MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • హీరో సూర్య ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు ?.. సామాజిక వర్గంపై మంచు మనోజ్ కామెంట్స్, మెగా ఫ్యాన్స్ కి క్షమాపణ

హీరో సూర్య ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు ?.. సామాజిక వర్గంపై మంచు మనోజ్ కామెంట్స్, మెగా ఫ్యాన్స్ కి క్షమాపణ

మంచు మనోజ్ ఎప్పుడు ఏం మాట్లాడినా సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతుంది. తాజాగా భైరవం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మంచు మనోజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : May 26 2025, 07:17 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
భైరవం ప్రీ రిలీజ్ ఈవెంట్
Image Credit : Asianet News

భైరవం ప్రీ రిలీజ్ ఈవెంట్

మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ కలిసి నటించిన భైరవం చిత్రం మే 30న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. విజయ్ కనకమేడల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని రాధా మోహన్ నిర్మించారు. రిలీజ్ టైం దగ్గర పడుతుండడంతో హైదరాబాద్ లో  గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇటీవల ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మంచు మనోజ్ కామెంట్స్ వైరల్ అయ్యాయి. మరోసారి మంచు మనోజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సామాజిక వర్గంపై కామెంట్స్
Image Credit : Asianet News

సామాజిక వర్గంపై కామెంట్స్

ఈ చిత్రంలో నటించడం వల్ల నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్ లతో నాకు అనుబంధం మరింతగా పెరిగింది. నేను ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా. కష్టాల్లో ఉన్నప్పుడు నా సెక్యూరిటీ సిబ్బంది, ఇంట్లో పని చేసే సిబ్బంది, డ్రైవర్లు ఇలా ప్రతి ఒక్కరు నాకు అండగా నిలిచారు. ఇటీవల భైరవం చిత్రం గురించి కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఒకే సామాజిక వర్గానికి చెందిన హీరోలు, దర్శకుడు, నిర్మాత కలసి ఈ చిత్రాన్ని చేస్తున్నారంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

Related image1
మెగా 157 కోసం పుష్ప 2 యాక్షన్ కొరియోగ్రాఫర్.. ఊర మాస్ ఫైట్స్ లోడింగ్
Related image2
వరుస డిజాస్టర్లతో నా పనైపోయింది, చిరంజీవి సరస్వతి దేవి మీద ఒట్టేశారు.. తండ్రీ కొడుకులపై డైరెక్టర్ కామెంట్స్
35
హీరో సూర్య ఎవరు?
Image Credit : our own

హీరో సూర్య ఎవరు?

సినిమాకి సామాజిక వర్గం లేదు. మా సామాజిక వర్గం సినిమా మాత్రమే. కళామతల్లి.. ప్రతిభ మాత్రమే చూస్తుంది. హీరో సూర్య ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? అయినప్పటికీ ఆయనకి తెలుగులో ఎంత ఆదరణ ఉందో తెలుసు కదా. టాలెంట్ ఉన్న ఎవరినైనా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు. టాలెంట్ ఉంటే ఇతర విషయాలు పట్టించుకోరు అని మంచు మనోజ్ కామెంట్స్ చేశారు.

45
మా బ్యాగ్రౌండ్ చూడలేదు
Image Credit : Asianet News

మా బ్యాగ్రౌండ్ చూడలేదు

ఈ చిత్ర నిర్మాత రాధామోహన్ మా సామాజిక వర్గం ఏంటి అనేది చూడలేదు. మా ముగ్గురిని నమ్మి ఆయన ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎవరినైనా పదివేల రూపాయలు అడిగి చూడండి. ఎంతగా ఆలోచిస్తారో తెలుస్తుంది. కానీ నిర్మాతలు అలా కాదు. మా టాలెంట్, కష్టాన్ని చూసి సినిమాకి డబ్బులు పెడుతుంటారు. లాభం వస్తుందా రాదా అనేది తర్వాత. హీరోల బ్యాగ్రౌండ్ ఏంటి అనేది ఏ నిర్మాత పట్టించుకోరు అని మంచు మనోజ్ కామెంట్ చేశారు.

55
మెగా ఫ్యాన్స్ కి క్షమాపణ
Image Credit : our own

మెగా ఫ్యాన్స్ కి క్షమాపణ

దయచేసి చిత్ర పరిశ్రమలోకి సామాజిక వర్గాల ప్రస్తావన తీసుకురావద్దు అని కోరారు. ఇటీవల ఈ చిత్రాన్ని బాయ్ కాట్ చేయాలని ట్రెండ్ చేశారు. విజయ్ కనకమేడల మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా ఏదో పోస్ట్ పెట్టారంటూ ట్రోల్ చేశారు. అది నిజమో కాదో తెలియదు. కానీ విజయ్ కనకమేడల.. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ లకు వీరాభిమాని. మెగా అభిమానుల్ని ఆయన సొంత ఫ్యామిలీ లాగా భావిస్తారు. ఏదైనా పోస్ట్ వలన మెగా ఫ్యాన్స్ ఇబ్బంది పడితే మా టీం తరపున నేను క్షమాపణ చెబుతున్నా. మెగా ఫ్యాన్స్ మా చిత్రానికి సపోర్ట్ చేయాలని కోరుతున్నా అంటూ మనసు మనోజ్ తెలిపారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
మంచు మనోజ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Spirit: ప్రభాస్ 'స్పిరిట్'కి పక్కా 'A' సర్టిఫికెట్.. సందీప్ రెడ్డి వంగా కామెంట్స్, రిలీజ్ డేట్ పై క్లారిటీ
Recommended image2
Makutam OTT: థియేటర్లలో ఫ్లాప్ అయిన విశాల్ 'మకుటం'.. నెలరోజుల్లోపే ఓటీటీలోకి, ఎప్పటి నుంచి అంటే
Recommended image3
Toxic Team Salary: టాక్సిక్‌ హీరోయిన్లు.. కియారా, నయన్, రుక్మిణి.. ఎవరికి ఎక్కువ పారితోషికం? యశ్‌ రేంజ్‌ ఇదే
Related Stories
Recommended image1
మెగా 157 కోసం పుష్ప 2 యాక్షన్ కొరియోగ్రాఫర్.. ఊర మాస్ ఫైట్స్ లోడింగ్
Recommended image2
వరుస డిజాస్టర్లతో నా పనైపోయింది, చిరంజీవి సరస్వతి దేవి మీద ఒట్టేశారు.. తండ్రీ కొడుకులపై డైరెక్టర్ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved