- Home
- Entertainment
- Bigg Boss 10: ఝాన్సీ నీ వల్లే ఎలిమినేట్ అయ్యింది.. ముఖేష్‌ని ఆడుకున్న శివ, టెంపర్ వంశీ.. హీటెక్కిన నామినేషన్స్
Bigg Boss 10: ఝాన్సీ నీ వల్లే ఎలిమినేట్ అయ్యింది.. ముఖేష్‌ని ఆడుకున్న శివ, టెంపర్ వంశీ.. హీటెక్కిన నామినేషన్స్
బిగ్ బాస్ తెలుగు 10 9వ వారం నామినేషన్ల ప్రక్రియ హిటెక్కింది. ముఖేష్, వర్షిణిలను టార్గెట్ చేస్తూ ఈ నామినేషన్ జరిగింది. ముఖ్యంగా ఝాన్సీ ఎలిమినేషన్‌కి సంబంధించిన చర్చ జరగడం విశేషం.

బిగ్ బాస్ తెలుగు 10 9వ వారం నామినేషన్స్
బిగ్ బాస్ తెలుగు 10.. 8వ వారం డబుల్ ఎలిమినేషన్ హిటెక్కించిన విషయం తెలిసిందే. రెండు రోజులుగా దీనిపై ట్రోలింగ్ నడుస్తోంది. రోహిత్ ని ఎలిమినేట్ చేయడం అన్ ఫెయిర్ అంటున్నారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ షోపై, హోస్ట్ నాగార్జునపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు 9వ వారంలోకి అడుగుపెట్టాం. సోమవారం నామినేషన్ల ప్రక్రియ జరుగుతుంది. ఈ వారం నామినేషన్ల ప్రక్రియ చాలా వాడి వేడిగా జరిగింది. ఇందులో మెయిన్‌గా ముఖేష్, వర్షిణి టార్గెట్ గా నామినేషన్స్ జరిగినట్టుగా ఉంది.
ముఖేష్‌ని ఆడుకున్న వంశీ
ఇందులో ముఖేష్‌ని వంశీ నామినేట్ చేశాడు. గత వారంలో బీ, పీ అనే పదాలు హాట్ టాపిక్ అయ్యాయి. వాటిని నాగార్జున ప్రశ్నించాడు. సింగర్ ఝాన్సీని కూడా అడిగాడు. కానీ ఆమె తెలియదని చెప్పింది. తాజాగా అదే దానిపై నామినేషన్స్ చేశారు. మీరు అలా దారుణంగా, అసభ్యకరంగా మాట్లాడతారని అనుకోలేదంటూ ముకేష్‌ని వంశీ నామినేట్ చేశాడు. మీరు అలా మాట్లాడటంతో మీ వల్ల ఝాన్సీకి కూడా ఎఫెక్ట్ అయింది, ఆమె ఏడవడానికి కారణం కూడా మీరే అని వంశీ అంటాడు. మీ పర్సనాలిటీకి నచ్చని వ్యక్తిని ఒక్కసారి కూడా నామినేట్ చేయలేదు అని వర్షిణిని నామినేట్ చేశాడు వంశీ.
అయితే మధ్యలోకి ముకేష్ వస్తాడు. మీతో మాట్లాడుతుంటే ఆయన ఎందుకు వస్తున్నాడు.. అంటే మీలో ఒకరిని చేస్తే ఇద్దరు వస్తారా? అని వంశీ కౌంటర్ ఇవ్వడం విశేషం. ఇంతలోనే వంశీ, ముఖేష్ ల మధ్య వాడివేది వాగ్వాదం జరిగింది. నీ ట్రూ పర్సనాలిటీ కూడా అందరికి తెలుసు అని వర్షిణి ఉద్దేశించి వంశీ మాట్లాడటం విశేషం. ఇక ఆ గొడవలో అటు తిరిగి ఇటు తిరిగి త్రిగుణ్ వస్తాడు. బీ అంటే బ్రోకర్, పీ అంటే పప్పెట్ అని కవర్ చేస్తారు అంటూ శివ్‌తో కామెడీ చేశాడు త్రిగుణ్.
సుధీర్‌కి మతిపోయే కౌంటర్ ఇచ్చిన వంశీ
సుధీర్.. వంశీని నామినేట్ చేశాడు. ఆయన కోపాన్ని చూసి టెన్షన్ అవుతున్నా అని అంటే నా మీదకు వస్తే నా కోపం అలానే ఉంటుందని వంశీ చెప్పడం విశేషం. జంతువులన్నీ ఒకేలా ఉండవుగా అని చెప్పడం విశేషం. ఇన్ని కెమెరాల మధ్య ఎన్నాళ్లు ఫేక్‌గా నటిస్తాం అని సుధీర్ అనగా, అది నీ నటనపై ఆధారపడి ఉంటుందని వంశీ కౌంటర్ ఇవ్వడం అదిరిపోయింది. సుధీర్.. అమన్‌ని నామినేట్ చేస్తూ, అతన్ని నువ్వే పగలగొట్టి ఈ హౌజ్‌నుంచి వెళ్లిపోవాలి అని, ఆ ఒక్క చోట నువ్వు తీసుకున్న డెసీషన్ ఫ్రెండ్‌షిప్ పరంగా నువ్వు నాకు నచ్చలేదు అని సుధీర్ అనగా, రెండు చంపట్లు కొడితేనే ఫెండ్షిప్ అవుతుందని అమన్ రియాక్ట్ అయ్యాడు.
నీ వల్లే ఝాన్సీ వెళ్లిపోయింది.. ముఖేష్‌కి శివ షాక్
స్వేత నాయుడు.. ముఖేష్‌ని నామినేట్ చేస్తూ, ఎవరు పట్టుకోకపోయినా అగ్రెసివ్ అవుతున్నారని ఆరోపించింది. ఆయన పరిగెత్తుకుపోతున్నాడని ముఖేష్ చెప్పగా, శివ రియాక్ట్ అయ్యాడు. దానికి ఏ కూర్చో అంటూ ముఖేష్ కౌంటర్ ఇవ్వడం విశేషం. ఈ క్రమంలో ముఖేష్ తాను చెప్పిన ఇంటెన్షన్ గురించి ప్రస్తావన వచ్చింది. దీనికి అందరు క్లాప్స్ కొట్టడం గమనార్హం. నేను నా గేమ్ ఆడుతున్నా అనిముఖేష్ అరవగా, నీ గేమ్ ఆడటం వల్లే ఝాన్సీ ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయింది అని కౌంటర్ ఇచ్చాడు శివ.. దీంతో హౌజ్ ఒక్కసారిగా హీటెక్కింది.
వర్షిణి రియాలిటీ బట్టబయలు
నీతూ..వర్షిణిని నామినేట్ చేస్తూ, అక్కా తమ్ముడు బాండింగ్‌తో గ్రీన్ లోకి వచ్చావని చెప్పగా, వద్దు వర్షిణికి ఇవ్వద్దు అని మీరు చెప్పొచ్చు అని ఆమె రియాక్ట్ అయ్యింది. అతను నీకే ఇస్తాడని తెలుసు అని నీతూ చెప్పగా, నాకు తెలియదని వర్షిణి చెప్పింది. దీనికి దేబ్జానీ రియాక్ట్ అవుతూ, వీకెండ్‌లో హోస్ట్ సార్ చెప్పారు, ఫ్యామిలీకే ఇవ్వాలి అని, దీనికి వర్షిణి మొహం వాడిపోయింది. ఇంకా నామినేషన్ల ప్రక్రియ జరుగుతుంది. ఈ వారం ముఖేష్, వర్షిణి, సుధీర్, నీతూ, రామకృష్ణ, శివ కుమార్, వంశీ నామినేట్ అయినట్టు సమాచారం. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.





