బిచ్చగాడి పాత్రలో ధనుష్ కంటే ముందు నటించిన స్టార్ హీరోలు ఎవరో తెలుసా?
కుబేర సినిమాలో బిచ్చగాడి పాత్రలో ధనుష్ అద్భుతంగా నటించాడు. ఏ స్టార్ హీరో చేయని సాహసం ధనుష్ చేశాడు. ఇక ధనుష్ కంటే ముందు బిచ్చగాడి పాత్రను చేసిన హీరోలు ఎవరో తెలుసా?

సినిమాల్లో ఏ పాత్ర ఇచ్చినా అద్భుతంగా నటించే అతి కొద్దిమందిలో ఒకరు ధనుష్. ఆయన నటించిన కుబేరా సినిమా తాజాగా రిలీజ్ అయ్యింది. అందులో ఆయన నటన అందరినీ ఆకట్టుకుంది. ఆ సినిమాలో భిక్షగాడిగా నటించారు ధనుష్.
వేరే ఏ హీరో అయినా ఇలాంటి చేయడానికి ఒప్పుకోరు. కాని కాని కథ కోసం ఎలాంటి పాత్ర పోషించడానికైనా ధనుష్ రెడీగా ఉంటారు. తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ చిత్రానికి ధనుష్ కి జాతీయ అవార్డు ఇవ్వాలని ఆయన అభిమానులు కోరుతున్నారు. అయితే ధనుష్ కంటే ముందు భిక్షగాడి పాత్రలో నటించిన నటులు ఎవరెవరో తెలుసా?
నటుడు, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని భిచ్చగాడు అనే సినిమాలో ఈ పాత్రను చేశారు. ఈ సినిమా దాదాపు 8 ఏళ్ళ క్రితం సంచలనంగా మారింది. . శశి దర్శకత్వంలో 2016లో విడుదలైన ఈ చిత్రం తెలుగు, తమిళంలో విజయం సాధించింది.
అనారోగ్యంతో ఉన్న తన తల్లి కోసం కొన్ని రోజులు భిక్షగాడిగా బతికే ఓ ధనవంతుడి కథ ఇది. విజయ్ ఆంటోని కెరీర్ లో ఈ చిత్రం మంచి మలుపు. ఆ తర్వాత భిక్షగాడు 2 చిత్రంలో కూడా నటించాడు విజయ్. కాని ఈ సినిమా అంతగా ప్రభావం చూపించలేదు.
సూపర్ స్టార్ రజినీకాంత్ అంతటి పెద్ద నటుడే బెగ్గర్ పాత్రలో నటించడానికి వెనకాడలేదు. రజినీకాంత్ కెరీర్ లో అత్యధిక విజయవంతమైన చిత్రాలు ఇచ్చిన దర్శకుడు కె.ఎస్.రవికుమార్. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ముత్తు సినిమాలో రజినీకాంత్ ద్విపాత్రాభినయం చేశారు.
ఈసినిమాలోో జమీందారుగా ఉండి, ఆ తర్వాత భిక్షగాడిగా మారతారు సూపర్ స్టార్. ఆ భిక్షగాడి వేషం ముత్తు సినిమాకే హైలైట్ గా నిలిచింది. సూపర్ స్టార్ అయినప్పటికీ రజినీకాంత్ ఇలాంటి పాత్రలో నటించడంతో ఇండస్ట్రీ అంతా షాక్ అయ్యింది.
భిక్షగాడిగా నటించిన మరో హీరో శివ కార్తికేయన్. ఈ యంగ్ హీరో కూడా భిక్షగాడి పాత్రలో నటించారు. మొత్తం సినిమాలో కాకపోయినా ఒక కామెడీ సన్నివేశంలో భిక్షగాడిగా నటించారు. ఆ సినిమా ఏదో కాదు ధనుష్ నిర్మించిన కాకి సట్టై. ఆ చిత్రంలో శివ కార్తికేయన్ మఫ్టీ పోలీస్ గా ఉండి, యోగిబాబుతో కలిసి భిక్షం అడిగే సన్నివేశం ప్రేక్షకులను నవ్వించింది.
హీరో భరత్ ఇండస్ట్రీకి పరిచయమైన సినిమా ప్రేమిస్తే. ఈసినిమా అప్పట్లో తమిళ, తెలుగు ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఈ చిత్రానికి బాలాజీ శక్తివేల్ దర్శకత్వం వహించారు. సంధ్య సంధ్య హీరోయిన్ గా నటించిన ఈసినిమాలో హీరోయిన్ ప్రేమను దక్కించుకోలేకపోయిన హీరో, ఆమెకు పెళ్లైపోవడంతో పిచ్చివాడు అవుతాడు. దీంతో రోడ్డు మీద భిక్షం అడుక్కుంటూ తిరుగుతాడు. చివర్లో అతను భిక్షగాడిగా వచ్చే సీన్స్ కు థియేటర్ లో జనం వెక్కి వెక్కి ఏడ్చారు.
తమిళ హీరో కవిన్ కూడా బిచ్చగాడి పాత్రలో నటించి మెప్పించారు. 2024 దీపావళికి విడుదలైన బ్లడీ బెగ్గర్ చిత్రంలో భిక్షగాడిగా కనిపించాడు యంగ్ స్టార్. నెల్సన్ నిర్మించిన ఈ సినిమాను హీరో భిక్షగాడి వేషంలో ఉన్న ఫోటోలతో ప్రమోట్ చేశారు. ఆ పాత్ర కోసం చాలా గంటలు మేకప్ వేసుకుని నటించారు కవిన్. కానీ ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయింది.