- Home
- Entertainment
- 54 ఏళ్ల బ్యాచిలర్ హీరోయిన్, 30 ఏళ్ల కుర్ర హీరోతో రొమాన్స్, తెలుగు స్టార్ తో అఫైర్ రూమర్స్ ఫేస్ చేసిన నటి ఎవరు?
54 ఏళ్ల బ్యాచిలర్ హీరోయిన్, 30 ఏళ్ల కుర్ర హీరోతో రొమాన్స్, తెలుగు స్టార్ తో అఫైర్ రూమర్స్ ఫేస్ చేసిన నటి ఎవరు?
టాలీవుడ్, బాలీవుడ్ ను ఊపేసిన అందాల భామ , 54 ఏళ్లు దాటినా బ్యాచిలర్ జీవితాన్ని గడుపుతోన్న స్టార్ బ్యూటీ. తనకంటే 24 ఏళ్లు చిన్న హీరోతో రొమాన్స్ చేసిన నటి ఎవరో తెలుసా?

కుర్ర హీరోయిన్లు కుళ్లుకునే గ్లామర్
54 ఏళ్ల వయసులో కూడా కుర్ర హీరోయిన్లు కుళ్ళుకునే గ్లామర్ ఆమెది. ఇప్పటికీ ఆమె తెరపై కనిపిస్తే.. కేకలు పెడుతూ.. విజిల్స్ వేసే అభిమానులు ఉన్నారు. బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలలో.. ఆమె ఆమె పోస్టర్ కనిపిస్తే చాలు పరిగెత్తే వారు లేకపోలేదు. ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న ఈ బ్యూటీ.. పెళ్లి చేసుకోకుండా నచ్చిన సినిమా చేస్తూ.. తనకు ఇష్టమైన లైఫ్ ను హ్యాపీగా ఎంజాయ్ చేస్తోంది. ఈ ఏజ్ లో కూడా బోల్డ్ సీన్స్ కు రెడీ అంటోంది.
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరోయిన్
టాలీవుడ్, బాలీవుడ్ రెండింట్లోనూ తనదైన గుర్తింపు సంపాదించిన సీనియర్ నటి టబు. 54 ఏళ్ల వయసు దాటినా ఇప్పటికీ గ్లామర్, టాలెంట్‌లో ఏమాత్రం తగ్గడంలేదు స్టార్ హీరోయిన్ కి. పెళ్లి మాట ఎత్తకుండా.. బ్యాచిలర్‌గా జీవితాన్ని కొనసాగిస్తూ.. నచ్చిన సినిమాలు చేసుకుంటూ.. ముందుకు వెళ్తుంది టబు. ఇండస్ట్రీలో “మోస్ట్ బ్యాచిలర్ హీరోయిన్”గా పేరున్న ఈ బ్యూటీపై గతంలో పలువురు తెలుగు హీరోలతో అఫైర్ రూమర్స్ కూడా వినిపించాయి. తెలుగులో కింగ్ నాగార్జునతో టబుకు లింక్ చేస్తూ.. బోలెడు రూమర్లు షికారు చేశాయి.
24 ఏళ్లు చిన్న హీరోతో ఆన్ స్క్రీన్ రొమాన్స్
టబు టాలీవుడ్, బాలీవుడ్‌లలో ఒకే సమయంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. 54 ఏళ్లు దాటినా కూడా కుర్ర హీరోయిన్లకు పోటీగా గ్లామర్ పాత్రలు చేయగలుగుతోంది. ఈ మధ్య కాలంలో తనకంటే 24 ఏళ్లు చిన్న హీరో ఇషాన్ ఖట్టర్ తో రొమాంటిక్ సీన్స్‌లో నటించి ఆశ్చర్యపరిచింది టబు. 2020లో వచ్చిన ‘ది సూటబుల్ బాయ్’ వెబ్ సిరీస్‌లో ఇషాన్ ఖట్టర్‌తో కలిసి చేసిన రొమాంటిక్ సీన్స్ అప్పట్లో చర్చనీయాంశమయ్యాయి. ఈ విషయంలో విమర్శలు కూడా ఎదురయ్యాయి.
టాలీవుడ్ కు దూరంగా ఉన్న టబు..
బాలీవుడ్‌లో అడపాదడపా సినిమాలు చేస్తూనే, టాలీవుడ్ కు దూరంగా ఉంటోంది టబు. ఒకప్పుడు ఆమెకు హిట్ సినిమాలు ఇచ్చిన టాలీవుడ్ లో ఎక్కువగా సినిమాలు చేయడంలేదు. గత ఐదేళ్లుగా దూరంగా తెలుగు పరిశ్రమకు దూరంగా ఉంటోంది. 2020లో విడుదలైన బ్లాక్ బస్టర్ సినిమా ‘అలవైకుంఠపురములో’లో మోడ్రన్ మదర్ పాత్రలో టబు కనిపించారు. ఆ సినిమా తర్వాత టబు తెలుగులో వరుసగా సినిమాలు చేస్తారని అందరూ భావించారు. కానీ చేయలేదు.
54 ఏళ్ల వయసులోను తగ్గేదే లే..?
అలవైకుంఠపురములో తరువాత టబు తెలుగు సినిమా చేయలేదు. ఆమె టాలీవుడ్‌కు దూరంగా ఉండటానికి రకరకాల కారణాలు కనిపిస్తున్నాయి. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. బాలీవుడ్‌లో బిజీగా ఉండటం. హిందీలో ఆమెకు సీరియస్ రోల్స్, బోల్డ్ క్యారెక్టర్స్, సీనియర్ ఉమెన్ లీడ్ పాత్రలు వరుసగా వస్తున్నాయి. ప్రస్తుతం ‘భూత్ బంగ్లా’, ‘క్రూ’ వంటి సినిమాలతో టబు సందడి చేసింది. దాంతో తెలుగులో ఆమెకు స్కోప్ ఉన్న పాత్రలు దొరకడంలేదట. టాలీవుడ్ లో ఆఫర్లు వచ్చినా, తనకు సూట్ అయ్యే కథ, పాత్ర నచ్చితేనే టబు సినిమా ఒప్పుకుంటారని టాక్. సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లలోనూ నటిస్తూ కెరీర్‌లో దూసుకుపోతోంది టబు.

