- Home
- Entertainment
- రష్మిక ను ఇరికించిన బాలకృష్ణ, విజయ్ దేవరకొండకి హింట్ ఇచ్చి.. ఇరుక్కుపోయిన హీరోయిన్
రష్మిక ను ఇరికించిన బాలకృష్ణ, విజయ్ దేవరకొండకి హింట్ ఇచ్చి.. ఇరుక్కుపోయిన హీరోయిన్
రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ పెళ్లి సందడి మొదలైన వేళ, యానిమల్ సినిమా ప్రమోషన్స్ నాటి పాత వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. రష్మికను బాలకృష్ణ ఆడియన్స్ దగ్గర ఇరికించేశాడు.
16

Image Credit : stockPhoto
రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ పెళ్లి
నేషనల్ క్రష్ రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ పెళ్లి సందడి మొదలయ్యింది. రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్ లో వీరి వివాహ వేడుకలు జరుగుతున్నాయి. రీసెంట్అ గా ఈ జంట తమ పెళ్లిపై అధికారికంగా ప్రకటన చేశారు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి
26
Image Credit : instagram
పాత వీడియోలు వైరల్
వీరి పెళ్లి వార్తలు బయటకు వచ్చినప్పటి నుంచి, సోషల్ మీడియాలో పాత వీడియోలు, ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ కలిసి నటించిన సినిమాల్లోని డైలాగ్స్‌ను కూడా అభిమానులు షేర్ చేస్తున్నారు.
36
Image Credit : instagram.com/rashmika_mandanna
మా మధ్య ఏమీ లేదు, ఏమీ లేదు
'మా మధ్య ఏమీ లేదు' అని చెబుతూ వచ్చిన ఈ జంట చాలాసార్లు దొరికిపోయింది. 'యానిమల్' సినిమా ప్రమోషన్స్ టైంలో నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేసిన ఓ షోలో జరిగిన సంఘటన వీడియో ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతోంది.
46
Image Credit : Instagram
స్పీకర్ ఆన్ చేసి షాక్..
ఆ షోలో బాలకృష్ణ.. రష్మికను విజయ్ దేవరకొండకు ఫోన్ చేసి స్పీకర్‌లో పెట్టమన్నారు. విజయ్ ఫోన్ ఎత్తి ప్రేమగా పిలవడంతో రష్మిక ఇబ్బంది పడింది. అందరూ నవ్వడంతో, 'స్పీకర్ ఆన్‌లో ఉంది, ఇక్కడ అందరూ ఉన్నారు' అని విజయ్‌కి చెప్పింది.
56
Image Credit : Aha Videos
బాలకృష్ణ ఏమన్నాడంటే?
ఆ తర్వాత బాలకృష్ణ.. 'నీకు ఎవరు ఇష్టం?' అని విజయ్‌ని అడిగారు. దానికి విజయ్, తనకు 'యానిమల్' డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా అంటే ఇష్టమని సరదాగా చెప్పారు. తర్వాత ఇదే ప్రశ్నను రష్మికను అడిగారు.
66
Image Credit : Getty
అర్జున్ రెడ్డితో కూడా
దానికి రష్మిక, 'నాకు కూడా సందీప్ అంటే చాలా ఇష్టం. అర్జున్ రెడ్డితో కూడా కనెక్షన్ ఉంది' అని చెప్పింది. వెంటనే అటువైపు నుంచి విజయ్, 'కనెక్షనా? అదేం కనెక్షన్?' అని ప్రశ్నించడంతో రష్మిక ఫేస్ మారిపోయింది.
Latest Videos

