- Home
- Entertainment
- Renu Desai: రాత్రికి రేటెంతా అని అడుగుతున్నారు, ట్రోలర్స్ పై విరుచుకుపడ్డ రేణు దేశాయ్.. స్ట్రాంగ్ వార్నింగ్
Renu Desai: రాత్రికి రేటెంతా అని అడుగుతున్నారు, ట్రోలర్స్ పై విరుచుకుపడ్డ రేణు దేశాయ్.. స్ట్రాంగ్ వార్నింగ్
నటి రేణు దేశాయ్ ట్రోలర్స్ పై విరుచుకుపడింది. తనపై దారుణమైన కామెంట్లు చేస్తున్నారని, కొన్ని కామెంట్లు చూసి తన మనసు చలించిపోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. అదే సమయంలో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.

రేణు దేశాయ్‌పై ట్రోల్స్
నటి రేణు దేశాయ్ సోషల్ మీడియా వేది కగా ఫైర్ అయ్యింది. తనని ట్రోల్ చేస్తున్న వారిపై విరుచుకుపడింది. ఇటీవల ఆమె కుక్కల రక్షణ కోసం ప్రెస్ మీట్ పెట్టి ఆవేశానికి గురయ్యింది. కొందరిపై ఫైర్ అయ్యింది. ఈ క్రమంలో తనని ట్రోల్ చేస్తున్నారని, నిత్యం కామెంట్లు పెడుతున్నారని వాపోయింది. విడాకులు తీసుకున్నప్పట్నుంచి ఎన్నో కామెంట్లు పెడుతున్నారని, డైవర్స్ గురించి, వ్యక్తిగత జీవితం గురించి, ఎంత భరణం తీసుకున్నావని, ఇలా నానా రకాలుగా తిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది రేణు దేశాయ్. తాజాగా సోషల్ మీడియా వేది కగా తనని ట్రోల్ చేస్తున్న వారిపై విరుచుకుపడింది. నెటిజన్లు చేస్తున్న దారుణమైన కామెంట్లని ఆమె బయటపెట్టింది. విడాకులు తీసుకున్నప్పట్నుంచి ఎన్నో రకాల కామెంట్లు వింటున్నానని, ఫ్యామిలీ లైఫ్, పర్సనల్ లైఫ్, ప్రొఫేషనల్ లైఫ్ ఇలా ఏదీ వదలకుండా తిడుతున్నారని, అన్ని రకాలుగా కామెంట్లని ఫేస్ చేసినట్టు తెలిపింది రేణు దేశాయ్. జీవితంలో వినడానికి ఇంకా ఏం లేదని చెప్పింది.
ట్రోలర్స్ పై విరుచుకుపడ్డ రేణు దేశాయ్
ఇక జనవరిలో రేణు దేశాయ్ కుక్కల సంరక్షణ కోసం ఆమె ప్రెస్ మీట్ పెట్టింది. ఇందులో రష్మి గౌతమ్ కూడా పాల్గొంది. ఇందులో ఓ వ్యక్తిపై రేణు దేశాయ్ ఫైర్ అయ్యింది. దీని గురించి ఆమె మాట్లాడుతూ, `నేను ఆ మీటింగ్‌కు రానని చెప్పాను. ఏదైనా మాట్లాడితే నాకు తిట్లు పడతాయే తప్ప, దాన్నుంచి వచ్చేది ఏమీ ఉండదు అని ఎన్జీవోలకి క్లియర్ గా చెప్పాను. వందల కుక్కల్ని దారుణంగా చంపేస్తున్నారు. రావాల్సిందేనంటూ నన్ను కన్విన్స్ చేశారు. వందల కుక్కల్ని చంపేస్తుంటే నాకు కూడా చాలా బాధేసింది. 100 కుక్కల్లో 10 పిచ్చివి ఉంటాయని, వాటితో జాగ్రత్తగా ఉండాలని నేను ఆరోజు ప్రెస్ మీట్ లో క్లియర్ గా చెప్పాను. ఆ పదింటి గురించి ఆలోచించాలి కానీ, మిగిలిన 90 కుక్కల్ని చంపకూడదని అన్నాను. అందులో నేనేమన్నా తప్పుగా అన్నానా? వందకి వంద కుక్కలు మంచివే అని అనలేదు కదా?. మనుషులు చేసినా కుక్కలు చేసినా తప్పు తప్పే. కానీ నేను చెప్పింది అర్థం చేసుకోకుండా స్టుపిడ్ యూట్యూబ్ ఛానళ్లు, పనికి మాలిన ఇన్ స్టాగ్రామ్ పేజీలలో నన్ను కామెంట్స్ చేశారు.
ఆ కామెంట్‌కి మనసు చలించిపోయింది -రేణు దేశాయ్
మనకు మాట్లాడే స్వేచ్ఛ ఉంది. నేను మంచి బట్టలు వేసుకోకపోయినా, యాక్టింగ్ బాగా చేయకపోయినా చెప్పొచ్చు. ఎందుకంటే అది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. కానీ ప్రతీసారి వ్యక్తిగత జీవితాన్ని ప్రస్తావిస్తూ ఇష్టమొచ్చినట్లు కామెంట్లు చేస్తున్నారు. ఇది నేను నా గురించి మాత్రమే చెప్పడం లేదు. అందరి గురించి చెప్తున్నాను. ఫేస్ చూపించకుండా సోషల్ మీడియాలో అకౌంట్లు క్రియేట్ చేసుకొని ఇష్టమొచ్చినట్లు తిట్టడం ఏం సంస్కారం?. ఒక్కసారి మీ మనస్సాక్షిని ప్రశ్నించుకోండి. మీరు చేసే పని మీ అమ్మానాన్నలకు, అక్కాచెల్లెళ్లకు చూపించండి. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లో ఫలానా సెలబ్రిటీ, పొలిటీషియన్ ని ఇలా తిడుతున్నామని చూపించండి. ఆ రోజు ప్రెస్ మీట్ లో బయట నుంచి వచ్చిన ఓ వ్యక్తి నన్ను దున్నపోతు అన్నాడు. దానికి నేను కోప్పడ్డాను. మీరు నా కోపం చూశారు కానీ, అతను చేసిన గొడవ చూడకుండా అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు. ఒక కామెంట్ చూసి నా మనసు చలించిపోయింది. `ఈ పిచ్చి కుక్కలు ఆ రేణు దేశాయ్ ప్రైవేట్ పార్ట్స్ ని కరిస్తే అప్పుడు తెలుస్తుంది' అని ఒకరు కామెంట్ చేశారు. అసలు ఆ భాష ఏంటి? అతని అకౌంట్ ని బ్లాక్ చేశాను. మీరు ఒక ఫోన్ తీసుకొని మెసేజ్ టైప్ చేస్తున్నారంటే, మీరు చదువుకున్నవారే అవుతారు. ఏ సంస్కారంతో మిమ్మల్ని అమ్మానాన్నలు పెంచారు. నిజంగా మీ అమ్మానాన్నల మీద నాకు బాధేస్తోంది. మిమ్మల్ని సరిగ్గా పెంచలేదు. మగవారే కాదు, ఆడవాళ్లు కూడా ఇష్టమొచ్చినట్లు తిడుతున్నారు` అని వెల్లడించింది.
నన్ను అడిగే హక్కు మీకు లేదు-రేణు దేశాయ్
ఇంకా మాట్లాడుతూ, 'నేను కుక్కల గురించి మాత్రమే మాట్లాడుతున్నానని, మనుషుల గురించి మాట్లాడటం లేదని చాలామంది నన్ను తిడుతున్నారు. నేను మూగజీవాల కోసం ఎన్జీవో పెట్టుకున్నా. ఒక యానిమల్ వెల్ఫేర్ ఎన్జీవో ఫౌండర్ గా నేను వాటి కోసం మాట్లాడుతున్నా. మనుషుల కోసం కాదు. ప్రపంచంలో ఏది జరిగినా నేను బాధ్యత తీసుకోవాలా?. నేనేమీ ఎమ్మెల్యేని కాదు. మీరు ఓటేసి గెలిపించిన ఎమ్మెల్యే, కార్పొరేటర్లను అడగడానికి ధైర్యం లేదు. ప్రతి విషయానికీ నన్నెందుకు అడుగుతున్నారు?. నన్ను అడిగే హక్కు మీకు లేదు. మనుషులకు సేవ చేసి వారి ప్రవర్తనతో విరక్తి కలిగి, యానిమల్స్ కి సేవ చేస్తున్నాను. జనాల సేఫ్టీ కోసం ఏమి చేస్తున్నారని దమ్ముంటే మీరు ప్రభుత్వాన్ని అడగండి. నన్ను కాదు` అని మండిపడింది రేణు దేశాయ్.
రాత్రికి రేట్ ఎంత అని అడుగుతున్నారు- రేణు దేశాయ్
ఆమె ఇంకా చెబుతూ, `ఒక సిటిజన్‌గా మీకు ఎలాంటి హక్కులు ఉన్నాయో నాకు అవే రైట్స్ ఉన్నాయి. ఈ దేశంలో నేనూ ఒక నార్మల్ పర్సన్ నే. కాకపోతే నేను ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నాను. అదొక్కటే తేడా. ఫోన్ తీసుకొని ఎవరైనా సెలబ్రిటీ, ఎవరి మీదైనా బ్యాడ్ గా కామెంట్స్ చేస్తున్నావంటే అదే నువ్వు అని అర్థం. నువ్వు సంస్కారం లేని ఒక మనిషివి. సంస్కారం ఉంటే ఇలాంటి దారుణమైన కామెంట్స్ చేయవు. నేను ఫోటో పెడితే 'రాత్రికి రేటు ఎంత?' అని కామెంట్స్ చేస్తున్నారు. నువ్వు దేని గురించి రేటు అడుగుతున్నావ్? ఎవరిని అడుగుతున్నావ్?. నీకు తినే పరిస్థితి లేదు. ఎలా అలా అడుగుతారు?. అమ్మవారి బొట్టు పెట్టుకొని, ఎర్రటి దుస్తులు ధరించి, దేవీ మాలలో ఉంటే రాత్రికి రేటు ఎంత? అని ఎలా కామెంట్ చేయగలుగుతున్నారు?. ఇది చాలా దారుణం` అంటూ రేణు దేశాయ్ ఆవేదన వ్యక్తం చేసింది.
మీ ఇంటిని వెతుక్కుంటూ వస్తా, ఈ సారి వదలను-రేణు దేశాయ్
మహబూబ్‌నగర్‌లో ఓ టెంపుల్‌లో కులం గొడవలో ఓ చిన్నారి చనిపోయింది. దానిపై తాను మాట్లాడలేదని కామెంట్లు పెడుతున్నారు. నన్ను ప్రశ్నిస్తున్నారు. దానికి నాకు సంబంధం ఏంటి? తాను కుక్కల కోసం ఎన్జీవో పెట్టుకున్నాను, వాటిపై మాట్లాడతాను. మిగిలిన విషయాలకు, నాకు సంబంధం ఏంటి? మీరెందుకు ఆ విషయాన్ని అడగడం లేదు. ఆ చిన్నారికి న్యాయం కోసం పోరాడటం లేదు` అని అడిగింది రేణు దేశాయ్. అంతేకాదు ఫైనల్‌గా గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఇప్పటి వరకు వదిలేశానని, ఇకపై వదలనని తెలిపింది. ఆ అకౌంట్ పట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేస్తానని, అకౌంట్ ఆధారంగా మీ ఇంటి అడ్రస్‌కి వచ్చి మీ అమ్మానాన్నలను ప్రశ్నిస్తానని, ఇదేనా మీరు పెంచింది? మీ బిడ్డ ఇలా చేస్తున్నారని వారినే ప్రశ్నిస్తాను. మీరు మీ అమ్మనాన్నకి సమాధానం చెప్పుకోవాలి. దయచేసి ఇలాంటి అసభ్యకరమైన కామెంట్స్ చేయడం ఆపేయండి` అని రేణు దేశాయ్ వెల్లడించింది. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు పంచుకుంది. ఇవి ఇప్పుడు రచ్చ చేస్తున్నాయి.

