట్ అయ్యిందో.. ఈ సినిమా గురించి తెలిసిన ప్రతీ ఒక్కరికి అవగాహన ఉంది. ఈ సినిమా రిలీజ్ అయ్యి పెద్ద విజయం సాధించింది. ఆల్ టైమ్ ఎవర్గ్రీన్ హిట్లలో ఒకటిగా నిలిచింది. ఈ హిట్‌తో చంద్రమోహన్‌కు మరింత గుర్తింపు వచ్చింది. అదే సమయంలో శోభన్ బాబు అభిమానులకు మాత్రం ఆయన డీ గ్లామర్ లుక్ చూడలేకపోవడం ఓ లోటుగా మిగిలిపోయింది.
అంతే కాదు ఈసినిమాలో నెగెటీవ్ రోల్ చేసిన మోహన్ బాబుకు కూడా మంచి పేరు వచ్చింది. శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సిరిమల్లె పువ్వా పాట అప్పటి లేడీ ఫ్యాన్స్ నోటిలో ఎప్పుడూ నానుతూ ఉండేది. ఇప్పటికీ 80స్ బ్యాచ్ ఈ సాంగ్ ను మర్చిపోలేరు. పాడుకుంటూనే ఉంటారు.
ఇక శోభన్ బాబు విషయానికి వస్తే.. నటనతో పాటు తన ప్రొఫెషనలిజం, గ్లామర్ మెయింటెనెన్స్ విషయంలో ఎంతో కట్టుబాటుతో ఉండేవారు. ఆయన పాత్రల విషయంలో చాలా మంది దర్శకులకు "నో" చెప్పిన సందర్భాలు ఉన్నాయి.
అంతే కాదు 60 ఏళ్లు దాటిన తరువాత సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన శోభన్ బాబు, అప్పటి నుంచి ఎవరు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా నటించలేదు. ఎంతో మంది వెళ్లి ఆయన్ను బ్రతిమలాడారు. కాని శోభన్ బాబు మాత్రం తన మాటకు కట్టుబడి ఉన్నారు. ఉదాహరణకు అతడు” సినిమాలో మహేష్ బాబు తాత పాత్రకు కూడా ఆయనకు ఆఫర్ వచ్చినప్పటికీ, తిరస్కరించారు.
తన అభిమానులు తనను గ్లామరస్ హీరోగా గుర్తుపెట్టుకున్నారని, తాత, నాన్నల పాత్రలు చేసి వారిని నిరాశపరచలేనని ఆయన వచ్చినవారితో చెప్పేవారు. అంతే కాదు సినిమాలనుంచి బయటకు వచ్చిన తరువాత ఆయన ఫోటోకూడా పేపర్ లో రాకుండా జాగ్రత్త పడ్డారు శోభన్ బాబు. ఆతరువాత సినిమా కార్యక్రమాలకు కాని, సత్కారాలకు కూడా వెళ్లేవారు కాదు.
పరిమితమైన పాత్రలు మాత్రమే చేసి, పరిశ్రమను వీడి శోభన్ బాబు వ్యక్తిగత జీవితం వైపు మళ్లారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ తరువాత టైర్-1 స్టార్‌గా పేరు తెచ్చుకున్న శోభన్ బాబు తన వారసులను మాత్రం సినిమాల్లోకి రాకుండా జాగ్రత్త పడ్డారు.
సినిమాలు చేస్తూనే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన ఈ స్టార్ హీరో తన వారసులను వ్యాపారంలో సెటిల్ అయ్యేలా ప్రోత్సహించారు. చాలా ఆరోగ్యంగా ఉండే ఆయన 2008 లో సడెన్ గా గుండెపోటు రావడంతో ఉన్నచోటే కుప్పకూలిపోయి మరణించారు.