MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • TV
  • Gunde Ninda Gudi Gantalu: మీనాని అవమానించిన చింటూ అమ్మమ్మ, రోహిణీ ప్లాన్ పసిగట్టిన బాలు

Gunde Ninda Gudi Gantalu: మీనాని అవమానించిన చింటూ అమ్మమ్మ, రోహిణీ ప్లాన్ పసిగట్టిన బాలు

Gunde Ninda Gudi Gantalu:మీనా పెట్టిన బొమ్మల కొలువుకు చింటూని తీసుకురావాలని బాలు అనుకుంటాడు.మరో వైపు మౌనిక కడుపులో బిడ్డకు తనకు సంబంధం లేదు అంటూ సంజూ బాంబు పేల్చాడు. మరి, నేటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.. 

4 Min read
Author : ramya Sridhar
Published : Mar 03 2026, 10:29 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
రోహిణీ మాస్టర్ ప్లాన్...
Image Credit : Jio Hotstar

రోహిణీ మాస్టర్ ప్లాన్...

బాలు ఫోన్ చేసి సుగుణమ్మను బొమ్మల కొలువుకు పిలుస్తాడు. ఆవిడ రాను అని చెప్పినా రావాల్సిందే అని బలవంతపెడతాడు. దీంతో.. ఆవిడ రోహిణీకి ఫోన్ చేసి విషయం మొత్తం చెబుతుంది. దీంతో.. రోహిణీ బాగా ఆలోచించి.. బొమ్మల కొలువుకు రమ్మని పిలుస్తుంది. కానీ..ఎలా రావాలో.. ఓ మాస్టర్ ప్లాన్ చెబుతుంది. అది విన్న సుగుణమ్మ అలానే చేస్తాను అని చెబుతుంది.

మరోవైపు శివ పూర్తిగా మారిపోతాడు. బుద్ధిగా కాలేజీకి వెళ్తూ ఉంటాడు. మరో రెండు రోజుల్లో పరీక్షలు ఉన్నాయని.. బాగా రాయాలి అని తన ఫ్రెండ్ తో చెబుతూ ఉంటాడు. అప్పుడే దూరం నుంచి శివను గుణ చూస్తాడు. ‘ ఈ శివ రోజు రోజుకీ బుద్ధి మంతుడులా తయారౌతున్నాడు. వీడు పక్కన లేకపోతే మన లెక్కలు చూసేవాళ్లు లేకుండాపోయారు. ఎలాగైనా వీడిని మళ్లీ మన గ్యాంగ్ లో చేర్చుకోవాలి’ అని తన అనుచరులతో చెబుతాడు. వెళ్తున్న శివని ఆపి.. ఎక్కువ డబ్బు ఆశ చూపుతాడు. కానీ.. శివ లెక్క చేయడు. పట్టించుకోకుండా వెళ్లిపోతాడు. దీంతో.. శివను పరీక్షలు రాయకుండా చేయాలని గుణ మరో ప్లాన్ వేస్తాడు.

ఇక.. రోహిణీ, వింధ్య ఇద్దరూ కలిసి బాలు ఫోన్ నుంచి వీడియో ఎలా కొట్టేయాలా అని ఆలోచించుకుంటూ ఉంటారు. అయితే.. బాలు, మీనా ఊరికే..చింటూని కలవాలని చూస్తున్నారని.. అలా ఇంకోసారి జరగకుండా ఉండాలని రోహిణీ అంటుంది. అందుకోసమే... బాలు, మీనాకి ఈ రోజు అవమానం చేయాలని ప్లాన్ చేశాను అని చెబుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
అందరి ముందు చింటూపై రోహిణీ ప్రేమ..
Image Credit : Jio Hotstar

అందరి ముందు చింటూపై రోహిణీ ప్రేమ..

సరిగ్గా అదే సమయానికి బాలు... చిన్ని కృష్ణుడి గెటప్ లో చింటూని తీసుకువస్తాడు.చాలా ముద్దుగా ఉన్నాడు అని అందరూ ముద్దు చేస్తారు. చింటూని అలా చూసి రోహిణీ తల్లి మనసు అల్లాడిపోతుంది. ఎంత కంట్రోల్ చేసుకోవాలన్నా చేసుకోలేకపోతుంది. వెంటనే వెళ్లి.. ఎంత ముద్దుగా ఉన్నావ్ అంటూ హగ్ చేసుకొని ముద్దులు పెడుతుంది. అందరూ షాక్ అయ్యి చూస్తారు.‘ నీ కోడలు ఏంటి? తన సొంత కొడుకును ముద్దు చేసినట్లు చేస్తోంది..?’ అని కామాక్షి అంటే.. రోహిణీకి అబార్షన్ అయ్యింది కదా.. తల్లి మనసు అల్లాడిపోతుంది’ అని ప్రభావతి అంటుంది. ‘ ఇంట్లో బొమ్మల కొలువు పెట్టాం.. హోమం చేశాం కదా.. నీకు కూడా పిల్లలు పుడతారు’ అని సత్యం రోహిణీతో చెబుతాడు.

34
బాలు, మీనాలను అవమానించిన సుగుణమ్మ..
Image Credit : Jio Hotstar

బాలు, మీనాలను అవమానించిన సుగుణమ్మ..

ఇక.. చింటూని దత్తత తీసుకోవాలని అందరి ముందు.. సుగుణమ్మను బాలు అడుగుతాడు. రోహిణీ ప్లాన ప్రకారం సుగుణమ్మ ప్రవర్తిస్తుంది. నా మనవడుని నాకు దూరం చేయాలని చూస్తున్నారా అని రివర్స్ అవుతుంది. మా మనవడు బాధ్యతను తీసుకోమని నేను మీకు చెప్పానా అంటూ ఆమె అన్న మాటలకు బాలు, మీనా షాక్ అవుతారు. అయితే, ఆమె మాటలకు కామాక్షికి బాగా కోపం వస్తుంది. ‘ మీకు పిల్లలు పుట్టరు అని డాక్టర్లు చెప్పారా? రోడ్డున పోయే వాళ్ల బాధ్యత తీసుకోవాలని అనుకుంటే ఇలానే మాట్లాడతారు’ అని కామాక్షి గడ్డి పెడుతుంది.

కానీ,బాలు మీనా మంచిగా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ‘ మీ ఆరోగ్యం బాగోలేదని.. మీకు ఏదైనా అయితే చింటూ అనాథ అయిపోతాడని మీరు బాధ పడ్డారు కదా’ అని అంటే.. సుగుణమ్మ వినదు. ‘ మీకు పిల్లలు దత్తత కావాలంటే అనాథ ఆశ్రమం నుంచి తెచ్చుకోండి..నా చింటూకి అమ్మమ్మని నేను ఉన్నాను..’ అని చెబుతుంది. ఆమె మాటలకు బాలు, మీనా కాస్త ఎక్కువగానే హర్ట్ అవుతుంది. సత్యం, సుశీలమ్మ కూడా.. మీకు దత్తత ఇవ్వడం ఇష్టం లేకపోతే సున్నితంగా చెప్పొచ్చు కదా అని అంటారు. కానీ.. సుగుణమ్మ మాత్రం.. బాలు, మీనా పరువు తీసేలా మాట్లాడుతుంది. ఇంకోసారి మా మనవడు జోలికి రావద్దు అని వార్నింగ్ ఇస్తుంది.

అయితే.. ఎవరి దగ్గర ఉండాలో చింటూని అడగమని మీనా అంటుంది. చింటూని అడిగితే..మా అమ్మ దగ్గర ఉండాలని ఉంది అంటాడు. ఆ మాటకు అందరూ షాక్ అవుతారు. వాళ్ల అమ్మ ఎక్కడ ఉంది? తన సుఖం చూసుకుంది కదా అని సుశీలమ్మ అంటే.. మా తిప్పలు మేము పడతాం అని.. సుగుణమ్మ.. చింటూని తీసుకొని వెళ్లిపోతుంది. అయితే.. ఆవిడ బయటకు వెళ్లిన తర్వాత బాలు, మీనాలను అనరాని మాటలు అన్నాను అని చాలా బాధపడుతుంది. మీనా కూడా ఆవిడ మాటలకు చాలా ఏడుస్తుంది.

44
కూతురికి శాపం పెట్టిన సుగుణమ్మ..
Image Credit : Jio Hotstar

కూతురికి శాపం పెట్టిన సుగుణమ్మ..

ఆవిడ వెళ్లగానే ప్రభావతి మొదలుపెడుతుంది.బాలు, మీనాలను చాలా ఘోరంగా తిడుతుంది. అడ్డమైన వాళ్లను తీసుకొచ్చి నా ఇంటి పరువు తీస్తారా అని సీరియస్ అవుతుంది. కామాక్షి మాత్రం.. చింటూ తల్లి గురించి దారుణంగా మాట్లాడుతుంది. ఆ మాటలు వినలేక రోహిణీ కూడా ప్రభావతికి వంత పాడుతుంది.‘ అసలు వీళ్లు ఎందుకు ఆ పిల్లాడిని దత్తత తీసుకోవాలి?’ అని అంటుంది.

ఇక.. సుగుణమ్మ.. బాలు, మీనాలను తిట్టినందుకు చాలా బాధపడుతుంది. అప్పుడే అక్కడికి రోహిణీ వస్తుంది.‘ చింటూ తిన్నాడా? నువ్వు తిన్నావా అమ్మ’ అని అడుగుతుంది. సుగుణమ్మ సీరియస్ అవుతుంది. ‘ నీ కడుపు నిండింది కదా.. బాలు, మీనా ఎంత బాధ పడ్డారో’ అని అంటుంది. ‘ లేకపోతే వాళ్లకు దత్తత ఇస్తావా? వాడు ఏదో ఒక రోజు అందరి ముందు నన్ను అమ్మా అని పిలిస్తే.. నా కాపురం ఏమైపోతుంది?’ అని రోహిణీ అంటుంది. ఇక.. సుగుణమ్మ రెచ్చిపోతుంది. ‘ నీ స్వార్థం నువ్వు చూసుకున్నావ్.. ఎంత సేపటికీ నీ కాపురం గురించే కానీ.. తల్లి గురించి, కొడుకు గురించి ఏ రోజు అయినా పట్టించుకున్నావా? బిడ్డను కని నా మొహనా పడేసి వెళ్లిపోయావ్.. నీకు అసలు కొడుకు అనుకుని చెప్పే హక్కు కూడా లేదు. ఏదో ఒక రోజు నీ అసలు రంగు బయటపడుతుంది.. అప్పుడు ఏం చేస్తావ్?’ అని కూతురిని దారుణంగా తిట్టేస్తుంది.‘ మంచి మనసుతో బిడ్డను దత్తత తీసుకోవాలని వచ్చిన బాలు, మీనా మనసు బాధ పెట్టినందుకు కచ్చితంగా ఉసురు తగులుతుంది’ అని సుగుణమ్మ అన్న మాటలకు రోహిణీ కుప్పకూలిపోతుంది.

ఇక.. మీనా జరిగిన దాన్నే తలుచుకొని బాధ పడుతూ ఉంటుంది. బాలు వచ్చి ఓదారుస్తాడు. అంతేకాకుండా.. సుగుణమ్మ ఇలా మాట్లాడే మనిషి కాదని.. చింటూ తల్లికి ఇష్టం లేకపోవడం వల్ల ఆవిడ కారణంగానే సుగుణమ్మ అలా మాట్లాడి ఉంటుందని బాలు అంటాడు. ఆ మాటలను రోహిణీ చాటుగా వింటుంది. కొద్ది రోజుల తర్వాత అయినా.. సుగుణమ్మ చింటూని మనకు ఇస్తుందిలే అని బాలు ధైర్యం చెబుతాడు.

ఇక.. మౌనికను తీసుకొని కుటుంబ సభ్యులంతా గుడికి వస్తారు. అయితే.. ఆ గుడికి రాలేదని మీనాని మనోజ్ తక్కువ చేస్తాడు. పని తప్పించుకోవడానికి రాలేదని మీనాపై ప్రభావతి విమర్శలు చేస్తుంది. అయితే.. మౌనిక, సత్యం మాత్రం ఊరుకోరు. మీనా ఇలా పని తప్పించుకునే వ్యక్తి కాదని చాలా గొప్పగా మాట్లాడతారు. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది..

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: 6 క్లాస్‌ ఫెయిల్‌ అయిన దేబ్జానీ, లైఫ్‌లో అతిపెద్ద సీక్రెట్‌ రివీల్‌.. నాగార్జున రియాక్షన్‌ ఇదే
Recommended image2
Bigg Boss Telugu 10: బిగ్‌ బాస్‌ హౌజ్‌లో మరో క్రేజీ లవ్‌ ట్రాక్‌.. వర్కౌట్‌ అయితే టీఆర్‌పీ బ్లాస్టే
Recommended image3
Chaitra Rai Remuneration: ఐదు రోజులకు చైత్ర రాయ్‌ ఎంత పారితోషికం అందుకుందో తెలుసా?.. ఆ భ్రమలకు ఫుల్‌ స్టాప్‌
Related Stories
Recommended image1
Gunde Ninda Gudi Gantalu:గుణకి వీడియో పంపిన రోహిణీ..‘మౌనిక కడుపులో బిడ్డకు నేను కారణం కాదు’ బాంబు పేల్చిన సంజూ
Recommended image2
Gunde Ninda Gudi Gantalu: మౌనిక ప్రెగ్నెంట్, సంజూ కి ఫ్యూజులు ఔట్..ఉడకని రోహిణి పప్పులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved