రవితేజకు షాక్ ఇచ్చిన విజయశాంతి, మహేష్ బాబుకు మాత్రం గ్రీన్ సిగ్నల్
చాలా ఏళ్ళ గ్యాప్ తరువాత సినిమాలు చేస్తోంది లేడీ సూపర్ స్టార్ విజయశాంతి. వచ్చిన ప్రతీ ఆఫర్ ను తీసుకోకుండా. తనకు నచ్చిన, మెచ్చిన సినిమాకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. పాత్ర నచ్చితే వెంటనే ఒకే చేస్తోంది విజయశాంతి. పొలిటికల్ కెరీర్ ను కంటీన్యూ చేస్తూనే.. ఎప్పుడో ఒక్క సినిమా చేస్తుంది. ఇక ఈక్రమంలోనే విజయశాంతి కి చెందిన ఓ విషయం ప్రస్తుతం వైరల్ అవుతోంది. మాస్ మహారాజ్ విషయంలో షాక్ ఇచ్చిన ఈ నటి..మహేష్ బాబు విషయంలో తీసుకున్న నిర్ణయం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఇంతకీ విషయం ఏంటంటే?

టాలీవుడ్ లో ఒకప్పుడు లేడీ సూపర్ స్టార్ గా ఓ వెలుగు వెలిగిన నటి విజయశాంతి. హీరోయిన్ గా ఏఎన్నఆర్ కృష్ణ దగ్గర నుంచి నాగార్జున వరకూ స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ఇక కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన ఘనత విజయశాంతికే దక్కుతుంది. సౌత్ లో మొదటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతినే.
Also Read: మోహన్ బాబు ఇంటికి భారీగా పోలీసులు, మంచువారింట మరోసారి మంటలు, అసలేం జరిగింది.
ఇక ఆ తర్వాత సినిమాలకు దూరమయ్యి.. రాజకీయాలకు దగ్గరయ్యారు విజయశాంతి. రాజకీయాల్లో బిజీ అయ్యాక సినిమాలవైపు తిరిగిచూడలేదు. అయితే మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన విజయశాంతి, ఇప్పుడు కళ్యాణ్ రామ్ తో అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా చేస్తుంది. ఎంత మంది ఎన్ని విధాలుగా ప్రయత్నించినా రీ ఎంట్రీకి ఒప్పుకోలేదు రాములమ్మ. కాని డైరెక్టర్ అనిల్ రావిపూడి పట్టుబట్టి, బ్రతిమలాడి మహేష్ బాబు మూవీలో నటించేలా ఒప్పించారు.
Also Read: ఎన్టీఆర్ దెబ్బకు జ్వరం తో మంచం ఎక్కిన హీరోయిన్? 3రోజులు ఒళ్ళు నొప్పులతో ఇబ్బంది పడ్డ నటి ఎవరు?
Vijayashanthi
అయితే రెమ్యునరేషన్ మాత్రం భారీగా తీసుకుంటున్నారట విజయశాంతి. అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాలో కళ్యాణ్ రామ్ కి తల్లి పాత్రలో విజయశాంతి కనిపించబోతున్నారు. మాజీ పోలీస్ ఆఫీసర్ గా.. తన పాత వైజయంతి పాత్రలో ఆమె కనిపించబోతున్నారు. ఇక ఈ సినిమా ఏప్రిల్ 18న రిలీజ్ కానుంది. దీంతో మూవీ యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ప్రమోషన్స్ లో భాగంగా కళ్యాణ్ రామ్, విజయశాంతి, అనిల్ రావిపూడిని కలిపి యాంకర్ సుమ ఓ స్పెషల్ ఇంటర్వ్యూ చేసారు. ఈ ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి ఓ ఆసక్తికర విషయం పంచుకున్నారు.
Also Read: సినిమా హాళ్లలో మద్యం అమ్మకాలు, మందు బాబులకు త్వరలో డబుల్ ధమాకా
Vijayashanthi
అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. సరిలేరు నీకెవ్వరు సినిమాకు విజయశాంతి గారు మొదట ఒప్పుకోలేదు. చాలా సార్లు విజయశాంతి గారి వెనకాల తిరిగి కథ చెప్పి ఒప్పించాను. కానీ అంతకంటే ముందే రవితేజ రాజాది గ్రేట్ సినిమా కోసం ఆమెను అడిగాను, కాని నో అన్నారు. అయినా సరే చాలా గట్టిగా ట్రై చేశాను. రాజా ది గ్రేట్ సినిమాలో రవితేజ తల్లిపాత్ర విజయశాంతి గారు చేసుంటే బాగుండేది అనుకున్నాను. కాని అప్పుడు ఆ సినిమాకు నో చెప్పారు, ఇక లక్కీగా మహేష్ బాబు సినిమాకి విజయశాంతి గారు ఓకే చెప్పారు అని అనిల్ రావిపూడి అన్నారు.
Also Read: కమల్ హాసన్ లేడీ వాయిస్‌తో పాడిన పాటలు ఎన్ని ఉన్నాయో తెలుసా? అందులో హిట్ సాంగ్స్ ఇవే?
రాజా ది గ్రేట్
రవితేజ రాజా ది గ్రేట్ సినిమాలో రవితేజ తల్లి పాత్రలో రాధిక నటించింది. ఆ పాత్రకి అనిల్ రావిపూడి ముందు విజయశాంతిని అనుకున్నా ఆమె ఒప్పుకోకపోవడంతో రాధిక చేసారు. అలా విజయశాంతి రవితేజ సినిమాకు నో చెప్పింది. కానీ కాస్త లేట్ అయినా మహేష్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు కళ్యాణ్ రామ్ తల్లిగా నటిస్తు్ంది విజయశాంతి. ఇటీవలే ఎమ్మెల్సీ అయ్యారు కాబట్టి ఫ్యూచర్ లో ఇంకా సినిమాలు చేస్తారా లేదా చూడాలి.
Also Read:బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లోకి అలేఖ్య చిట్టి, ముగ్గురు సిస్టర్స్ లో ఎవరికి అవకాశం?