దర్శకుడు, నిర్మాత, రచయిత వేణు ఊడుగులకు ఖమ్మంలోని జాషువా సాహిత్య సంఘం మహాకవి జాషువా పురస్కారాన్ని ప్రదానం చేసింది. మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

వేణు ఊడుగులకు మహాకవి జాషువా పురస్కారం

దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ప్రయాణం కొనసాగిస్తున్నారు వేణు ఊడుగుల. ఆయన కృషిని గుర్తిస్తూ ఖమ్మంలోని జాషువా సాహిత్య సంఘం మహాకవి జాషువా పురస్కారాన్ని అందించింది. మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ వేణు ఊడుగులకు ఈ పురస్కారం ప్రదానం చేశారు. ఈ కార్యక్రమం జాషువా సాహిత్య సంఘం అధ్యక్షుడు మువ్వా శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది.

ఈ కార్యక్రమంలో కొమ్మవరపు విల్సన్‌రావు రచించిన జాషువా పద్య శిల్పం, ప్రభలత, డప్పొల్ల రమేష్‌ సంపాదకత్వంలో వెలువడిన గుగ్గిలం పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా దర్శక, నిర్మాత వేణు ఊడుగుల తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. తన రచనలతో సమజాన్ని చైతన్య పరచిన మహాకవి జాషువా పేరిట నెలకొల్పన పురస్కారం తనకు దక్కడం గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు.

వేణు ఊడుగుల టాలీవుడ్ లో నీదీ నాదీ ఒకే కథ, విరాట పర్వం లాంటి విమర్శకుల పప్రశంసలు దక్కించుకున్న చిత్రాలకు దర్శకత్వం వహించారు. అదే విధంగా ఆయన నిర్మాణంలో రాజు వెడ్స్ రాంబాయి అనే సూపర్ హిట్ మూవీ తెరకెక్కింది.