రష్మిక మందన్నా రిలేషన్ షిప్ పై ఓపెన్ అయిన విజయ్ దేవరకొండ, ఏం చెప్పాడో తెలుసా?
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా ల సంబంధం గురించి తరచుగా వార్తలు వస్తుంటాయి. రష్మిక కానీ విజయ్ కానీ దీనిని బహిరంగంగా అంగీకరించలేదు. ఇప్పుడు ఒక ఇంటర్వ్యూలో విజయ్ ఈ ప్రేమ వ్యవహారం గురించి చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి...

విజయ్ దేవరకొండ ఇంటర్వ్యూ
ఫిల్మ్‌ఫేర్ ఇంటర్వ్యూలో విజయ్‌ను రష్మికతో ప్రేమ వ్యవహారం గురించి ప్రశ్నించగా, ఇండస్ట్రీలోని వ్యక్తులు తరచుగా వారిద్దరి పేర్లను జోడిస్తుంటారని, ఇవి నిజమేనా అని అడిగారు.
రష్మిక గురించి విజయ్ మాటలు
దీనికి విజయ్ స్పందిస్తూ, `ఇది మీరు ఇన్‌సైడర్‌లను అడగాలి` అన్నాడు. ఆ తర్వాత విజయ్ రష్మికతో తన ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ గురించి మాట్లాడారు. "నేను రష్మికతో ఎక్కువ సినిమాలు చేయలేదు. నేను మరిన్ని చేయాలి. ఆమె చాలా మంచి నటి. ఆమె అందమైన స్త్రీ. కాబట్టి కెమిస్ట్రీ సమస్య ఉండకూడదు` అని వెల్లడించారు.
రష్మిక గురించి విజయ్ వ్యాఖ్యలు
రష్మికలోని మంచి, చెడు లక్షణాల గురించి ప్రస్తావించారు విజయ్. "ఆమె చాలా కష్టపడి పనిచేస్తుంది. తన సంకల్పం,దృఢ నిశ్చయంతో ఏదైనా సాధించగలదు. తను మంచి వ్యక్తి. అందరి సౌకర్యం, ఆనందాన్ని తన కంటే ఎక్కువగా చూసుకుంటుంది. కాకపోతే అన్ని విషయాలను ఆమె బ్యాలెన్స్ చేసుకోవాలి` అని తెలిపారు.
విజయ్ దేవరకొండ పెళ్లి ప్రణాళికలు
విజయ్ దేవరకొండ త్వరలో పెళ్లి చేసుకుంటారా అని అడిగినప్పుడు, "ఒకరోజు ఖచ్చితంగా చేసుకుంటా" అని అన్నారు.
రష్మిక విజయ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు
కొన్ని రోజుల క్రితం రష్మిక మందన్న విజయ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ "విజ్జు" అని పిలిచారు. దీని ద్వారా ఆమె ఆయనను ఎలా పిలుస్తుందో తెలిసింది.
విజయ్, రష్మిక కలిసి నటించిన సినిమాలు
విజయ్, రష్మిక 'గీత గోవిందం`, 'డియర్ కామ్రేడ్' చిత్రాలలో కలిసి నటించారు. కొన్ని రోజుల క్రితం విజయ్ దేవరకొండ 14వ చిత్రం 'VD14'లో రష్మిక కథానాయికగా నటించవచ్చని వార్తలు వచ్చాయి, దీనికి రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తారు.