- Home
- Entertainment
- 2 లక్షల నుంచి 9 కోట్ల వరకు, విజయ్ దళపతి గ్యారేజ్ లో కాస్ట్లీ కార్ల లిస్ట్ ఎంత పెద్దతో తెలుసా?
2 లక్షల నుంచి 9 కోట్ల వరకు, విజయ్ దళపతి గ్యారేజ్ లో కాస్ట్లీ కార్ల లిస్ట్ ఎంత పెద్దతో తెలుసా?
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ 51వ పుట్టినరోజు (జూన్ 22) సందర్భంగా ఆయన ఖరీదైన కార్ల కలెక్షన్ గురించి తాజాగా ఆసక్తికరమైన వివరాలు వెలుగులోకి వచ్చాయి. టాటా ఎస్టేట్ కారుతో ప్రారంభించిన విజయ్ ప్రయాణం ఈ రోజు రూ. 8 కోట్ల రోల్స్ రాయిస్ ఘోస్ట్ వరకు చేరింది.

కార్లతో ప్రేమలో పడిపోయిన విజయ్
విజయ్ కెరీర్ ప్రారంభంలో 1990లలో టాటా ఎస్టేట్ మోడల్ కారును కొనుగోలు చేశారు. ఆ సమయంలో దాని ధర అప్పట్లోనే 2.52 లక్షలు. ఈ కారులో ఆయన తన స్నేహితులతో కలిసి చెన్నై మొత్తం చుట్టి వచ్చేవారట. ఇక ఆ తర్వాత, పాత మోడల్ ప్రీమియర్ 118 NE కారును 6 లక్షల ధరకు విజయ్ కొనుగోలు చేశారు విజయ్ కెరీర్ లో ఇది రెండో కారు.
1990లలోనే విజయ్ టయోటా సెరా అనే కారును కూడా సొంతం చేసుకున్నారు. ఈ కారు ఒక అంచనా ప్రకారం అప్పట్లోనే దాదాపు 15 లక్షల కాస్ట్ కు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
ఇక విజయ్ కు కార్లంటే ప్రేమ పెరిగిపోయింది. కార్లతో లవ్ లో పడిపోయిన విజయ్ తరువాత కొన్న కారు టయోటా ఇన్నోవా క్రిస్టా. దీని ధర 20 లక్షల నుండి రూ. 26.05 లక్షల మధ్యగా ఉంది. ఈ సమయంలో విజయ్ తరచూ కార్లు కొనడం అలవాటుగా మార్చుకున్నాడు. విజయ్ కార్ల ప్రేమ ఎంత ఉందంటే.. విజయ్ గ్యారేజీలో కార్ల పార్కింగ్ కోసం ప్రత్యేకంగా లిఫ్టింగ్ మోడల్ సిస్టమ్ ఉంది. అంటే ఆయన దగ్గర ఎన్ని కార్లు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
విజయ్ లగ్జరీ కార్ల జాబితాలోని ముఖ్యమైన మోడల్స్:
విజయ్ దగ్గర ఉన్న అత్యంత కాస్ట్లీ కారు ఇదే. రోల్స్ రాయిస్ ఘోస్ట్ ఫాంటమ్ – అత్యంత ఖరీదైన కారు దీని కాస్ట్ 9 కోట్ల వరకు ఉంటుంది. ఈ కారును విజయ్ ఎంతో ఇష్టపడి కొన్నారు. అఫీషియల్ అకేషన్స్ కు విజయ్ ఈ కారులోనే వెళ్తుంటారు.
దళపతి దగ్గర ఉన్న కాస్ట్లీ కార్లలో ఆడి A8 L మోడల్ కూడా ఒకటి. ఈ మోడల్ కారు ఇండియా మార్కెట్ లోకి వచ్చీ రాగానే విజయ్ దాన్ని సొంతం చేసుకున్నారు. దీని ధర రూ. 1.58 కోట్లు.
భార్య సంగీత కోరిక మేరకు కారు కొన్న విజయ్
విజయ్ తన భార్య సంగీత కోరిక మేరకు ఒక కారును కొనుగోలు చేశారు. అదే BMW X6 . దీని ధర 1.04 కోట్ల నుండి 1.11 కోట్ల మధ్య ఉంటుంది. ఇది ఒక రకంగా తన భార్యకు కానుకగా తీసుకున్నట్టు తెలుస్తోంది.
నిస్సాన్ ఎక్స్-ట్రాయిల్ కారు చూడటానికి చాలా అందంగా ఉంటుంది. మంచి ఫీచర్స్ కూడా ఉంటాయి. డ్రైవింగ్ చేయడానికి కూడా చాలా మృదువుగా ఉంటుంది. అందుకే ఈ కారును విజయ్ ఎంతో ఇష్టపడతారు. దీనిని దాదాపు 40 లక్షలు ఖర్చు పెట్టి విజయ్ కొనుగోలు చేసినట్టు సమాచారం.
ఇక చెన్నై సిటీలో ప్రయాణించడానికి విజయ్ ఏ కారు వాడతారో తెలుసా? ఇంటి నుంచి బయటకు వస్తు చాలు ఆయన ఎక్కే కారు BMW 7-సిరీస్. ఈ కారుతో పాటు ఆయన ఉపయోగించే మరో కారు మెర్సిడెస్ బెంజ్ GLA – కమాండర్ ఇన్ చీఫ్ మోడల్‌తో ఆకర్షణీయంగా కనిపించే ఈ కారును కూడా ఆయన కలెక్షన్‌లో ఉంచుకున్నారు. దీని ధర సుమారు 89 లక్షలు.
వింటేజ్ కార్ల పట్ల విజయ్ దళపతి ఆసక్తి
విన్టేజ్ కార్లంటే స్టార్ హీరో విజయ్ కు చాలా ఇష్టం. ఆ కార్ల మీద ఆయన ఎంతో ప్రేమ చూపిస్తారు. అయితే ఆయన ఎంత స్థాయికి ఎదిగిన, ఎన్ని కోట్లు పెట్టి కార్లు కొన్నా సరే, తాను మొదటగా కొనుగోలు చేసిన కార్లను ఆయన ఇప్పటికీ మర్చిపోలేదు. తన గ్యారుజ్ లో వాటికి ప్లేస్ అలాగే ఉంచారు.
విజయ్ కార్ల ఎంపిక చూసిన వారు ఆయనలోని స్టైల్, క్లాస్, వ్యక్తిత్వాన్నిగుర్తిస్తారు. ఈ విషయంలో విజయ్ సెలక్షన్ ఆయన్ను తమిళ సినీ పరిశ్రమలో విలాసవంతమైన స్టార్‌గా మరింత గుర్తింపు ఇచ్చింది.
బాలనటుడిగా విజయ్ ఎంట్రీ
తమిళ సినీ పరిశ్రమలో చాలా చిన్న వయసులోనే కెమెరా ముందుకు వచ్చిన హీరోలో విజయ్ కూడా ఒకరు. బాలనటుడిగా తన సినిమా ప్రస్తానాన్ని స్టార్ట్ చేసిన విజయ్ ఒక్కోమెట్టు ఎక్కుతూ ఎదుగుతూ.. స్టార్ హీరోగా మారారు. ప్రస్తుతం సినిమా ఒక్కింటికే 200 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్న విజయ్, తన సినీ ప్రస్థానాన్ని చైల్డ్ ఆర్టిస్ట్ గా ప్రారంభించారు.
విజయ్, తమిళ సినీ దర్శకుడు ఎస్.ఎ. చంద్రశేఖర్, గాయని శోభ దంపతులకు జన్మించారు. కెమెరా ముందు విజయ్ మొదటిసారి కనిపించిన చిత్రం ‘వెట్రి’, ఇది 1984లో విడుదలైంది. ఈ చిత్రానికి విజయ్ తండ్రే దర్శకత్వం వహించగా, విజయ్ బాలనటుడిగా ప్రధాన పాత్రలో నటించారు.
అంతేకాకుండా, విజయ్ ‘కుట్టం’, ‘నాన్ సిగప్పు మనితన్’, ‘వసంత రాగం’, ‘ఛమ్తా ఒరు వైలత్త’, ‘ఇతు అంక నీతి’ వంటి పలు చిత్రాల్లో బాలనటుడిగా మెప్పించారు. బాల నటనతో మంచి గుర్తింపు పొందిన విజయ్, ‘నాలియా తీర్‌ప్’ అనే చిత్రంతో హీరోగా అరంగేట్రం చేశారు. ఈ చిత్రానికి కూడా ఆయన తండ్రే దర్శకత్వం వహించారు.
క్రమంగా విజయ్ హీరోగా తన స్థానం పదిలం చేసుకున్నాడు. 1990ల నుంచి విజయ్ సినిమాలకి భారీగా ఆదరణ పెరిగింది. 2000ల మధ్యకాలంలో విజయ్ బాక్సాఫీస్ విజయాలతో స్టార్ హీరోగా ఎదిగారు. ప్రస్తుతం ఆయన ఒక్క సినిమాకే 200 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. అంతే కాదు రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఈ స్టార్ హీరో తన చివరి సినిమా జననాయకన్ ను హెచ్ వినోద్ డైరెక్షన్ లో నటిస్తున్నారు.