MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • TV
  • 2 కోట్లతో తీస్తే ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన ఒడియా మూవీ.. ఎంత వసూలు చేసిందో తెలుసా?

2 కోట్లతో తీస్తే ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన ఒడియా మూవీ.. ఎంత వసూలు చేసిందో తెలుసా?

ఇండియన్‌ సినిమాలో ఒడియా మూవీ ప్రస్తావనే పెద్దగా రాదు, కానీ ఇప్పుడు ఒక సినిమా మాత్రం ఇండియా వైడ్‌గా టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయ్యింది. ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. 

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Jun 28 2025, 07:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఇండియా వైడ్‌గా చర్చనీయాంశంగా మారిన ఒడియా మూవీ
Image Credit : x/Babushaan Mohanty

ఇండియా వైడ్‌గా చర్చనీయాంశంగా మారిన ఒడియా మూవీ

ఇండియన్‌ సినిమా అంటే మొన్నటి వరకు బాలీవుడ్‌, ఇప్పుడు టాలీవుడ్‌ పేర్లు వినిపిస్తాయి. ఇక తమిళం, కన్నడ, మలయాళం, మరాఠి, బెంగాలి, బోజ్‌పూరి ఇండస్ట్రీలు అడపాదడపా వార్తల్లో నిలుస్తుంటాయి. 

ఎప్పుడూ చర్చనీయాంశం కానీ, మెయిన్‌ స్ట్రీమ్ వార్తల్లో నిలవని ఒడియా(ఒరిస్సా) మూవీ ఇప్పుడు ఇండియాలో టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ కావడం విశేషం.

 దానికి కారణం ఒక మూవీ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాయడమే. ఆ మూవీనే `బౌ బుట్టు భూత`. తల్లికొడుకు దెయ్యం మధ్య జరిగే కథ ఇది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
`బౌ బుట్టు భూత` మూవీ ఒడియాలో సంచలనం
Image Credit : x/Babushaan Mohanty

`బౌ బుట్టు భూత` మూవీ ఒడియాలో సంచలనం

`బౌ(తల్లి) బుట్టు(కొడుకు) భూత(దెయ్యం)` అనే చిత్రం ఒరియాలో తెరకెక్కింది. ఈ మూవీకి జగదీష్‌ మిశ్రా దర్శకత్వం వహించగా, ఇందులో బాబూషాన్‌ మొహంతి, అర్చితా సాహు, అపరాజిత మొహంతి, అనుగులియా బంటీ ప్రధాన పాత్రల్లో నటించారు. 

బాబూషాన్‌ మొహంతి హీరోగా చెప్పొచ్చు. విలేజ్‌ ప్రధానంగా సాగే ఈ హర్రర్‌ మూవీ జూన్‌ 12న ఒరియాలో విడుదలైంది. కేవలం రెండు కోట్లతో రూపొందిన ఈ చిత్రం ఇప్పుడు ఒడియా భాషలో సంచలనం సృష్టించింది. ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తుంది.

Related Articles

Related image1
`కన్నప్ప` మొదటి రోజు కలెక్షన్లు.. మంచు విష్ణు కెరీర్‌లోనే హైయ్యెస్ట్, ఇక దశ తిరిగినట్టే
Related image2
`బిగ్‌ బాస్‌ తెలుగు 9`లోకి ఇద్దరు హీరోలు, రేటింగ్‌ కోసం ఈసారి వివాదాస్పద కంటెస్టెంట్లని దించుతున్న నాగార్జున
35
ఒడియా ఇండస్ట్రీ హిట్‌గా `బౌ బుట్టు భూత` మూవీ
Image Credit : x/Babushaan Mohanty

ఒడియా ఇండస్ట్రీ హిట్‌గా `బౌ బుట్టు భూత` మూవీ

`బౌ బుట్టు భూత` చిత్రం రెండు నుంచి రెండున్నర కోట్ల బడ్జెట్‌తో రూపొందింది. ఇప్పుడు పదిహేను రోజులకు ఈ చిత్రం ఏకంగా సుమారు రూ.13కోట్లు రాబట్టింది. ఒరియాలో హైయ్యెస్ట్ కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. 

ఇంకా ఈ మూవీ భారీ వసూళ్ల దిశగా వెళ్తుంది. రోజుకి ఈ చిత్రానికి సుమారు యాభై లక్షల కలెక్షన్లు వస్తున్నాయి. మున్ముందు ఇది మరింత భారీ కలెక్షన్లగా వెళ్తుందని చెప్పొచ్చు.

45
ఒడియా అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాలు
Image Credit : x/Babushaan Mohanty

ఒడియా అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాలు

ఇప్పటి వరకు ఒరియాలో ఏడున్నర కోట్లు రావడమే హైయ్యెస్ట్. అదే ఇండస్ట్రీ రికార్డు. మూడేళ్ల క్రితం వచ్చిన `డామన్‌` మూవీ ఈ రికార్డుని సృష్టించింది. 

ఇందులోనూ బాబూషాన్‌ మొహంతినే హీరో కావడం విశేషం. ఈ చిత్రం ఏడున్నర కోట్లతో ఇప్పటి వరకు ఇండస్ట్రీ హిట్‌గా ఉంది. ఇప్పుడు తన రికార్డుని తానే బ్రేక్‌ చేసుకున్నారు బాబూషాన్‌. 

ఆయన ఒడియా బిగ్గెస్ట్ స్టార్‌గా అవతరించారు. ఇక ఒడియా టాప్‌ గ్రాస్‌ చిత్రాల్లో గతేడాది వచ్చిన `కర్మ`(6.50కోట్లు), `పబార్‌`(3.50కోట్లు) వంటి చిత్రాలు ఒడియాలో టాప్‌ గ్రాసర్‌గా నిలిచాయి.

55
`బౌ బుట్టు భూత` మూవీ కథేంటంటే
Image Credit : x/Babushaan Mohanty

`బౌ బుట్టు భూత` మూవీ కథేంటంటే

ఇక `బౌ బుట్టు భూత` సినిమా కథ విషయానికి వస్తే ఒరిస్సాలోని ఒక విలేజ్‌లో తల్లితోపాటు కొడుకు(బాబూషాన్‌ మొహంతి) జీవిస్తుంటారు. వీరు చిన్న చిన్న పనులు చేస్తూ జీవనం సాగిస్తారు. తల్లి మంత్రగత్తె.

అక్కడే ఉంటే తమ బతుకులు మారవు, మనం ఎదగలేమని భావించిన కొడుకు వేరే ప్రాంతానికి వలస వెళ్లాలని ప్రయత్నిస్తాడు. ఈక్రమంలో అనుకోని అడ్డంకులు ఎదురవుతాయి. ఏకంగా దెయ్యం అతన్ని వెంటాడుతుంది. ఊరి దాటి వెళ్లనివ్వదు. 

మరి ఆ దెయ్యం ఎవరు? దాని కథేంటి? దాన్ని దాటుకుని కొడుకు తన లక్ష్యం దిశగా వెళ్లాడా? ఆ ఊర్లో ఏం జరిగిందనేది ఈ మూవీ కథ. ఆద్యంతం హర్రర్‌ ప్రధానంగా సాగుతుంది.

 కామెడీ ఎలిమెంట్లు, హర్రర్‌ అంశాల మేళవింపుగా సాగే ఈ మూవీ ఒరియా ఆడియెన్స్ ని ఆద్యంతం కట్టిపడేస్తుంది. దీంతో వారు ఈ మూవీకి బ్రహ్మరథం పడుతున్నారు. ఈ మూవీ కలెక్షన్ల పరంపర ఇంకా సాగుతూనే ఉంది. ఎక్కడ ఆగుతుందో చూడాలి.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu Winners :కళ్యాణ్ పడాల నుంచి శివబాలాజీ వరకు బిగ్ బాస్ తెలుగు విన్నర్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు?
Recommended image2
Bigg Boss Telugu 10 Final List: బిగ్‌ బాస్‌ తెలుగు 10 హౌజ్‌లోకి అడుగుపెడుతున్న 16 మంది కంటెస్టెంట్లు వీళ్లే
Recommended image3
Bigg Boss Telugu: నవదీప్‌కు కౌశల్ మందా కౌంటర్.. 'సభ్య సమాజానికి ఏమివ్వాలో చెప్పు' అంటూ షాకింగ్ కామెంట్స్
Related Stories
Recommended image1
`కన్నప్ప` మొదటి రోజు కలెక్షన్లు.. మంచు విష్ణు కెరీర్‌లోనే హైయ్యెస్ట్, ఇక దశ తిరిగినట్టే
Recommended image2
`బిగ్‌ బాస్‌ తెలుగు 9`లోకి ఇద్దరు హీరోలు, రేటింగ్‌ కోసం ఈసారి వివాదాస్పద కంటెస్టెంట్లని దించుతున్న నాగార్జున
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved