MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • `బాహుబలి`కి రాజమౌళి, ప్రభాస్‌ ఫేస్‌ చేసిన స్ట్రగుల్‌ ఇదే, విజయ్‌ చెప్పిన నిజాలు.. బాలీవుడ్‌పై షాకింగ్‌ కామెంట్

`బాహుబలి`కి రాజమౌళి, ప్రభాస్‌ ఫేస్‌ చేసిన స్ట్రగుల్‌ ఇదే, విజయ్‌ చెప్పిన నిజాలు.. బాలీవుడ్‌పై షాకింగ్‌ కామెంట్

Vijay Deverakonda: విజయ్‌ దేవరకొండ తాజాగా `టీవీ9విట్‌-2025` సమ్మిట్‌లో పాల్గొన్నారు. టాలీవుడ్‌, బాలీవుడ్‌పై ఇంట్రెస్టింగ్‌ కామెంట్‌ చేశారు. సినిమాల్లో వస్తున్న మార్పులపై ఇంట్రెస్టింగ్‌ కామెంట్‌ చేశారు. 

3 Min read
Author : Aithagoni Raju
Published : Mar 29 2025, 08:43 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
vijay deverakonda

vijay deverakonda

Vijay Deverakonda: రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ నటుడిగా ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్‌ చేసి వచ్చిన హీరో. `పెళ్ళి చూపులు`, `అర్జున్‌రెడ్డి`, `గీతగోవిందం` సినిమాలతో ఆయన రేంజ్‌ మారిపోయింది. స్టార్‌ హీరోల జాబితాలో చేరిపోయాడు. ఆ తర్వాత ఆ రేంజ్‌ విజయాలు పడలేదు. వరుసగా నాలుగు సినిమాలు బోల్తా కొట్టాయి. `ఖుషి` రిలీఫ్‌నివ్వగా, `ఫ్యామిలీ స్టార్‌` మూవీ డిజప్పాయింట్‌ చేసింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
vijay deverakonda (Phot Credit -Tv9WIIT2025)

vijay deverakonda (Phot Credit -Tv9WIIT2025)

ఇప్పుడు భారీ లైనప్‌తో ఉన్నారు విజయ్‌ దేవరకొండ. తాజాగా ఆయన జాతీయ స్థాయి ఈవెంట్‌లో పాల్గొన్నారు. టీవీ9 గ్రూప్‌ నిర్వహించిన `వాట్‌ ఇండియా థింక్ టుడే`(విట్‌-2025) సమ్మిట్‌లో పాల్గొన్నారు. ఇందులో ఆయన ఇండియన్‌ సినిమా గురించి మాట్లాడారు.

సినిమాల్లో వస్తున్న మార్పులు, ఏఐ టెక్నాలజీ, ప్రాంతీయ భాషలుగా ఉన్న సినిమా ఒక్కటి కాబోతుందని, లాంగ్వేజ్‌ బారియర్స్ లేవని తెలిపారు. ఈ క్రమంలో ఆయన ఆసక్తికర, షాకింగ్‌ స్టేట్ మెంట్స్ ఇచ్చారు. 

37
vijay deverakonda (Phot Credit -Tv9WIIT2025)

vijay deverakonda (Phot Credit -Tv9WIIT2025)

టాలీవుడ్‌ ఒకప్పుడు ఆడియెన్స్ రీచ్‌ కోసం స్ట్రగుల్‌ అయ్యిందన్నారు. `బాహుబలి` సినిమా సమయంలో టాలీవుడ్‌ ఎంతో స్ట్రగుల్‌ ఫేస్‌ చేసిందన్నారు. రాజమౌళి, ప్రభాస్‌, రాజా వంటి స్టార్ట్ ఎంతో కష్టపడి ఆ మూవీని తెరకెక్కించారు. మార్కెట్‌ని మించి ఖర్చు చేశారు. దీంతో ఓ దశలో ఆడియెన్స్ రీచ్‌ కోసం స్ట్రగుల్‌ అయ్యారు.

కానీ `బాహుబలి` సక్సెస్‌ కొత్త మార్కెట్‌ని ఏర్పాటు చేసి, ఎంతో మందికి లైఫ్‌ ఇచ్చిందని, లాంగ్వేజ్‌ బారియర్స్ ని బ్రేక్‌ చేసిందన్నారు. తెలుగు సినిమా పాన్‌ ఇండియా మూవీగా ఎదిగిందని, ఇప్పుడు అంతా సౌత్‌ సినిమాని చూడటం కోసం వెయిట్‌ చేస్తున్నారని, అందులో తాను భాగం కావడం గర్వంగా ఉందన్నారు. 
 

47
vijay deverakonda (Phot Credit -Tv9WIIT2025)

vijay deverakonda (Phot Credit -Tv9WIIT2025)

ఆరేడు ఏళ్ల క్రితం విజయ్‌ దేవరకొండ అంటే ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు దేశమంతా తెలుసు. ఇదంతా సినిమా, ఆడియెన్స్ ప్రేమ వల్లే సాధమైంది. కష్టపడుతూ మనం ఏంటో నిరూపించుకున్నప్పుడు,

మన ప్రయత్నం జెన్యూన్‌ గా ఉన్నప్పుడు ఆడియెన్స్ ప్రేమిస్తారని, తీసుకెళ్లి ఎక్కడో కూర్చోబెడతారని, అందుకు తానే ఉదాహరణ అని అన్నారు. ఇప్పుడు మీ ముందు ఇలా మాట్లాడుతున్నానంటే అదే కారణమని చెప్పారు. 
 

57
vijay deverakonda (Phot Credit -Tv9WIIT2025)

vijay deverakonda (Phot Credit -Tv9WIIT2025)

ఈ క్రమంలో బాలీవుడ్‌పై షాకింగ్‌ కామెంట్‌ చేశారు. ఏదైనా ఒక సర్కిల్‌లాగా నడుస్తుంది. ఒకప్పుడు బాలీవుడ్‌ ఇండియన్‌ మూవీని లీడ్‌ చేసిందని, కానీ ఇప్పుడు స్ట్రగుల్‌ అవుతుందన్నారు. బాలీవుడ్‌లో కొత్త టాలెంట్‌ రావాలి, కొత్త ఆలోచనలు రావాలి. నార్త్ లో ఉన్న టాలెంటెడ్‌ మేకర్స్ బాలీవుడ్‌కి రావాలి, తమ కొత్త ఆలోచనలతో, కొత్త కథలతో సినిమా తీస్తే బాలీవుడ్‌ మారిపోతుంది.

మున్ముందు టాలీవుడ్‌ని దాటి ముందుకెళ్తుందన్నారు విజయ్‌. ఒకప్పుడు హిందీ సినిమా ప్రభావం ఎక్కువగా ఉందని, ఇప్పుడు తెలుగు సినిమా లీడ్‌ చేస్తుందని, రేపొద్దున మరో భాష సినిమాలు రావచ్చు, మళ్లీ బాలీవుడ్‌ పుంజుకునే అవకాశం ఉంది. ఇలా అంతా ఒక సైకిల్ లాగా జరుగుతుందని చెప్పారు విజయ్‌ దేవరకొండ. 
 

67
vijay deverakonda (Phot Credit -Tv9WIIT2025)

vijay deverakonda (Phot Credit -Tv9WIIT2025)

విజయ్‌ చేసిన ఈ కామెంట్స్ వైరల్‌ అవుతున్నాయి. ఈ సమ్మిట్‌తో విజయ్‌ రేంజ్‌ పెరిగిపోయిందని చెప్పొచ్చు. ఇందులో మిగిలిన వివిధ రంగాలకు చెందిన నిపుణులు పాల్గొన్నారు. ఆయా రంగంలో మార్పులు, ప్రస్తుత జనరేషన్‌ ఏం ఆలోచిస్తుందనేది తెలిపారు.

వారితో విజయ్‌ స్టేజ్‌ షేర్‌ చేసుకోవడం విశేషం. అంతేకాదు, ఇందులో వారంతా ప్రధానమంత్రి మోడీని కలిశారు. ఈ సందర్భంగా దిగిన ఫోటో వైరల్‌ అవుతుంది. 

read  more: విజయ్‌ దేవరకొండకి హీరోయిన్‌ దొరికింది.. చిరు దెబ్బకి రెండేళ్లు దూరమై ఇప్పుడు కమ్‌ బాక్‌?

77
Vijay Deverakonda Kingdom movie

Vijay Deverakonda Kingdom movie

ప్రస్తుతం విజయ దేవరకొండ `కింగ్‌డమ్‌` చిత్రంలో నటిస్తున్నారు. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుంది. నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మేలో విడుదల కానుంది.

అనంతరం రవికిరణ్‌ కోలా, రాహుల్‌ సాంక్రిత్యాన్‌ దర్శకత్వంలో మరోసినిమా చేయబోతున్నారు. ఈ మూడు భారీ పాన్‌ ఇండియా చిత్రాలుగా రాబోతున్నాయి. ఇవి ఆడితే విజయ్‌ సూపర్ స్టార్స్ జాబితాలో చేరిపోతాడని చెప్పొచ్చు. 

read  more:  బాలకృష్ణ, రాజశేఖర్‌ రిజెక్ట్ చేసిన మూవీతో ఇండస్ట్రీ హిట్‌ కొట్టిన వెంకటేష్‌, ఆ సినిమా ఏంటో తెలిస్తే ఆశ్చర్యమే

also read: సమంత వెకేషన్‌ ఫోటోలు వైరల్‌.. ఆమె వెంట ప్రియుడు ఉన్నాడా? నెటిజన్ల క్రేజీ కౌంటర్స్
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
విజయ్ దేవరకొండ
తెలుగు సినిమా
నరేంద్ర మోదీ
బాలీవుడ్
 
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd TEST • SA vs AUS
Result
SASA
329 & 387
AUSAUS
429 & 111
SA won by 176 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Rohith Naidu: టాప్ 2 లో ఉండాల్సినోడు ఎందుకు ఎలిమినేట్ అయ్యాడు..స్వయంగా చేసిన తప్పులా, బిగ్ బాస్ ప్లానింగా ?
Recommended image2
Soundarya: ఇండస్ట్రీలో సౌందర్య అన్నయ్య అని పిలిచే ఏకైక హీరో ఎవరో తెలుసా? అంతనంటే ఎందుకంత అభిమానం..
Recommended image3
AK 47 3 Days Collections: ఆదివారం ఆదర్శ కుటుంబం ఊహించని జంప్‌.. వెంకటేష్‌ మూవీ 3 రోజుల కలెక్షన్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved