విజయ్ సేతుపతి 'ఏస్' మూవీ మూడు రోజుల కలెక్షన్లు.. సూరి రూపంలో గట్టి దెబ్బ
ఆరుముగ కుమార్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, రుక్మిణి వసంత్ నటించిన 'ఏస్' సినిమా మూడు రోజుల్లో ఎంత వసూలు చేసిందో తెలుసుకుందాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
విజయ్ సేతుపతి `ఏస్` మూవీ కలెక్షన్లు
`మహారాజా` తర్వాత విజయ్ సేతుపతి నుంచి వచ్చిన లేటెస్ట్ మూవీ `ఏస్`. ఈ చిత్రానికి ఆరుముగ కుమార్ దర్శకత్వం వహించారు. విజయ్ సేతుపతి, ఆరుముగ కుమార్ కాంబినేషన్ లో ఇది రెండోసినిమా. ఈ చిత్రాన్ని దర్శకుడు ఆరుముగ కుమారే నిర్మాత. ఈ చిత్రంలో విజయ్ సేతుపతికి జంటగా కన్నడ నటి రుక్మిణి వసంత్ నటించారు.
`ఏస్` మూవీకి సూరి `మామన్` దెబ్బ
`ఏస్` సినిమా మే 23న విడుదలైంది. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి - యోగిబాబు మధ్య కామెడీ సన్నివేశాలు అలరించినప్పటికీ, కథ బలంగా లేకపోవడంతో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. అంతేకాకుండా థియేటర్లలో సూరి నటించిన `మామన్` సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతుండటంతో `ఏస్` సినిమా దానికి పోటీ ఇవ్వలేకపోయింది.
`ఏస్` మూవీ మూడు రోజుల కలెక్షన్లు
మిశ్రమ స్పందన కారణంగా `ఏస్` సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా సత్తా చాటలేకపోతుంది. ఈ చిత్రం తమిళనాడులో విడుదలైన మొదటి రోజు కేవలం రూ.75 లక్షలు మాత్రమే వసూలు చేసింది. రెండో రోజు రూ.96 లక్షలు వసూలు చేసింది. మూడో రోజు రూ.1.03 కోట్లు వసూలు చేసింది. దీంతో మొత్తం మీద తమిళనాడులో 3 రోజుల్లో `ఏస్` సినిమా 2.75 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగింది.
సూరి `మామన్` ఒక్కరోజే మూడు కోట్లు
`ఏస్` సినిమా వసూళ్లు తగ్గడానికి ప్రధాన కారణం సూరి `మామన్` మూవీనే. ఆ చిత్రం రెండో వారంలో కూడా కుటుంబ ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందనను పొందుతుండటంతో `ఏస్` సినిమా దానికి పోటీ ఇవ్వలేకపోయింది. సూరి నటించిన `మామన్` సినిమా ఆదివారం ఒక్కరోజే తమిళనాడులో రూ.3.13 కోట్లు వసూలు చేయడం విశేషం.