MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Giri Babu: నమ్మించి మోసం చేశారు.! చిరంజీవి 'కొదమ సింహం' మూవీ వల్ల రూ. 20 లక్షలు నష్టపోయా

Giri Babu: నమ్మించి మోసం చేశారు.! చిరంజీవి 'కొదమ సింహం' మూవీ వల్ల రూ. 20 లక్షలు నష్టపోయా

Actor Giri Babu: సీనియర్ నటుడు గిరిబాబు తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సినీ నిర్మాణ అనుభవాలను పంచుకున్నారు. సినిమా పట్ల తనకున్న మక్కువతో నటనతో పాటు దర్శకత్వం, నిర్మాణం వంటి విభాగాల్లోనూ ఆయన రాణించారు. అయితే, తన కుమారుడు బోస్ బాబు హీరోగా.. 

1 Min read
Author : Pavithra D
Published : Mar 17 2026, 07:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సినిమా రంగంలో ఎదురుదెబ్బలు
Image Credit : Giri Babu\Instagram

సినిమా రంగంలో ఎదురుదెబ్బలు

టాలీవుడ్ సీనియర్ నటుడు గిరిబాబు నటుడిగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా కూడా తనదైన ముద్ర వేశారు. అయితే, తన సినీ ప్రయాణంలో ఎదుర్కొన్న అతిపెద్ద ఆర్థిక నష్టం గురించి ఆయన ఇటీవల ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
నిర్మాణంలో క్రమశిక్షణ
Image Credit : Giri Babu\Instagram

నిర్మాణంలో క్రమశిక్షణ

గిరిబాబు సినిమాను ఎంతో పక్కాగా ప్లాన్ చేసేవారు. సెట్‌కు వెళ్ళే ముందే బౌండ్ స్క్రిప్ట్ సిద్ధం చేసుకుని, ఏ సీన్ ఎన్ని నిమిషాలు వస్తుందో వాచ్ పెట్టుకుని మరీ లెక్క వేసుకునేవారు. దీనివల్ల అనవసరమైన ఖర్చులు తగ్గేవి. పాత కాలపు మహామహులైన డైరెక్టర్ల నుంచి తాను ఈ క్రమశిక్షణను నేర్చుకున్నానని ఆయన చెప్పారు.

Related Articles

Related image1
Chiranjeevi: అందుకే అంత రాత్రిలో చిరంజీవి సెట్‌కి వచ్చారు.. ఆయన్ని చూసి యూనిట్ అంతా షాక్.!
Related image2
Chiranjeevi: హిట్లర్ మూవీలో ఆ ఒక్క డైలాగ్ మేనరిజం రాసింది నేనే.. చిరంజీవి పిలిచి ఏమన్నారంటే.?
35
'కొదమ సింహం' ఎఫెక్ట్
Image Credit : Giri Babu\Instagram

'కొదమ సింహం' ఎఫెక్ట్

తన కుమారుడు బోస్ బాబును హీరోగా పరిచయం చేస్తూ 'ఇంద్రజిత్' అనే భారీ కౌబాయ్ సినిమాను గిరిబాబు నిర్మించారు. అదే సమయంలో చిరంజీవి 'కొదమ సింహం' కూడా షూటింగ్‌లో ఉంది. నిజానికి 'కొదమ సింహం' కంటే ముందే 'ఇంద్రజిత్' విడుదల కావాల్సి ఉంది. కానీ, ఆ చిత్ర యూనిట్ ప్లాన్ మార్చి తమ సినిమాను హడావిడిగా ముందుగానే విడుదల చేశారని గిరిబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

45
ఆర్థిక నష్టం
Image Credit : Giri Babu\Instagram

ఆర్థిక నష్టం

'కొదమ సింహం' విడుదల కావడంతో, గిరిబాబు సినిమాను కొనడానికి వచ్చిన బయ్యర్లు వెనక్కి తగ్గిపోయారు. "చిరంజీవి సినిమానే ఆడనప్పుడు, కొత్తవాడితో తీసిన కౌబాయ్ సినిమా ఎలా హిట్ అవుతుంది?" అని వారు ప్రశ్నించారు. దీనివల్ల గిరిబాబు ప్రెస్టేజ్ కోసం రూ. 40 లక్షల విలువైన ఆ సినిమాను రూ. 20 లక్షలకే అమ్మాల్సి వచ్చింది. అలా ఆ ఒక్క సినిమాతోనే ఆయనకు రూ. 20 లక్షల నష్టం వాటిల్లింది.

55
ఒక అడిక్షన్ అని
Image Credit : Giri Babu\Instagram

ఒక అడిక్షన్ అని

సినిమా అంటే ఒక అడిక్షన్ అని, గెలుపోటములతో సంబంధం లేకుండా ఆ రంగుల ప్రపంచం మనల్ని వెన్నాడుతూనే ఉంటుందని గిరిబాబు అభివర్ణించారు. ఎన్ని నష్టాలు వచ్చినా, పట్టుదలతో ముందుకు సాగడమే తన విజయ రహస్యమని ఆయన పేర్కొన్నారు.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
వినోదం
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Kiara Advani: కూతురి గురించి గేమ్ ఛేంజర్ నటి ఎమోషనల్ పోస్ట్.. కానీ అసలు ట్విస్ట్ ఇదే!
Recommended image2
Cannes 2026: రెడ్ కార్పెట్‌పై అలియా నుంచి అదితి వరకు.. భర్తకు విడాకులిచ్చి అక్కడ ఎంజాయ్ చేస్తున్న బ్యూటీ
Recommended image3
Soundarya: 12 మంది హీరోలు వద్దన్న మూవీ..సౌందర్య సినిమా ఫ్లాప్ అయినా రికార్డుల్లో మాత్రం తోపు!
Related Stories
Recommended image1
Chiranjeevi: అందుకే అంత రాత్రిలో చిరంజీవి సెట్‌కి వచ్చారు.. ఆయన్ని చూసి యూనిట్ అంతా షాక్.!
Recommended image2
Chiranjeevi: హిట్లర్ మూవీలో ఆ ఒక్క డైలాగ్ మేనరిజం రాసింది నేనే.. చిరంజీవి పిలిచి ఏమన్నారంటే.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved