- Home
- Entertainment
- Vishwambhara First Review: విశ్వంభర అప్‌డేట్, జేమ్స్ కామెరూన్ రేంజ్ విజువల్స్.. హైలైట్స్ ఇవే, సమస్య ఏంటంటే?
Vishwambhara First Review: విశ్వంభర అప్‌డేట్, జేమ్స్ కామెరూన్ రేంజ్ విజువల్స్.. హైలైట్స్ ఇవే, సమస్య ఏంటంటే?
Vishwambhara First Review: చిరంజీవి నటించిన `విశ్వంభర` మూవీ రిలీజ్‌కి డిలే అవుతున్న విషయం తెలిసిందే. ఈమూవీకి సంబంధించిన ఫస్ట్ రివ్యూ తెలిసింది. సినిమా వేరే లెవల్ అని టాక్.

కొత్త సినిమాలపై చిరంజీవి ఫోకస్
మెగాస్టార్ చిరంజీవి ఇటీవల `మన శంకర వర ప్రసాద్ గారు` మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఇది ఆయన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. నాన్ పాన్ ఇండియా చిత్రాల్లో అత్యధికంగా వసూళ్లు చేసిన చిత్రంగా నిలవడం విశేషం. దీంతో చిరంజీవి తన రేంజ్ ఏంటో చూపించారు. అదే సమయంలో తన మార్కెట్ రేంజ్ ఏంటో కూడా తెలిసింది. ఈ క్రమంలో సక్సెస్ జోరులో ఉన్న చిరంజీవి కొత్త సినిమాలపై దృష్టిపెట్టారు. ఇటీవల దుబాయ్‌లో బాబీతో మూవీని ఫైనల్ చేశారట. మార్చిలో ఇది స్టార్ట్ కానుందని సమాచారం.
విశ్వంభర రిలీజ్ కి ప్లాన్
మరోవైపు ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న `విశ్వంభర` చిత్రాన్ని కూడా రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నారట. వశిష్ట దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే. సోషియో ఫాంటసీగా దీన్ని రూపొందించారు. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. విడుదలకు రెడీ అవుతుందట. అయితే గతేడాదినే విడుదల కావాల్సిన ఈ చిత్రం అనేక కారణాలతో వాయిదా పడింది. వీఎఫ్‌ఎక్స్ డిలే కావడం, బిజినెస్ కాకపోవడం, దీంతోపాటు కొంత అర్థిక కారణాలతోనూ వాయిదా పడినట్టు వార్తలు వచ్చాయి. అయితే వీఎఫ్‌ఎక్స్ వల్లే ఆలస్యమయ్యిందని టీమ్ వెల్లడించింది. ఈ ఏడాది సమ్మర్ లో విడుదల చేయనున్నట్టు చిరంజీవి వీడియో ద్వారా ప్రకటించిన విషయం తెలిసిందే.
విశ్వంభర ఫస్ట్ రివ్యూ
తాజాగా ఈ మూవీకి సంబంధించిన అదిరిపోయే అప్ డేట్ తెలిసింది. అంతేకాదు సినిమాకి సంబంధించిన ఆసక్తికర విషయాలు(ఫస్ట్ రివ్యూ) బయటకు వచ్చాయి. సినిమా ఔట్‌పుట్ అదిరిపోయిందని తెలుస్తోంది. విజువల్స్ వేరే లెవల్‌లో ఉంటాయట. ఇప్పటి వరకు ఇండియాలో ఈ స్థాయి విజువల్స్ చూడలేదని, హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్స్ క్రియేట్ చేసే విజువల్స్ రేంజ్‌లో `విశ్వంభర` విజువల్స్ ఉంటాయట. జేమ్స్ కామెరూన్ `అవతార్` చిత్రాలను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. `విశ్వంభర` కూడా విజువల్స్ పరంగా ఆ స్థాయికి ఏమాత్రం తగ్గదని టాక్.
విశ్వంభర క్లైమాక్స్ లో పూనకాలే
చందమామ కథలు లాంటి కథతో ఈ మూవీని రూపొందించారట. హీరో ఏడు లోకాలకు తిరిగే కథతో రూపొందిందనే ప్రచారం గతంలో జరిగిన విషయం తెలిసిందే. సినిమాలో ఫాంటసీ ఎలిమెంట్లతోపాటు హృదయాన్ని కదిలించే ఎమోషన్స్ కూడా ఉంటాయట. భార్యకోసం భర్త వెతికే సీన్లు, తండ్రి కోసం కొడుకు పడే బాధ, దేవుడితో చెప్పుకునే సన్నివేశాలు గుండెని బరువెక్కిస్తాయని తెలుస్తోంది. ఫస్టాఫ్ అదిరిపోయిందని టాక్. సెకండాఫ్ పరుగులు పెట్టేలా ఉంటుందని, క్లైమాక్స్ మాత్రం సినిమాని మరో లెవల్‌కి తీసుకెళ్లిపోతుందని, చివరి అరగంట సేపు మనకు టైమ్ తెలియకుండా సాగుతుందని, హై ఫీల్‌ని ఇస్తుందని అంటున్నారు. సినిమాని పీక్‌లోకి తీసుకెళ్లి క్లోజ్ అవుతుందట. థియేటర్ నుంచి మనం హై ఫీల్‌లో బయటకు వస్తామని, సినిమా చాలా క్రిస్పీగానే ఉంటుందని, మనం ఏం చూస్తున్నామనే ఆశ్చర్యాన్ని కలిగించేలా సినిమా ఉంటుందని చెబుతున్నారు. ఇందులోనే చిరంజీవిలోకి పవర్ వచ్చే సీన్లు పీక్ అని టాక్. పెద్దవాళ్లతోపాటు చిన్న పిల్లలు ఎంజాయ్ చేసే మూవీ అవుతుందట. మూవీ ఎప్పుడు రిలీజ్ అయినా బ్లాక్ బస్టర్ పక్కా అని సమాచారం.
ఎమోషన్స్ వర్కౌట్ అయితేనే
అయితే సినిమాకి వినోదం, విజువల్స్ వండర్‌తోపాటు ఎమోషన్స్ కూడా చాలా ముఖ్యం. ఆ ఎమోషన్స్ ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యేదాన్ని బట్టి సినిమా ఫలితం ఆధారపడి ఉంటుంది. ఎమోషన్స్ ఆడియెన్స్ కి కనెక్ట్ అయితే సినిమా వేరే లెవల్, లేదంటే తేలిపోతుంది. థియేటర్లో చూసినప్పుడు ఆ భావోద్వేగాలను ఎలా ఫీలవుతారనేది ఇక్కడ చాలా ముఖ్యం. అక్కడే దర్శకుడు వశిష్ట తన మార్క్ ని చూపించాల్సి ఉంటుంది.
విశ్వంభరకి అసలు సమస్య ఇదే
అయితే సినిమా డిలేకి కారణం ఆర్థికపరమైన సమస్యలు ఉన్నాయని, ఇంకా కొంత బడ్జెట్ డిమాండ్ చేస్తుందని, ఓ సాంగ్, కొంత ప్యాచ్ వర్క్ పెండింగ్‌లో ఉన్నట్టు సమాచారం. బడ్జెట్ సెట్ అయితే మూవీ మొత్తం కంప్లీట్ చేసుకుని థియేటర్లోకి వస్తుందని సమాచారం. ప్రస్తుతం దీనిపైనే దర్శకుడు వర్క్ చేస్తున్నారట. ఈ సమ్మర్‌కి ఆడియెన్స్ ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. మొత్తంగా టీమ్ నుంచి తెలుస్తోన్న సమాచారం మేరకు మూవీ ఎప్పుడు వచ్చిన బ్లాక్ బస్టర్ పక్కా, కానీ అది ఎప్పుడొస్తుందనేదే అసలు సమస్య.
త్వరలో విశ్వంభర ప్రమోషన్స్ షురూ
అదే సమయంలో బిజినెస్ కూడా కావాల్సి ఉంది. ఒక్కసారి వర్క్ కంప్లీట్ చేసి, ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తే బిజినెస్ ఆటోమెటిక్‌గా అవుతుంది. ఇటీవల చిరంజీవి నటించిన `మన శంకర వర ప్రసాద్ గారు` పెద్ద హిట్ కావడంతో అది ఈ చిత్రానికి కలిసి వస్తుంది. అది బిజినెస్ పరంగానూ హెల్ప్ అవుతుందని చెప్పొచ్చు. ప్రస్తుతం దర్శకుడు వశిష్ట ఈ మూవీని ఫినిష్ చేసే పనిలో ఉన్నారని, త్వరలోనే ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తారని సమాచారం. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది. ఆషిక రంగనాథ్, ఇషా చావ్లా, సురభి కీలక పాత్రలు పోషించారు.

