- Home
- Entertainment
- Prabhas: చిరంజీవి, బాలకృష్ణకి చుక్కలు చూపించాడు.. కానీ అల్లు అర్జున్ దెబ్బకు ప్రభాస్ సినిమా అడ్రస్ గల్లంతు
Prabhas: చిరంజీవి, బాలకృష్ణకి చుక్కలు చూపించాడు.. కానీ అల్లు అర్జున్ దెబ్బకు ప్రభాస్ సినిమా అడ్రస్ గల్లంతు
ప్రభాస్ నటించిన ది రాజాసాబ్ చిత్రం ఈ సంక్రాంతికి విడుదలైన తొలి చిత్రంగా నిలిచింది. గతంలో ప్రభాస్ నుంచి సంక్రాంతికి ఎన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి ? అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ప్రభాస్ ది రాజా సాబ్ మూవీ
ఈ సంక్రాంతికి తొలి చిత్రంగా ప్రభాస్ ది రాజా సాబ్ సందడి థియేటర్స్ లో మొదలైంది. ఏపీలో జనవరి 8 రాత్రి 9 గంటల నుంచి ప్రీమియర్ షోలు మొదలయ్యాయి. తెలంగాణలో ప్రీమియర్ షోల విషయంలో గందరగోళం నెలకొంది. దీనితో అర్థరాత్రి తర్వాతే హైదరాబాద్ లో ప్రీమియర్స్ మొదలయ్యాయి. మొత్తంగా రాజాసాబ్ హంగామా షురూ అయింది. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది.
డార్లింగ్ తర్వాత ఇదే
మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు. హారర్ కామెడీ చిత్రంగా ఈ మూవీ థియేటర్స్ లోకి వచ్చింది. డార్లింగ్ మూవీ తర్వాత ప్రభాస్ చేసిన కామెడీ టచ్ ఉన్న సినిమా ఇదే.
రాజాసాబ్ చిత్రానికి రెస్పాన్స్
రాజా సాబ్ ట్రైలర్స్, సాంగ్స్ అభిమానులని ఆకట్టుకున్నాయి. భారీ అంచనాలతో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అక్కడక్కడా కామెడీ, ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్ సన్నివేశాలు బావున్నాయని ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ వస్తోంది. మరి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్లు రాబడుతుందో రానున్న రోజుల్లో తెలియనుంది. సంక్రాంతికి ప్రభాస్ సినిమా రిలీజ్ కావడం ఇది మూడోసారి. గతంలో వర్షం, యోగి చిత్రాలు సంక్రాంతికి రిలీజ్ అయ్యాయి.
వర్షం
త్రిష, ప్రభాస్ జంటగా నటించిన వర్షం మూవీ అద్భుతమైన ప్రేమ కథగా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ చిత్రం 2004 సంక్రాంతికి జనవరి 14న రిలీజ్ అయింది. ఏకంగా బాలకృష్ణ లక్ష్మీ నరసింహ, చిరంజీవి అంజి చిత్రాలకు పోటీగా వర్షం రిలీజ్ అయింది. వర్షం మూవీ ప్రభావం బాలయ్య, చిరంజీవి సినిమాలపై పడింది. లక్ష్మీ నరసింహ మూవీ హిట్ అయింది.కానీ చిరంజీవి అంజి డిజాస్టర్ అయింది.
యోగి
సంక్రాంతికి రిలీజ్ అయిన ప్రభాస్ మరో సినిమా యోగి. వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిజాస్టర్ అయింది. ఈ మూవీ 2007 సంక్రాంతికి రిలీజ్ అయింది. యోగి తో పాటు అల్లు అర్జున్ దేశముదురు కూడా సంక్రాంతికే రిలీజ్ అయింది. దేశముదురు జోరు ముందు యోగి నిలబడలేకపోయింది.

