- Home
- Entertainment
- ఉదయ్ కిరణ్ మిస్ చేసుకున్న ప్రభాస్ బ్లాక్ బస్టర్ మూవీ ఏంటో తెలుసా? చేసి ఉంటే ఇప్పుడు గ్లోబల్ స్టార్
ఉదయ్ కిరణ్ మిస్ చేసుకున్న ప్రభాస్ బ్లాక్ బస్టర్ మూవీ ఏంటో తెలుసా? చేసి ఉంటే ఇప్పుడు గ్లోబల్ స్టార్
Uday Kiran-Prabhas: లవర్ బాయ్‌గా తెలుగు ఆడియెన్స్ ని అలరించిన ఉదయ్ కిరణ్ ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌ని మిస్ చేసుకున్నారు. అది చేసి ఉంటే గ్లోబల్ స్టార్ అయిపోయేవారు.

uday kiran, prabhas
Uday Kiran-Prabhas: ఉదయ్ కిరణ్ టాలీవుడ్ లవర్ బాయ్‌గా రాణించిన ఒకప్పుడు ఇండస్ట్రీని షేక్ చేసిన హీరో. బ్యాక్ టూ బ్యాక్ లవ్ స్టోరీస్‌తో విజయాలు అందుకున్నారు. లవర్ బాయ్‌గా పేరు తెచ్చుకున్నారు. రెండుమూడేళ్లలోనే తిరుగులేని సూపర్ స్టార్‌గా ఎదిగారు.
కొన్నాళ్లపాటు చాలా మంది యంగ్ స్టార్స్ కి చెమటలు పట్టించారు. ఆ సమయంలో ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్‌లు కూడా అంతంత మాత్రంగానే ఉన్నారు. జయాపజయాలతో స్ట్రగుల్ అవుతున్నారు. పవన్ తర్వాత ఆ రేంజ్‌లో ఉదయ్ కిరణ్‌కి ఆ క్రేజ్ వచ్చింది.
అమ్మాయిల ఫాలోయింగ్‌కి అంతా షాక్ అయ్యారు. అమ్మాయిలు ఉదయ్ కిరణ్ కోసం వెంటపడే వారంటే అతిశయోక్తి లేదు. అలాంటి క్రేజ్‌ని, స్టార్ హీరోని సొంతం చేసుకున్న ఉదయ్ కిరణ్ ఆ తర్వాత క్రమంగా డౌన్ అవుతూ వచ్చారు. ఆయన సినిమాలు సరిగా ఆడలేదు.
హిట్ అయిన మూవీస్ కూడా యావరేజ్‌గానే ఆడాయి. మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యే సినిమాలు పడలేదు. అయితే ఉదయ్ కిరణ్ స్వయంగా చేసిన కొన్ని మిస్టేక్స్ కూడా ఆయన డౌన్ కావడానికి కారణమయ్యింది.
ఉదయ్ కిరణ్ ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌ని మిస్ చేసుకున్నారు. ప్రభాస్ చేసిన హిట్ సినిమాని ఉదయ్ కిరణ్ మిస్ చేసుకున్నారు. మరి ఆ సినిమా ఏంటనేది చూస్తే, ప్రభాస్ కెరీర్ కి బిగ్ బ్రేక్ ఇచ్చిన మూవీ `వర్షం`. అది సంచలన విజయం సాధించింది. ఓ వైపు చిరంజీవి(అంజి), మరోవైపు బాలయ్య(లక్ష్మీ నరసింహ) సినిమాలకు పోటీగా చిన్న సినిమాగా ఇది విడుదలైంది.
కానీ వారి సినిమాలు డిజప్పాయింట్ చేయగా, ప్రభాస్ `వర్షం` బాక్సాఫీసుని షేక్ చేసింది. శోభన్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రభాస్‌కి జోడీగా త్రిష హీరోయిన్‌గా నటించింది. గోపీచంద్ విలన్‌గా చేశాడు. ఎంఎస్ రాజు నిర్మించారు.
2004లో సంక్రాంతికి విడుదలై పెద్ద హిట్ అయిన ఈ మూవీ మొదట చేయాల్సింది ఉదయ్ కిరణే. ఆయన్నే హీరోగా అనుకున్నారట. ఆల్మోస్ట్ ప్రాజెక్ట్ ఓకే అయ్యింది. కానీ ఏం జరిగిందో ఏమో ఉదయ్ కిరణ్ బయటకు వచ్చేశాడు. కానీ మొదట `వర్షం` మూవీ ఉదయ్ కిరణ్ వద్దకే వచ్చిందన్నారు మ్యూజిక్ డైరెక్టర్ జోష్యభట్ల.
ఇండియాగ్లిడ్జ్ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. మంచి మంచి ప్రాజెక్ట్ ఉదయ్ కిరణ్ వద్దకు వచ్చాయి, పోయాయని తెలిపారు. అవి చేసి ఉంటే ఇప్పుడు ప్రభాస్ మాదిరిగా గ్లోబల్ స్టార్‌గా నిలిచిపోయేవారని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
ఉదయ్ కిరణ్‌కి అలాంటి పరిస్థితి వచ్చేది కాదు. ఇప్పుడు ఆయన్ని మనందరం చూసి అభిమానించేవాళ్లం. కాలం వేసిన కాటుకు ఆయన బలయ్యారు. తెలుగు ఆడియెన్స్ మంచి హీరోని కోల్పోయారు.
ఉదయ్ కిరణ్ వరుస పరాజయాలతో డిప్రెషన్‌లోకి వెళ్లారని, దీంతో ఆర్థిక ఇబ్బందులు కూడా ఫేస్ చేశాడని,ఈ కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని అంటుంటారు. కానీ ఆర్థిక ఇబ్బందులు లేవని ఆయన అక్క తెలిపారు.
2014లో జనవరి 5న ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంతకు రెండేళ్ల ముందే ఆయన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ విషితతో వివాహం జరిగింది. 2003లో చిరంజీవి కూతురు సుష్మితాతో ఆయన ఎంగేజ్‌మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. అది క్యాన్సిల్ అయ్యింది.
also read: తెలుగు అమ్మాయిలకు సినిమా ఆఫర్స్, ట్రోలర్స్ దెబ్బకి మనసు మార్చుకున్న ఎస్‌కేఎన్