Spirit లో విజయ్ దేవరకొండ ? పాత్ర ఇదేనా.. వామ్మో బాక్సాఫీసు షేక్ అయ్యే మ్యాటర్
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఇప్పుడు విజయ్ దేవరకొండని కలిశాడు. ఆయన ప్రభాస్‌తో `స్పిరిట్` మూవీ తీస్తున్న వేళ విజయ్ ని కలవడం ఆశ్చర్యపరుస్తుంది. బాక్సాఫీసు షేక్ అయ్యే మ్యాటర్ ఏదో ఉండబోతుందట.

స్పిరిట్ మూవీ షూటింగ్‌లో బిజీగా ప్రభాస్
ప్రభాస్ ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో `స్పిరిట్` చిత్రంలో నటిస్తున్నాడు. ఆ మధ్యనే ఈ మూవీ చిత్రీకరణ ప్రారంభమయ్యింది. ఈ సినిమా కోసం ప్రభాస్ లుక్ కూడా మార్చేశాడు. మీసాలు పెంచి, గెడ్డంతో కనిపిస్తున్నాడు. ఊర మాస్ లుక్‌లోకి మారిపోయాడు. ఆ మధ్య `స్పిరిట్` ఫస్ట్ లుక్‌ని విడుదల చేసిన విషయం తెలిసిందే. షర్ట్ లేకుండా గాయాలతో కనిపించాడు ప్రభాస్. ఆయనకు హీరోయిన్ డిమ్రీ తృప్తి సిగరేట్ కి లైటర్ వెలిగించింది. చేతిలో మందు గ్లాస్‌తో ప్రభాస్ లుక్ మైండ్ బ్లోయింగ్ అనేలా ఉంది.
స్పిరిట్‌లో క్రేజీ స్టార్స్ ?
ప్రభాస్ ఫస్ట్ లుక్‌తోనే `స్పిరిట్` పై అంచనాలు అమాంతం పెంచేశారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ క్రమంలో సినిమాకి సంబంధించిన పలు గూస్ బంమ్స్ వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో మరో బిగ్ స్టార్ కనిపించబోతున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. అందుకు కారణం దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కదలికలే. ఆయన తాజాగా రౌడీ బాయ్ విజయ్ దేవరకొండని కలిశాడట. సడెన్‌గా విజయ్‌ని కలవడం ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చకి తావిస్తోంది.
స్పిరిట్‌లో మెరవబోతున్న గోపీచంద్, విజయ్ దేవరకొండ ?
`స్పిరిట్` షూటింగ్ సమయంలో దర్శకుడు సందీప్.. విజయ్ దేవరకొండని కలవడం ఆశ్చర్యంగా మారింది. ఏదో ప్లాన్ చేయబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. `స్పిరిట్`లో విజయ్ దేవరకొండ కనిపించబోతున్నాడా అనేది ఆసక్తికరంగా మారింది. ఆ మధ్య హీరో గోపీచంద్ పేరు తెరపైకి వచ్చింది. విలన్ పాత్ర కోసం గోపీచంద్‌ని అనుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి. ప్రభాస్, గోపీచంద్ మంచి ఫ్రెండ్స్ అనే విషయం తెలిసిందే. ఇద్దరు కలిసి `వర్షం` చిత్రంలో నటించారు. అందులో ప్రభాస్ హీరో కాగా, గోపీచంద్ విలన్ రోల్ చేశారు. ఆ తర్వాత ఎప్పుడూ ఈ ఇద్దరు కలిసి నటించలేదు. కానీ అభిమానులు మాత్రం వీరిద్దరి కలయిక కోసం వెయిట్ చేస్తున్నారు.
`స్పిరిట్`లో విలన్ పాత్ర కోసం సందీప్ అదిరిపోయే ప్లాన్
ఈ క్రమంలో ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా నిజం చేయబోతున్నారనే వార్తలు వచ్చాయి. కానీ అనూహ్యంగా ఇప్పుడు విజయ్ దేవరకొండ పేరు తెరపైకి రావడం షాకిస్తుంది. తాజాగా విజయ్ ని సందీప్ కలవడంతో `స్పిరిట్` కోసమే అని అంటున్నారు. మరి విలన్ పాత్ర కోసమే విజయ్‌ని కలిశాడా? అనేది ఆసక్తికరంగా మారింది. ఒక వేళ అదే నిజమైతే మాత్రం బాక్సాఫీసు షేక్ కావడం ఖాయం. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగా మూవీస్‌లో విలన్ రోల్ ఎంతటి స్ట్రాంగ్‌గా ఉంటుందో మనం `యానిమల్` మూవీలో చూశాం. ఆ ఒక్క మూవీతో బాబీ డియోల్ కెరీర్ టర్న్ తీసుకుంది. ఇప్పుడు `స్పిరిట్`లో ప్రభాస్‌తో విజయ్ ఢీ కొడితే అది నిజంగా వేరే లెవల్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరి సందీప్.. గోపీచంద్‌ని తీసుకుంటాడా? విజయ్‌ని ఎంపిక చేస్తాడా? అసలు ఈ మీటింగ్ ఉద్దేశ్యమేంటనేది క్లారిటీ రావాల్సి ఉంది.
వీడీ 14, రౌడీ జనార్థన్ చిత్రాలతో బిజీగా విజయ్
విజయ్ దేవరకొండ ప్రస్తుతం రాహుల్ సంక్రిత్యన్ దర్శకత్వంలో వీడీ 14 మూవీలో నటిస్తున్నారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా దీన్ని రూపొందిస్తున్నారు. హిస్టారికల్ అంశాలు కూడా ఇందులో ఉంటాయట. ఈ మూవీ రౌడీ బాయ్స్ ఆకలి తీర్చేలా ఉంటుందని ఇటీవల దర్శకుడు రాహుల్ సంక్రిత్యన్ వెల్లడించారు. మరోవైపు రవి కిరణ్ కోలా దర్శకత్వంలో `రౌడీ జనార్థన్` చిత్రంలో నటిస్తున్నాడు విజయ్. ఇటీవల ఈ మూవీ గ్లింప్స్ విడుదల చేయగా, గూస్ బంమ్స్ తెప్పించింది. ఈ రెండూ ఇప్పుడు చిత్రీకరణ దశలో ఉన్నాయి.

