MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Balakrishna: ఫిల్మ్ ఇండస్ట్రీలో బాలయ్య బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా? చిరంజీవి మాత్రం కాదు, ఎవరంటే?

Balakrishna: ఫిల్మ్ ఇండస్ట్రీలో బాలయ్య బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా? చిరంజీవి మాత్రం కాదు, ఎవరంటే?

65 ఏళ్ల వయసులో వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతున్నాడు నటసింహం నందమూరి బాలకృష్ణ. సీనియర్ హీరోలలో ఆయనే ముందున్నాడు. ఇండస్ట్రీలో తన మార్క్ చూపిస్తున్నాడు. ఇంతకీ ఫిల్మ్ ఇండస్ట్రీలో బాలయ్య క్లోజ్ ఫ్రెండ్ ఎవరో తెలుసా?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 13 2026, 11:31 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మాస్ హీరోగా దూసుకుపోతున్న బాలకృష్ణ..
Image Credit : Asianet News

మాస్ హీరోగా దూసుకుపోతున్న బాలకృష్ణ..

65 ఏళ్ల వయసులో నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రయోగాలకు పెద్ద పీట వేస్తున్నాడు. వరుస సినిమాలతో సూపర్ హిట్లు కొడుతున్నారు. గతంలో ఎప్పుడు చేయని డిఫరెంట్ క్యారెక్టర్స్ ను ట్రై చేస్తున్నాడు. ఈమధ్య కాలంలో ఆయన అఖండ సినిమాలో చేసిన అఘోర పాత్రకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. 

ఈ క్యారెక్టర్ లోని వైబ్స్ కు.. అభిమానులు పూనకాలతో ఊగిపోయారు. ఇక బాలయ్య వారసత్వంగా ఇండస్ట్రీలోకి వచ్చినా.. మాస్ హీరోగా తనను తాను నిరూపించుకుని భారీగా అభిమానులను సంపాదించుకున్నాడు. వరుసగా 5 హిట్ సినిమాలు చేసిన బాలకృష్ణ.. ప్రస్తుతం హ్యాట్రిక్ హిట్ మీద కన్నేశాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
హ్యాట్రిక్ హిట్ మీద కన్నేసిన బాలయ్య..
Image Credit : Youtube/Aha

హ్యాట్రిక్ హిట్ మీద కన్నేసిన బాలయ్య..

అఖండ సినిమా నుంచి బాలకృష్ణ నటించిన సినిమాలు వరుస విజయాలను అందుకుంటున్నాయి. అభిమానులతో పాటు, అన్ని రకాల ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా కథలను ఎంపిక చేసుకుని, మంచి దర్శకులకు అవకాశం ఇచ్చి ముందుకు సాగుతున్నాడు నందమూరి హీరో. 

ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాడు బాలయ్య.. గతంలో ఈ కాంబినేషన్ లో వచ్చిన వీరసింహారెడ్డి సినిమా బ్లాక్ బస్టర్ హిట్అయ్యింది. మరోసారి ఈ ఇద్దరు కలిసి భారీ విజయాన్ని అందుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు.

Related Articles

Related image1
Sai Pallavi Crush: నా ఫస్ట్ క్రష్ అతనే.. సీక్రెట్ రివీల్ చేసిన సాయి పల్లవి
Related image2
Nayanthara: నయనతార కెరీర్ లో చెత్త సినిమాలు, ఆ ఒక్క మూవీ చేసినందకు ఇప్పటికీ బాధపడుతున్న హీరోయిన్
35
ఇండస్ట్రీలో నందమూరి హీరో ఆత్మీయులు ఎవరు?
Image Credit : Face book/ KChiranjeeviFans, Nandamuri Balakrishna

ఇండస్ట్రీలో నందమూరి హీరో ఆత్మీయులు ఎవరు?

ఇక బాలకృష్ణ ది చిన్నపిల్లాడి మనసు అని చాలామంది అంటుంటారు. కోసం ఎక్కువే.. అయినా జాలి గుండె. ఆయనకు ఇండస్ట్రీలో ఎంతో మంది ఆత్మీయులు ఉన్నారు. చిరు, వెంకీ, నాగ్ లాంటి హీరోలతో కూడా ఆయన స్నేహంగా ఉంటారు. మెగాస్టార్ చిరంజీవితో బాలయ్యకు ఎక్కువ స్నేహం ఉందట. కానీ బయటకు మాత్రం పెద్దగా కలిసి కనిపించరు. వారి మధ్య ఏదో గ్యాప్ ఉన్నట్టు ప్రచారంజరుగుతుంటి. కానీ వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. అయితే చిరంజీవి కాకుండా బాలయ్య కు ఇండస్ట్రీలో మరో బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడని మీకు తెలుసా? ఇంతకీ ఎవరాయన?

45
బాలకృష్ణ బెస్ట్ ఫ్రెండ్ అతనేనా?
Image Credit : Youtube/ETV

బాలకృష్ణ బెస్ట్ ఫ్రెండ్ అతనేనా?

బాలయ్య కెరీర్ ప్రారంభం నుంచి పరిచయమైన వారిలో దర్శకుడు బి గోపాల్ పేరు ప్రత్యేకంగా వినిపిస్తుంది. చాలా సందర్భాల్లో బాలకృష్ణ కూడా బి గోపాల్ తనకు అత్యంత దగ్గరైన వ్యక్తి అని చెపుతుంటాడు. బాలకృష్ణ హీరోగా ఎదుగుతున్న సమయంలో దర్శకుడు బి గోపాల్ ఆయనకు బ్లాక్ బస్టర్ హిట్లను అందించారు. అవి బాలయ్య కెరీర్ కు బాగా ఉపయోగపడ్డాయి. ఆయన్ను స్టార్ హీరోను చేశాయి. 

55
డిజాస్టర్ సినిమాలు కూడా..
Image Credit : facebook.com/NandamuriBalakrishna

డిజాస్టర్ సినిమాలు కూడా..

ఈ విజయాల క్రమంలో ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. అదే స్నేహంగా మారి ఇప్పటికీ కొనసాగుతోందని సమాచారం. బాలయ్యతో ఎంత పెద్ద హిట్ సినిమాలు చేశాడో.. అంత కంటే దారుణమైన డిజాస్టర్ కూడా ఇచ్చాడు గోపాల్. పలనాటి బ్రహ్మనాయుడు లాంటి ప్లాప్ సినిమాలు వీరి కాంబోలోనే వచ్చాయి. అయినా సరే.. గోపాల్ విషయంలో బాలయ్య స్నేహంగానే ఉంటారని తెలుస్తోంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
నందమూరి బాలకృష్ణ
వినోదం
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Dhanush Vs CM Vijay: ధనుష్ రాజకీయాల్లోకి రాబోతున్నాడా? విజయ్ కి పోటీ ఇస్తాడా? తండ్రి కస్తూరి రాజా క్లారిటీ!
Recommended image2
Karthika Deepam 2 Today Episode: మేనేజర్, జ్యో కుట్ర- దీప బలి- శివన్నారాయణ ఫైర్- దీపకు మరో ఛాన్స్
Recommended image3
Vijay Thalapathy : నా గర్భం పోడానికి కారణం సీఎం విజయ్.. బిగ్ బాస్ నటి సంచలన ఆరోపణలు
Related Stories
Recommended image1
Sai Pallavi Crush: నా ఫస్ట్ క్రష్ అతనే.. సీక్రెట్ రివీల్ చేసిన సాయి పల్లవి
Recommended image2
Nayanthara: నయనతార కెరీర్ లో చెత్త సినిమాలు, ఆ ఒక్క మూవీ చేసినందకు ఇప్పటికీ బాధపడుతున్న హీరోయిన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved