- Home
- Entertainment
- Allu Arjun: మరో తమిళ దర్శకుడికి బన్నీ గ్రీన్ సిగ్నల్?.. త్రివిక్రమ్‌తోపాటు తెలుగు డైరెక్టర్లకి షాక్
Allu Arjun: మరో తమిళ దర్శకుడికి బన్నీ గ్రీన్ సిగ్నల్?.. త్రివిక్రమ్‌తోపాటు తెలుగు డైరెక్టర్లకి షాక్
అల్లు అర్జున్ నెక్ట్స్ సినిమాల లైనప్ ఊహకందని విధంగా ఉంది. ఇప్పుడు మరో ఇద్దరు తమిళ దర్శకులు బన్నీకి కథ చెప్పారట. అందులో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ దొరికిందని సమాచారం.

అట్లీ సినిమాతో అల్లు అర్జున్ బిజీ, త్వరలో షూటింగ్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నెక్ట్స్ భారీ లైనప్‌తో ఉన్నారు. ఆయన ప్రస్తుతం అట్లీతో సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. సినిమాని ప్రకటించి ఏడాది కావస్తున్నా, ఇంకా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుతుండటం గమనార్హం. సైన్స్ ఫిక్షన్ కథతో, సూపర్ హీరో కథాంశంతో సాగే ఈమూవీ షూటింగ్ చాలా వరకు సెట్ లోనే ఉండబోతుంది. అందుకోసం భారీ సెట్లు నిర్మిస్తున్నారట. త్వరలోనే ఇవి పూర్తి చేసి మార్చి నుంచి రెగ్యూలర్ షూటింగ్ ని స్టార్ట్ చేసే అవకాశం ఉందని సమాచారం.
లోకేష్ కనగరాజ్ తో ఏఏ 23ని ప్రకటించిన బన్నీ
ఇదిలా ఉంటే ఇటీవల మరో తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అల్లు అర్జున్. తన 23వ చిత్రంగా దీన్ని ప్రకటించారు. ఈమేరకు విడుదల చేసిన అనౌన్స్ మెంట్ లుక్ అదిరిపోయింది. అది ఎక్కడ చూసినా ట్రెండ్ అవుతుంది. అట్లీ చిత్రం తర్వాత ఈ మూవీనే స్టార్ట్ అవుతుందని సమాచారం. దీంతోపాటు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో ఓ సినిమా ఉంది. గతంలోనే దీన్ని ప్రకటించారు. బన్నీ బిజీగా ఉండటంతో త్రివిక్రమ్.. ఎన్టీఆర్ వైపు వెళ్లారు. ఆయనతో మూవీ చేసేందుకు రెడీ అయ్యారు. కానీ ఇటీవలే అల్లు అర్జున్.. త్రివిక్రమ్ కి సినిమా చేస్తానని హామీ ఇచ్చారట. దీంతో ఎన్టీఆర్‌తో చేయాల్సిన కార్తికేయుడి కథ ఇప్పుడు బన్నీ చేయబోతున్నారట. లోకేష్ కనగరాజ్ మూవీ తర్వాత త్రివిక్రమ్ తో సినిమా ఉండే అవకాశం ఉంది.
బన్నీ వెంట క్యూ కడుతున్న కోలీవుడ్ దర్శకులు
ఇప్పటి వరకు తెలుస్తోన్న సమచారం మేరకు ఈ చిత్రాలు కన్ఫమ్ అని టాక్. వీరితోపాటు చాలా మంది దర్శకుడు అల్లు అర్జున్‌కి కథ చెప్పారు. సందీప్ రెడ్డి వంగా కూడా ఉన్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా ఉంటుందన్నారు. కానీ ఎప్పుడనేది క్లారిటీ లేదు. అలాగే ప్రశాంత్ నీల్‌తోనూ ఓ కమిట్ మెంట్ ఉంది. అది ఎప్పుడు అవుతుందో తెలియదు. దీనికితోడు ఇప్పుడు తమిళ దర్శకులు అల్లు అర్జున్ వద్దకు క్యూ కడుతున్నారట. నెల్సన్ దిలీప్ కుమార్ కూడా కథ చెప్పాడట. ఈ కథ విషయంలోనూ బన్నీ ఇంట్రెస్టింగ్‌గానే ఉన్నాడట.
మరో తమిళ దర్శకుడికి అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్
ఆయనతోపాటు మరో క్రేజీ తమిళ దర్శకుడు ఆ మధ్య బన్నీని కలిసి ఓ స్టోరీ నెరేట్ చేశాడట. కథ అదిరిపోయిందని సమాచారం. బన్నీ చాలా ఇంట్రెస్ట్‌ని చూపించాడట. మన సినిమా చేద్దామనే హామీ కూడా ఇచ్చాడట. స్టోరీ ఆ రేంజ్‌లో ఉందట. అయితే ఫస్టాఫ్ వరకు అదిరిపోయిందని, సెకండాఫ్ విషయంలో కొంత ఆలోచనలో పడ్డారట. పూర్తి స్క్రిప్ట్ రెడీ చేసుకుని మరోసారి కలవాలని అల్లు అర్జున్ చెప్పారట. అయితే ఈ మూవీ విషయంలో ఆయన చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నట్టు సమాచారం. అన్నీ సెట్ అయితే అట్లీ మూవీ, ఆ తర్వాత లోకేష్ తో సినిమా ఉంటుంది. దాని తర్వాత ఆ తమిళ దర్శకుడి సినిమానే పట్టాలెక్కుతుందని సమాచారం.
తెలుగు డైరెక్టర్లకి బన్నీ షాక్
ఇదే జరిగితే త్రివిక్రమ్ సినిమా చాలా డిలే అవుతుంది. ఇప్పుడున్న లైనప్‌లో ఆయన సినిమా నాల్గో స్థానంలో ఉండబోతుందని తెలుస్తుంది. అయితే ఇప్పుడు వరుసగా తమిళ దర్శకులతోనే సినిమాలు చేస్తున్నారు బన్నీ. అట్లీ, లోకేష్ తమిళం. ఇప్పుడు కొత్తగా వినిపించే దర్శకుడు కూడా తమిళమే. నెల్సన్(సెట్ అయితే) తమిళే ఇలా. నలుగురు కోలీవుడ్ దర్శకులతో సినిమాలు చేస్తే ఇక తెలుగు డైరెక్టర్లు పక్కకు వెళ్లిపోవాల్సిందే. ఇదిప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారుతుందని చెప్పొచ్చు. అయితే అల్లు అర్జున్ ఆలోచన, ప్లాన్ ఊహాతీతం. ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? ఏం చేస్తాడో ఎవరికీ తెలియదు. అంత వరకు వెయిట్ చేయాల్సిందే.

