MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Varshini: హౌస్ నుంచి వర్షిణి అవుట్.. బిగ్ బాస్ స్టేజీపై వృషకర్మ ఫుల్ జోష్, చైతూకు రామ్ ప్రసాద్ సర్ప్రైజ్

Varshini: హౌస్ నుంచి వర్షిణి అవుట్.. బిగ్ బాస్ స్టేజీపై వృషకర్మ ఫుల్ జోష్, చైతూకు రామ్ ప్రసాద్ సర్ప్రైజ్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో భాగంగా సందె ఎపిసోడ్ చాలా స్పెషల్ గా సాగింది. బిగ్ బాస్ షోలో వృషకర్మ టీం సందడి చేశారు. నాగ చైతన్య, మీనాక్షి చౌదరి, దర్శకుడు కార్తీక్ బిగ్ బాస్ స్టేజీపై మెరిశారు.

1 Min read
Author : Tirumala Dornala
Published : Nov 29 2026, 10:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
బిగ్ బాస్ తెలుగు 10
Image Credit : Jiohotstar

బిగ్ బాస్ తెలుగు 10

బిగ్ బాస్ షోలో సండే రోజు ఎలిమినేషన్ జరిగింది. వర్షిణి హౌస్ నుంచి బయటకు వెళ్ళింది. అదే విధంగా నాగ చైతన్య నటిస్తున్న క్రేజీ మూవీ వృషకర్మ టీమ్ బిగ్ బాస్ స్టేజీపై మెరిశారు. నాగ చైతన్యతో పాటు మీనాక్షి చౌదరి, దర్శకుడు కార్తీక్ దండు, విలన్ స్పర్శ్ శ్రీవాస్తవ, నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ బిగ్ బాస్ షోలో మెరిశారు. నిర్మాత ప్రసాద్ గురించి నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలకి చేశారు. మగధీర, అత్తారింటికి దారేది లాంటి ఇండస్ట్రీ హిట్స్ ఆయనకు మాత్రమే సాధ్యం అయ్యాయి అని అన్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
వృషకర్మ టీమ్ సందడి
Image Credit : Jiohotstar

వృషకర్మ టీమ్ సందడి

ఆ తర్వాత నాగార్జున.. చైతు, మీనాక్షి, కార్తీక్ లని వృషకర్మ విశేషాలు అడిగి తెలుసుకున్నారు. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఆడిన ఎంటర్టైన్మెంట్ గేమ్ చూసి చైతు, మీనాక్షి బాగా ఎంజాయ్ చేశారు. ఇంతలో రామ్ ప్రసాద్.. చైతు గురించి మాట్లాడుతూ.. నేను ఇండస్ట్రీకి వచ్చాక మొట్టమొదటి సారి ఆడిషన్స్ చేసి నటించిన చిత్రం జోష్. ఆ మూవీలో మీతో నాలుగు సీన్లలో నటించాను. ఇప్పుడు ఇలా మీ ముందు ఉన్నాను అని రామ్ ప్రసాద్ నాగ చైతన్యకు తెలిపారు. అది విన్న చైతు ఆశ్చర్యపోయారు.

33
వర్షిణి అవుట్
Image Credit : Jiohotstar

వర్షిణి అవుట్

ఆ తర్వాత వర్షిణి ఎలిమినేషన్ జరిగింది. చివరికి నామినేషన్స్ లో ఆర్కే, వర్షిణి మిగిలారు. సస్పెన్స్ కి తెర దించుతూ వర్షిణి ఎలిమినేట్ అయింది. దీనితో నాగార్జున ఆమెని స్టేజీపైకి పిలిచారు. హౌస్ లో టాప్ 5 లో ఉండడానికి అర్హత లేనివాళ్లు ఎవరు అని నాగార్జున అడిగారు. దీనికి వర్షిణి ఆర్కే, సుధీర్, అమన్ అని బదులిచ్చింది. ఆర్కే ఇంకా కన్ఫ్యూజన్ స్టేజీలోనే ఉన్నాడు. అమన్ కి డెసిషన్ మేకింగ్ తెలియదు అని వర్షిణి పేర్కొంది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Gold & Metal Rates

Loading rates…

All cities ›
Latest Videos
Recommended Stories
Recommended image1
AOT: చిరంజీవి, రామ్ చరణ్ లతో 'ఆకాశంలో ఒక తార' టీమ్.. దుల్కర్ కి మెగాస్టార్ ప్రశంసలు
Recommended image2
Salman Khan: ఇండియన్ ఆర్మీని గౌరవించే సినిమాలకు సపోర్ట్ చేయాలి.. సల్మాన్ మూవీపై వివేక్ ఒబెరాయ్ కామెంట్స్
Recommended image3
OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న సూర్య సూపర్ హిట్ మూవీ.. ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే..
Related Stories
Recommended image1
Sukumar: అల్లు అరవింద్ తో ఛాలెంజ్ చేసి లక్ష రూపాయలు ఓడిపోయిన సుకుమార్..గెలిచి ఉంటే ఎంత వచ్చేదో తెలుసా ?
Recommended image2
AOT: చిరంజీవి, రామ్ చరణ్ లతో 'ఆకాశంలో ఒక తార' టీమ్.. దుల్కర్ కి మెగాస్టార్ ప్రశంసలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved