MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • వెంకటేష్ కొడుకు అర్జున్ ను హీరోగా పరిచయం చేయబోతున్న డైరెక్టర్ ఎవరో తెలుసా? నిజమెంత?

వెంకటేష్ కొడుకు అర్జున్ ను హీరోగా పరిచయం చేయబోతున్న డైరెక్టర్ ఎవరో తెలుసా? నిజమెంత?

టాలీవుడ్ లో చిరంజీవి, నాగార్జున వారసులు హీరోలుగా కొనసాగుతుండగా.. బాలయ్య, వెంకటేష్ తనయుల రాకకోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో వెంకటేష్ కొడుకు అర్జున్ టాలీవుడ్ ఎంట్రీపై ఇండస్ట్రీలో ఓ వార్త వైరల్ అవుతోంది. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Dec 24 2025, 08:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వారసులు
Image Credit : facebook.com/Venkateshdaggubatifans

టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వారసులు

టాలీవుడ్ లో ఎంతో మంది స్టార్ హీరోలు వారసత్వంగా ఇండస్ట్రీకి వచ్చి.. తమ ట్యాలెంట్ తో నిలబడి చూపించారు. ఎంత వారసత్వంగా వచ్చినా.. వారిలో ప్రతిభ ఉంటేనే ఇండస్ట్రీలో ఉండగలుగుతారు అలా ట్యాలెంట్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి.. త్వరగా వెళ్లిపోయినవారు కూడా చాలామంది ఉన్నారు. అయితే మన తెలుగు పరిశ్రమలో మాత్రం స్టార్ హీరోలు, నిర్మాతల వారసులుగా ఇండస్ట్రీలోకి వచ్చిన బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు లాంటి హీరోలు ఎలాంటి పొజిషన్ లో ఉన్నారో తెలిసిందే. అంతే కాదు ఈ హీరోల వారసులు కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు.. ఇచ్చారు కూడా.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఫ్యామిలీ హీరోగా వెంకటేష్
Image Credit : facebook.com/Venkateshdaggubatifans

ఫ్యామిలీ హీరోగా వెంకటేష్

ఇప్పటికే నాగార్జున తనయులు నాగచైతన్య, అఖిల్ ఇద్దరు టాలీవుడ్ లో హీరోలుగా కొనసాగుతుండగా.. బాలయ్య వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీకి రంగం సిద్దం అయ్యింది. ఇక వెంకటేష్ తనయుడు అర్జున్ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సన్నాహాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. దగ్గుబాటి వారసులుగా ఇప్పటికే రానా దగ్గుబాటి ఎంట్రీ ఇచ్చాడు. ఇక వెంకటేష్ తనయుడి రాక కోసం విక్టరీ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. విక్టరీ వెంకటేష్‌కు ఫ్యామిలీ ఆడియన్స్‌ లో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇంట్లో ఉన్న ఆడవారిని కూడా థియేటర్లకు రప్పించడంలో సక్సెస్ అయిన హీరో వెంకీ. ఆయన సినిమాలు ఫ్యామిలీ అంతా చూడదగినవిగా ఉంటాయి.

Related Articles

Related image1
బాలకృష్ణ కెరీర్ లో ఎన్టీఆర్ వల్ల డిజాస్టర్ అయిన సినిమా ఏదో తెలుసా? దర్శకుడు ఎంత చెప్పినా రామారావు ఎందుకు వినలేదు?
Related image2
5000 తో ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చింది, ప్రస్తుతం 5 నిమిషాలకు 3 కోట్లు వసూలు చేస్తున్న హీరోయిన్ ఎవరో తెలుసా?
35
వెంకటేష్ వారసుడి కోసం అభిమానుల వెయిటింగ్
Image Credit : facebook.com/Venkateshdaggubatifans

వెంకటేష్ వారసుడి కోసం అభిమానుల వెయిటింగ్

ఒకప్పుడు శోభన్ బాబు సినిమాలు చూసేందుకు ఇలా ఫ్యామిలీ అంతా కదిలి వచ్చేవి. ఆతరువాత ఆ ఇమేజ్ వెంకటేష్ సాధించాడు. అంతే కాదు ఆయనకు రీమేక్ ల రారాజుగా పేరుంది. ఇతర భాషల్లో హిట్ అయిన ఫ్యామిలీ సబ్జెక్ట్స్ ను తీసుకుని.. తెలుగులో సక్సెస్ ఫుల్ గా రీమేక్ చేసేవారు వెంకీ. సెంటిమెంటల్ కథలతో పాటు, మాస్, ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్ ఉన్న సినిమాల్లో కూడా నటిస్తూ వెంకటేష్ తనదైన మార్క్‌ను చూపించాడు. ఈ విధంగా విభిన్న శైలుల్లో సినిమాలు చేస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. 65 ఏళ్ల వయసులో కూడా సక్సెస్ ఫుల్ హీరోగా కోనసాగుతున్నాడు వెంకీ.

45
అర్జున్ టాలీవుడ్ ఎంట్రీపై ఊహాగానాలు
Image Credit : facebook.com/Venkateshdaggubatifans

అర్జున్ టాలీవుడ్ ఎంట్రీపై ఊహాగానాలు

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో పలువురు స్టార్ హీరోలు తమ వారసులను హీరోలుగా పరిచయం చేస్తుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో వెంకటేష్ కుమారుడు అర్జున్‌ను కూడా త్వరలోనే ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అర్జున్‌కు నటనకు సంబంధించిన శిక్షణ కోసం విదేశాల్లో ట్రైనింగ్ ఇప్పిస్తున్నారన్న టాక్ బలంగా నడుస్తోంది. వెంకటేష్ తన వారుసుడిని ఎప్పుడు సినిమాల్లోకి తీసుకువస్తారన్న అంశంపై చాలా కాలంగా చర్చ జరుగుతూనే ఉంది. అయితే ఇంకా అర్జున్ కు హీరో అయ్యే ఏజ్ రాలేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. , వచ్చే రెండు మూడు సంవత్సరాల్లో అర్జున్‌ను హీరోగా పరిచయం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

55
డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు?
Image Credit : facebook.com/Venkateshdaggubatifans

డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు?

అయితే వెంకటేష్ తనయుడి సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారు అన్నవిషయంలో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. యంగ్ డైరెక్టర్లతో వెంకీ తన కుమారుడి ఎంట్రీని ప్లాన్ చేశారట. ఒక వాదన ప్రకారం మాటల మాత్రికుడు త్రివిక్రమ్ కుమారుడి డైరెక్షన్ లో వెంకీ తనయుడి ఎంట్రీ ఉంటుందని సమాచారం. అంతే కాదు పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ కూడా త్రివిక్రమ్ తనయుడి డైరెక్షన్ లో నే ఎంట్రీ ఇవ్వబోతున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజం ఎంతో తెలియాల్సి ఉంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
దగ్గుబాటి వెంకటేష్
తెలుగు సినిమా
నందమూరి బాలకృష్ణ
అక్కినేని నాగార్జున
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు ద్రోహం చేసిన సురేఖ, పవర్ స్టార్ జీవితాన్ని మలుపు తిప్పిన చిరంజీవి భార్య
Recommended image2
Pawan Kalyan: పవన్‌ వల్లే ఉదయ్‌ కిరణ్‌ ఫోటోలు లీక్‌.. సుస్మిత ఎంగేజ్‌మెంట్‌ క్యాన్సిల్‌ వెనుక జరిగింది ఇదే
Recommended image3
Reshma Rathore: సినిమాలకు గుడ్‌ బై చెప్పి కోర్ట్ మెట్లు ఎక్కుతున్న టాలీవుడ్‌ హీరోయిన్‌.. డేరింగ్‌ స్టెప్‌
Related Stories
Recommended image1
బాలకృష్ణ కెరీర్ లో ఎన్టీఆర్ వల్ల డిజాస్టర్ అయిన సినిమా ఏదో తెలుసా? దర్శకుడు ఎంత చెప్పినా రామారావు ఎందుకు వినలేదు?
Recommended image2
5000 తో ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చింది, ప్రస్తుతం 5 నిమిషాలకు 3 కోట్లు వసూలు చేస్తున్న హీరోయిన్ ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved