MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Vijay Thalapathy: సీఎం విజయ్ కి ఫేవరెట్ తెలుగు హీరో ఎవరో తెలుసా? అతనే ఎందుకంత ఇష్టం?

Vijay Thalapathy: సీఎం విజయ్ కి ఫేవరెట్ తెలుగు హీరో ఎవరో తెలుసా? అతనే ఎందుకంత ఇష్టం?

ఎట్టకేలకు తమిళనాడు సీఎం సీటులో విజయ్ దళపతి కూర్చున్నాడు. హీరోగా మాత్రమే కాదు.. నాయకుడిగా కూడా తనను తాను నిరూపించుకున్నాడు విజయ్. ఇక కోలీవుడ్ లో స్టార్ హీరోగా వెలుగు వెలిగిన విజయ్ దళపతికి తెలుగులో ఫెవరేట్ హీరో ఎవరో తెలుసా? ఆయనంటే ఎందుకంత ఇష్టం.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 12 2026, 08:53 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తమిళనాడు సీఎం సీటులో విజయ్ దళపతి..
Image Credit : ANI

తమిళనాడు సీఎం సీటులో విజయ్ దళపతి..

హీరోగా కోలీవుడ్ లో వెలుగు వెలిగిన విజయ్ దళపతి.. నాయకుడిగా కూడా తనను తాను నిరూపిచుకున్నాడు. రాజకీయాల్లోకి వచ్చిన రెండేళ్లలోనే ప్రజల మనసు గెలుచుకుని సీఎం సీటులో క‌ూర్చుకున్నాడు విజయ్. సీఎం అవ్వకుండా ఎంత మంది ప్రయత్నం చేసినా.. అన్ని ఇబ్బందులు దాటుకుని అధికారం సాధించాడు విజయ్ దళపతి.

 ఎంజీఆర్ తరువాత సీఎం అయిన స్టార్ హీరోగా దళపతి రికార్డు క్రియేట్ చేశాడు. ఇక ఆయన సినిమాలకు శాశ్వతంగా రిటైర్మెంట్ ఇచ్చాడా? లేక ఇది చిన్న బ్రేక్ మాత్రమేనా అనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు. అభిమానులు విజయ్ ఏం చేస్తాడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
కోలీవుడ్ హీరోలకు తెలుగులో అభిమానులు..
Image Credit : PTI

కోలీవుడ్ హీరోలకు తెలుగులో అభిమానులు..

తమిళ సినిమా హీరోలకు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంటుంది. సీఎం విజయ్ తో పాటు రజనీకాంత్, కమల్ హాసన్, సూర్య, విక్రమ్, విశాల్ లాంటి హీరోలు తెలుగులో కూడా మంచి మార్కెట్‌ను ఏర్పరుచుకుని అభిమానులను సంపాదించుకున్నారు. కానీ తెలుగు హీరోలకు మాత్రం తమిళంలో అభిమానులు చాలా తక్కువ. పాన్ ఇండియా సినిమాల వల్ల.. ఇప్పుడిప్పుడే తెలుగు హీరోలకు తమిళంలో కూడా అభిమానులు పుట్టుకొస్తున్నారు. ఇక తమిళ నాడు సీఎం విజయ్ దళపతికి ఫేవరెట్ తెలుగుహీరో ఎవరో మీకు తెలుసా?

Related Articles

Related image1
Chiranjeevi: నువ్వేమన్నా స్టార్ హీరోవి అనుకుంటున్నావా.. చిరంజీవిని దారుణంగా అవమానించిన స్టార్ డైరెక్టర్ ఎవరు?
Related image2
Pawan Kalyan: విజయ్ దళపతి రీమేక్ చేసిన పవన్ కళ్యాణ్ ఏకైక సినిమా ఏదో తెలుసా ?
35
తెలుగులో విజయ్ కి ఇష్టమైన హీరో..
Image Credit : Asianet News

తెలుగులో విజయ్ కి ఇష్టమైన హీరో..

ఇక విజయ్‌కు తెలుగు హీరోల్లో ఎవరు ఇష్టం? తెలుగు రాష్ట్రాల నాయకుల్లో ఆయనకు ఇష్టమైన రాజకీయ నాయకుడు ఎవరు? అనే విషయాలపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. గతంలో విజయ్ మాట్లాడిన కొన్ని వ్యాఖ్యల ఆధారంగా చూస్తే, తెలుగు హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి అంటే తనకు ఎంతో ఇష్టమని ఆయన పలు సందర్భాల్లో వెల్లడించినట్లు సమాచారం. చిరంజీవి కష్టపడి ఎదిగిన తీరు. ఆయన డ్యాన్స్, యాక్షన్, డైలాగ్స్ అంటే విజయ్ కి చాలా ఇష్టమట. అందుకే మెగాస్టార్ ను ఆయన ఆదర్శంగా తీసుకున్నట్టు సమాచారం.

45
దళపతి మెచ్చిన తెలుగు నేత..
Image Credit : Asianet News

దళపతి మెచ్చిన తెలుగు నేత..

అదే విధంగా రాజకీయ నాయకుల్లో పవన్ కళ్యాణ్ అంటే విజయ్ కు ఎంతో ఇష్టమని తెలుస్తోంది. రాజకీయాల విషయంలో పవన్ కళ్యాణ్ పట్టుదల, ఆయన భావజాలం తనను ఆకట్టుకుందని, ఆయన రాజకీయాల్లో వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోకి వచ్చారని విజయ్ పలు సందర్భాల్లో అన్నట్టు తెలుస్తోంది.

55
విజయ్ - పవన్ మధ్య పోలికలు..
Image Credit : instagram

విజయ్ - పవన్ మధ్య పోలికలు..

టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్.. తమిళనాడులో విజయ్‌ ఒకే ఏజ్ గ్రూప్ కు చెందిన హీరోలు. ఇద్దరికి అక్షల్లో అభిమానులు ఉన్నారు. ఇద్దరు రాజకీయంగా ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేశారు. కానీ విజయ్ మొదటి ఎన్నికల్లోనే సీఎం సీటు సాధించగా.. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం వరకే వచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ పోటీ చేసిన తన ఎమ్మెల్యేలందరిని గెలిపించుకుని.. రికార్డు క్రియేట్ చేశారు. విజయ్ మాత్రం సీఎం అవ్వడానికి కావల్సిన మ్యాజిక్ ఫిగర్ ను అందుకోలేకపోయారు. పలు పార్టీల సపోర్ట్ తో  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మరి సీఎంగా విజయ్ తన మార్క్ ను ఎంత వరకూ చూపిస్తాడో చూడాలి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
పవన్ కళ్యాణ్
తెలుగు సినిమా
తమిళ సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Venkatesh: ఆ హీరోయిన్ తో 100% స్ట్రైక్ రేట్ కొట్టిన వెంకటేష్.. 6 సినిమాలు చేస్తే అన్నీ బ్లాక్ బస్టర్లే
Recommended image2
Karthika Deepam 2 Today Episode: జ్యోనే తన సొంత మనుమరాలని తెలుసుకున్న పారు- సుమిత్ర ఆపరేషన్ పై డౌట్
Recommended image3
South Films: ఈ వారం థియేటర్లలో రిలీజయ్యే సినిమాలు.. సమంత నుంచి సూర్య వరకు, క్రేజీ స్టార్లు రెడీ
Related Stories
Recommended image1
Chiranjeevi: నువ్వేమన్నా స్టార్ హీరోవి అనుకుంటున్నావా.. చిరంజీవిని దారుణంగా అవమానించిన స్టార్ డైరెక్టర్ ఎవరు?
Recommended image2
Pawan Kalyan: విజయ్ దళపతి రీమేక్ చేసిన పవన్ కళ్యాణ్ ఏకైక సినిమా ఏదో తెలుసా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved