- Home
- Entertainment
- Ranabaali OTT Release: రణబాలి ఓటీటీ రిలీజ్.. విజయ్ దేవరకొండ - రష్మికల సినిమా ఎక్కడ చూడొచ్చంటే?
Ranabaali OTT Release: రణబాలి ఓటీటీ రిలీజ్.. విజయ్ దేవరకొండ - రష్మికల సినిమా ఎక్కడ చూడొచ్చంటే?
Ranabaali OTT Release: విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహించిన సినిమా రణబాలి. ఈ సినిమా అక్టోబర్ 16న థియేటర్లలో రిలీజ్ అయింది. మరి ఈమూవీ ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

రణబాలి ఓటీటీ రిలీజ్.. ?
భారతదేశ చరిత్ర, సంస్కృతిని ప్రభావితం చేసిన మన పూర్వీకుల వీరగాథల ఆధారంగా తెరకెక్కిన సినిమా 'రణబాలి'. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇందులో జంటగా నటించారు. అక్టోబర్ 16న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా మంచి కలెక్షన్లనే రాబట్టింది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ రిలీజ్ వివరాలు బయటికొచ్చాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దీని డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకుంది. నవంబర్ 13 నుంచి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది.
పాటలు చాలా ప్రత్యేకం..
రాహుల్ సంకృత్యన్ ఈ 'రణబాలి' చిత్రానికి దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో విజయ్ దేవరకొండ రణబాలి పాత్రలో కనిపించగా, రష్మిక మందన్న జయమ్మ పాత్ర పోషించింది. వీరిద్దరి మధ్య ఉండే గాఢమైన ప్రేమను చూపిస్తూ విడుదలైన 'ఎంతయ్యా సామి' పాట అందరినీ ఆకట్టుకుంది. ట్రైలర్లో మునుపెన్నడూ చూడని అత్యంత పవర్ ఫుల్, ఇంటెన్స్ లుక్‌లో విజయ్ దేవరకొండ కనిపించి ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేశాడు.
80 లక్షల మంది భారతీయుల జ్ఞాపకార్థం
1876-1878 బ్రిటీష్ పాలనలో ప్రాణాలు కోల్పోయిన సుమారు 80 లక్షల మంది భారతీయుల జ్ఞాపకార్థం ఈ సినిమాను రూపొందించారు. ఆ కాలంలో భారతదేశంలో జరిగిన కొన్ని వాస్తవ చారిత్రక సంఘటనల ఆధారంగా దీన్ని తెరకెక్కించారు. "సింగనమల బొబ్బిలి రణబాలి" అనే వీరుడి పాత్రలో విజయ్ దేవరకొండ అదరగొట్టాడనే చెప్పాలి.
పాన్-ఇండియా స్థాయిలో రూపొందిన ఈ చిత్రాన్ని టీ-సిరీస్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో 'ద మమ్మీ', 'ద మమ్మీ రిటర్న్స్', 'బ్లడ్ డైమండ్' లాంటి సినిమాలతో ఫేమస్ అయిన హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ పవర్ ఫుల్ విలన్‌గా నటించారు. సర్ థియోడర్ హెక్టర్ అనే బ్రిటీష్ అధికారి పాత్రలో ఆయన కనిపించారు.













