- Home
- Entertainment
- మహేష్ బాబు కోసం రెండు లారీల మల్లెపూలు తెప్పించిన డైరెక్టర్ ఎవరు? వాటితో ఏం చేశారో తెలుసా ?
మహేష్ బాబు కోసం రెండు లారీల మల్లెపూలు తెప్పించిన డైరెక్టర్ ఎవరు? వాటితో ఏం చేశారో తెలుసా ?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం ఓ దర్శకుడు ఏకంగా రెండు లారీల మల్లెపూలు తెప్పించాడు. ఇంతకీ ఆ పూలను దేనికోసం వాడారు. ఏసినిమా కోసం తెచ్చారు, ఈప్లాన్ చేసిన దర్శకుడు ఎవరో తెలుసా?

మహేష్ బాబు పై దర్శకుల ప్రయోగాలు..
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. కానీ కెరీర్ బిగినింగ్ లో ఆయన చాలా ప్రయోగాలు చేశాడు. ఆయన అప్పట్లో చేసిన సినిమాలకు, ఇప్పుడు చేస్తున్న సినిమాలకు మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తుంది. గతంలో మహేష్ బాబు చేసిన సినిమాల్లో పాత్రలు, గెటప్‌లు, కథల్లో విభిన్నత స్పష్టంగా కనిపించేది. ప్రస్తుతం కూడా ఆయన సినిమాల్లో వేరియేషన్ కనిపిస్తున్నప్పటికీ, అప్పటి ప్రయోగాలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అయితే మహేష్ బాబు కోసం అప్పటి దర్శకులు ఎన్నో కొత్త ప్రయోగాలు చేశారు. వాటిలో కొన్ని భారీ విజయాలు సాధించగా.. నాని లాంటి సినిమాలు మాత్రం డిజాస్టర్స్ గా మిగిలిపోయాయి.
సూపర్ స్టార్ కెరీర్ లో డిఫరెంట్ మూవీస్..
మహేష్ బాబు కెరీర్ లో డిఫరెంట్ గా చేసిన సినిమాలు, ప్రయోగాత్మకంగా నటించిన పాత్రలు అంటే వెంటనే నాని, మురారి, ఒక్కడు, టక్కరిదొంగ, సైనికుడు, అతిధి వంటి సినిమాలు గుర్తుకు వస్తాయి. ఈ సినిమాలన్నీంటికలో.. ప్రతీ ఒక్క దాంట్లో ఆయన పూర్తిగా భిన్నంగా కనిపించారు. ఈ క్రమంలో ఆయన కెరీర్‌లో ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్న చిత్రాలలో మురారి కూడా ఒకటి. ఫ్యామిలీ సబ్జెక్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా మహేష్ బాబు కెరీర్‌లోనే ఒక అద్భుతమైన చిత్రంగా నిలిచింది. అమాయకత్వం చూపిస్తూనే.. హీరోయిజం పండించిన.. ఇలాంటి పాత్రను ఆయన చేయడం అదే తొలిసారి కావడం విశేషం.
ఫ్యామిలీ ఆడియన్స్ ను మురిపించిన సినిమా..
మురారి సినిమా అప్పట్లో ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి భారీ ఆదరణ పొందింది. కుటుంబం మొత్తం కలిసి చూసేలా ఈ సినిమా రూపొందింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఎమోషన్స్, సెంటిమెంట్ సన్నివేశాలు ప్రేక్షకులను కంటతడి పెట్టించాయి. ఈ సినిమాలో ప్రతి సీన్, ప్రతి పాట, ప్రతి ప్రాప్ కూడా ఒక ఆర్ట్ వర్క్‌లా కనిపిస్తాయని అభిమానులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. ఎక్కడా వల్గారిటీ అనేది లేకుండా రూపొందించిన ఈసినిమా.. ఇప్పటికీ టీవీలో వస్తే.. అభిమానులు వదలకుండా చూస్తుంటారు. అంతే కాదు సోనాలీ బింద్రేతో మహేష్ బాబు లవ్ ట్రాక్ కూడా మురారీ సినిమాలో అద్భుతంగా పండింది.
మహేష్ బాబు కోసం రెండు లారీల మల్లెపూలు..
ఈ సినిమాలోని ఒక ప్రత్యేక సందర్భం ఉంది.అది ఒక స్పెషల్ రికార్డుకు దారి తీసింది. ఇందులో మహేష్ బాబు కోసం రెండు లారీల మల్లెపూలను ఉపయోగించారు. అది కూడా ఒక్క పాట కోసం అన్ని మల్లెపూలు తెప్పించారు. ఈ విషయాన్ని ఈసినిమా దర్శకుడు కృష్ణవంశీ స్వయంగా ఒక సందర్భంలో వెల్లడించారు. మురారి సినిమాలో.. బ్లాక్ బస్టర్ హిట్ అయిన పెళ్లి పాట కోసం ఆ పూలను వాడారు. మురారీలోని ఈ పాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే? తరాల పాటు గుర్తుండిపోయేలా ఈ పాటను కృష్ణవంశీ తెరకెక్కించారు. ఇప్పటికీ ప్రతీ పెళ్లి మండపంలో మురారీ పాట వినిపించాల్సిందే.
మహేష్ బాబు కెరీర్ లో స్పెషల్..
ఆ పెళ్లి పాట చిత్రీకరణ కోసం ఏకంగా రెండు లారీల మల్లెపూలు తెప్పించి ఉపయోగించారట. ఈ విషయం సినిమా మీద దర్శకుడు పెట్టిన శ్రద్ధను, ఆ పాటకు ఇచ్చిన ప్రాముఖ్యతను కృష్ణ వంశీ ఓ సందర్భంలో అద్భుతంగా వివరించారు. ఇక మురారి సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఈసినిమాలో ఇన్నోసెంట్ పాత్రలో హీరోయిజాన్ని చూపించాడు మహేష్.. అటు సోనాలి బింద్రే అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపిస్తూ తన నటనతో అందరిని ఆకట్టుకుంది. ఈసినిమా మహేష్ బాబు కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిపోయింది.

