- Home
- Entertainment
- రష్మిక మందన్న కు విజయ్ దేవరకొండ తల్లి పెట్టిన కండీషన్లు ఏంటో తెలుసా? కోడలి క్వాలిఫికేషన్స్ ఏంటంటే?
రష్మిక మందన్న కు విజయ్ దేవరకొండ తల్లి పెట్టిన కండీషన్లు ఏంటో తెలుసా? కోడలి క్వాలిఫికేషన్స్ ఏంటంటే?
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. అయితే దేవరకొండి వారి ఇంటికి కాబోయే కోడలికి విజయ్ తల్లి కొన్ని కండీషన్లు పెట్టిందట. విజయ్ ను చేసుకోబోతున్న రష్మికకు ఆమె అత్త మాధవి పెట్టిన షారతులేంటి?. నిజమెంత.?

విజయ్ - రష్మిక పెళ్లి..
ఎట్టకేలకు విజయ్ దేవరకొండి - రష్మిక మందన్న ఒక్కటి కాబోతున్నారు. చాలా ఏళ్లుగా వీరి గురించి వచ్చిన వార్తలకు ఎండ్ కార్డ్ పడింది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపించగా, ఇప్పుడు వివాహ బంధంతో ఒక్కటవ్వడానికి సిద్ధమయ్యారు. ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయపూర్ నగరంలో వీరి పెళ్లి జరగనుంది. ఇప్పటికే విజయ్, రష్మికతో పాటు వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఉదయపూర్ చేరుకుని పెళ్లి సంబరాలు ఆరంభించారు.
హైదరాబాద్ లో గ్రాండ్ గా రిసెప్షన్ ..
వివాహం అనంతరం మార్చి 4న హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ జంటకు సంబంధించిన పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా విజయ్ దేవరకొండ తల్లిదండ్రులు గతంలో కాబోయే కోడలిపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మళ్లీ చర్చనీయాంశంగా మారాయి. విజయ్ కు కాబోయే భార్య ఎలా ఉండాలి, ఆమె ఏం చేయాలి, కోడలి క్వాలిఫికేషన్స్ గురించి వారు మాట్లాడారు ఇంతకీ.. పెళ్లి తరువాత రష్మిక కు పెట్టే కండీషన్లు ఏంటో తెలుసా?
కోడలికి విజయ్ తల్లి తండ్రుల కండీషన్లు..
ఒక సినిమా ఈవెంట్ సందర్భంగా యాంకర్ సుమ, విజయ్ తల్లిదండ్రులను “మీకు కాబోయే కోడలు ఎలా ఉండాలి?” అని ప్రశ్నించారు. దీనికి విజయ్ తల్లి మాధవి స్పందిస్తూ, “నాకు కోడలు విషయంలో ఒకే ఒక కండిషన్ ఉంది. విజయ్‌ని మంచిగా చూసుకునే కోడలు రావాలి. ఆమె విజయ్‌ని పూర్తిగా ప్రేమించాలి. మా అబ్బాయి సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు కాబట్టి అతని వర్కింగ్‌ను కూడా అర్థం చేసుకోవాలి” అని అన్నారు.
పట్టింపులు ఏమి లేవు..
విజయ్ తండ్రి గోవర్ధన్ రావు మాట్లాడుతూ, “విజయ్‌కు నచ్చిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. నాకు మతం, కులం లాంటి పట్టింపులు ఏమి లేవు. కానీ ఇండియన్ మహిళనే పెళ్లి చేసుకోవాలి” అని తెలిపారు.
విజయ్ - రష్మిక జోడీ అదుర్స్..
వారు అనుకున్నట్టుగానే మంచి కోడులు దొరికిందని అభిమానులు అంటున్నారు. సినిమా ఇండస్ట్రీ నుంచి రావడంతో విజయ్ గురించి ఆమెకు పూర్తి అవగాహన ఉంటుంది. అంతే కాదు వీరిద్దరి మధ్య మంచి కమ్యునికేషన్ ఉంది. ఇద్దరు ఒకే మాట మీద ఉంటారు. ఒకరిని ఒకరు అర్ధం చేసుకుంటారు. అందుకే చాలా ఏళ్లుగా ప్రేమలో ఉన్నా.. ఏ సందర్భంలో కూడా వీరు బయటపడలేదు. పెళ్లి తరువాత సినిమాలను ఎలా బ్యాలన్స్ చేస్తారు అనేది మాత్రం చూడాలి.
సినిమాల విషయానికి వస్తే..
ప్రస్తుతం రష్మిక చేతిలో వరు సినిమాలు ఉన్నాయి. విజయ్ తో ఆమె రణబలి సినిమా చేస్తోంది. వీటితో పాటు ఆమె పుష్ప3 లాంటి సినిమాలు చేయాల్సి ఉంది. అల్లు అర్జున్, అట్లీ సినిమాలో కూడా రష్మిక నటిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు విజయ దేవరకొండ మాత్రం సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈమధ్య కాలంలో రౌడీ హీరో నటించిన కింగ్ డమ్ కూడా ప్లాప్ అయ్యింది. దాంతో ప్రస్తుతం రణబలి మీదే ఆశలు పెట్టుకున్నాడు.

