- Home
- Entertainment
- బాలకృష్ణ, రాజశేఖర్ రిజెక్ట్ చేసిన మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన వెంకటేష్, ఆ సినిమా ఏంటో తెలిస్తే ఆశ్చర్యమే
బాలకృష్ణ, రాజశేఖర్ రిజెక్ట్ చేసిన మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన వెంకటేష్, ఆ సినిమా ఏంటో తెలిస్తే ఆశ్చర్యమే
Venkatesh: వెంకటేష్ కి లక్ మామూలుగా కలిసి రాలేదు. బాలకృష్ణ, రాజశేఖర్‌లు తిరస్కరించబడి, మరో హీరోతో ప్రకటించిన మూవీని తాను చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టడం విశేషం. ఆ కథేంటో చూద్దాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
balakrishna, venkatesh
Balakrishna-Venkatesh : సినిమా ఇండస్ట్రీలో ఒకరు చేయాల్సిన మూవీ మరొకరు చేయడం సర్వసాధారణం. కథ నచ్చకపోవడం, నచ్చినా అనుకోని కారణాలతో మూవీ ఆగిపోవడం, ఆ తర్వాత వేరే హీరో రావడం అడపాదడపా జరుగుతూనే ఉంటాయి.
రాజశేఖర్ విషయంలో చాలా జరిగాయి. బాలయ్య కూడా చాలా సినిమాలు రిజెక్ట్ చేశారు. వీరిద్దరు రిజెక్ట్ చేసిన మూవీతో వెంకటేష్ ఇండస్ట్రీ హిట్ అందుకోవడం విశేషం. మరి ఆ సినిమా ఏంటో చూద్దాం.
chanti movie
వెంకటేష్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ చిత్రాల్లో `చంటి` ఒకటి. మీనా హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ 1992లో విడుదలైంది. రవిరాజా పినిశెట్టి దర్శకుడు. ఈ సినిమాని తమిళంలో వచ్చిన `చిన్నతంబి`కి రీమేక్. అక్కడ ఈ మూవీని చూసిన నిర్మాత కే ఎస్ రామారావు తెలుగు రీమేక్ రైట్స్ తీసుకున్నారు. మొదట ఈ కథని బాలకృష్ణకి చెప్పారట. కానీ ఆయన రిజెక్ట్ చేశారు. తనకు ఇలాంటి మూవీస్ సెట్ కావన్నారట.
rajasekhar (photo credit-etv)
ఆ తర్వాత రాజశేఖర్ వద్దకు వెళ్లింది. దీనికి ఆయన బాగా సూట్ అవుతారని భావించారు. అయితే ఆ సమయంలో మాస్, యాక్షన్ మూవీస్‌తో బిజీగా ఉన్నారు రాజశేఖర్. వరుస సక్సెస్‌లతో క్రేజీ స్టార్‌గా నిలిచారు. చిరంజీవికి పోటీగా రాణిస్తున్నారు. అలాంటి సమయంలో తాను ఇలాంటి సినిమా చేస్తే ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని భావించారు. `చంటి` కథని రిజెక్ట్ చేశారు.
rajendra prasad
అనంతరం మరో హీరో వద్దకు వెళ్లింది. రవిరాజా పినిశెట్టి దర్శకుడిగా కన్ఫమ్ అయ్యారు. రాజేంద్రప్రసాద్‌తో ఈ మూవీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఆల్మోస్ట్ సినిమా ప్రకటన కూడా జరిగింది. కానీ చివరి నిమిషంలో హీరో మారిపోయాడు. అప్పటికే తమిళంలో విడుదలై పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది.
దీంతో రాజేంద్రప్రసాద్ ఇమేజ్ సరిపోదని భావించిన టీమ్ వెంకటేష్ వద్దకు వెళ్లారు. ఆయన, సురేష్ బాబు వినగానే ఓకే చెప్పడంతో వెంటనే పట్టాలెక్కింది. చాలా ఫాస్ట్ గా మూవీని ఫినీష్ చేసి 1992 సంక్రాంతికి విడుదల చేశారు.
దీనికి ఫ్యామిలీ ఆడియెన్స్ క్యూ కట్టారు. ఆ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలవడమే కాదు, అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇది సుమారు 16కోట్లు వసూలు చేసిందని టాక్, అప్పట్లో అదో సంచలనమని చెప్పొచ్చు.
balakrishna, venkatesh
ఇలా బాలయ్య, రాజశేఖర్ లచే తిరస్కరించబడి, రాజేంద్రప్రసాద్ హీరోగా ప్రకటించి చివరికి వెంకటేష్ వద్దకు `చంటి` కథ వెళ్లడం, ఆయన చేయడం, ఇంత పెద్ద విజయం సాధించడం చాలా ఫాస్ట్ గా జరిగిపోయాయి. కొన్నిసార్లు అంటుంటారు డెస్టినినే నడిపిస్తుందని,
ఎవరు ఏది చేయాలో అదే నిర్ణయిస్తుందని, ఈ మూవీ విషయంలో అదే జరిగిందని చెప్పొచ్చు. ఇక ఈ సంక్రాంతికి `సంక్రాంతికి వస్తున్నాం` మూవీతో వచ్చి నాన్ పాన్ ఇండియా మూవీస్‌లో ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ చేశారు వెంకటేష్. కొత్తగా ఆయన మరే సినిమాని ప్రకటించలేదు.
read more: సమంత వెకేషన్ ఫోటోలు వైరల్.. ఆమె వెంట ప్రియుడు ఉన్నాడా? నెటిజన్ల క్రేజీ కౌంటర్స్