MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • CM Vijay Salary: హీరోగా 275 కోట్లు.. మరి సీఎంగా దళపతి జీతం ఎంతో తెలుసా?

CM Vijay Salary: హీరోగా 275 కోట్లు.. మరి సీఎంగా దళపతి జీతం ఎంతో తెలుసా?

తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక విజయ్ దళపతి తన మార్క్ చూపిస్తున్నారు. హీరోగా వందల  కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్న విజయ్..ఇప్పుడు సీఎంగా ఎంత జీతం తీసుకోబోతున్నారో తెలుసా? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 13 2026, 01:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం
Image Credit : ANI

తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుతమైన విజయం సాధించి.. సీఎం అయ్యాడు సౌత్ స్టార్ హీరో విజయ్ దళపతి. తమిళనాట పాతుకుపోయిన ద్రవిడ పార్టీలకు షాక్ ఇస్తూ.. 108 సీట్లు సాధించి.. అతి పెద్ద పార్టీగా టీవీకే అవతరించింది.  అన్ని సర్వేలు డీఎంకే గెలుస్తుందని చెప్పినా, వాటన్నింటినీ తలకిందులు చేస్తూ విజయ్ 'తమిళగ వెట్రి కళగం' పార్టీ భారీ విజయాన్ని నమోదు చేసింది.  ఇది తమిళనాడు రాజకీయాల్లో పెద్ద సంచలనంగా మారింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఎంజీఆర్ రికార్డును బ్రేక్ చేసిన దళపతి
Image Credit : ANI

ఎంజీఆర్ రికార్డును బ్రేక్ చేసిన దళపతి

తొలి ఎన్నికల్లో ఎంజీఆర్ సాధించిన ఓట్ల శాతం కన్నా విజయ్ ఎక్కువ ఓట్లు సాధించారు. అయితే, మెజారిటీకి మరో 11 సీట్లు అవసరం కావడంతో కాంగ్రెస్, వీసీకే, కమ్యూనిస్ట్ పార్టీల సపోర్టుతో విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మే 10న చెన్నై నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఘనంగా ప్రమాణ స్వీకార వేడుక కూడా జరిగింది. 

34
వందల కోట్ల రెమ్యునరేషన్ వదులుకుని
Image Credit : ANI

వందల కోట్ల రెమ్యునరేషన్ వదులుకుని

విజయ్ దళపతి  పార్టీ పెట్టినప్పటి నుంచి చాలామంది, ఆయన సినిమాల్లో భారీ రెమ్యునరేషన్ ను వదులుకుని  ప్రజలకు సేవ చేయడానికి వస్తున్నారని అన్నారు. నిజానికి, నటుడిగా తన చివరి సినిమాకు విజయ్ రూ.275 కోట్లు పారితోషికం తీసుకున్నారు. తమిళ సినీ చరిత్రలో ఏ నటుడూ ఇంత పెద్ద మొత్తంలో తీసుకోలేదు. ఇంత డబ్బును వదులుకుని రాజకీయాల్లోకి వచ్చిన విజయ్, సీఎంగా ఎంత జీతం తీసుకుంటారన్న ఆసక్తి అభిమానులతో పాటు  అందరిలో ఉంది. 

44
ముఖ్యమంత్రిగా విజయ్ జీతం ఎంత?
Image Credit : ANI

ముఖ్యమంత్రిగా విజయ్ జీతం ఎంత?

ముఖ్యమంత్రిగా విజయ్ నెలకు రూ.2.05 లక్షల జీతం అందుతుంది. ఇతర అలవెన్సులతో కలిపి నెలకు మొత్తం రూ.2.85 లక్షలు వస్తాయని సమాచారం. అంటే, ఏడాదికి ఆయన జీతం రూ.34.2 లక్షలు. సినిమాల్లో ఆయన సంపాదనతో పోలిస్తే, ఇది ఆయన ఒక్కరోజు సంపాదన కన్నా కూడా తక్కువే. అయితే విజయ్ సినిమాలకు గుడ్ బై చెపుతారా? లేక కొంత కాలం తరువాత కంటీన్యూ చేస్తారా అన్న విషయంలో క్లారిటీ లేదు. గతంలో ముఖ్యమంత్రిగా ఉండి ఎన్టీఆర్ సినిమాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. మరి 50 ఏళ్ల విజయ్ ఆలోచన ఏంటో తెలియాల్సి ఉంది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
టీవీకే విజయ్
వినోదం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: టీ కప్పులే కడగలేవు, బిగ్ బాస్ కప్పు ఏం కొడతావ్.. రోహిత్ పరువు తీసిన వంశీ
Recommended image2
RC17: ధురంధర్ మ్యూజిక్ డైరెక్టర్ తో డీల్ కుదర్లేదా ? సుకుమార్, రామ్ చరణ్‌ మూవీ కోసం అనిరుధ్
Recommended image3
Rashmi Gautam: రష్మి గౌతమ్‌ నవరాత్రి స్పెషల్ ఫొటోషూట్..ట్రెడిషనల్ లుక్ లో మెస్మరైజ్ చేస్తోందిగా
Related Stories
Recommended image1
Vijay Thalapathy: సీఎం విజయ్ కి ఫేవరెట్ తెలుగు హీరో ఎవరో తెలుసా? అతనే ఎందుకంత ఇష్టం?
Recommended image2
Balakrishna: ఫిల్మ్ ఇండస్ట్రీలో బాలయ్య బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా? చిరంజీవి మాత్రం కాదు, ఎవరంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved