- Home
- Entertainment
- TV
- `కన్నప్ప` మొదటి రోజు కలెక్షన్లు.. మంచు విష్ణు కెరీర్‌లోనే హైయ్యెస్ట్, ఇక దశ తిరిగినట్టే
`కన్నప్ప` మొదటి రోజు కలెక్షన్లు.. మంచు విష్ణు కెరీర్‌లోనే హైయ్యెస్ట్, ఇక దశ తిరిగినట్టే
మంచు హీరోలు రూపొందించిన `కన్నప్ప` మూవీ శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంది. తాజాగా ఈ మూవీ ఫస్ట్ డే కలెక్షన్లు వచ్చాయి. వారి కెరీర్‌లోనే హైయ్యెస్ట్ కావడం విశేషం.

`కన్నప్ప`కి అన్ని వర్గాల్లో పాజిటివ్ టాక్
మంచు విష్ణు, మోహన్ బాబు ప్రతిష్టాత్మకంగా రూపొందించిన `కన్నప్ప` చిత్రం శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్‌తో రన్ అవుతుంది. ఊహించని విధంగా ఈ చిత్రానికి ఆడియెన్స్ నుంచి ఆదరణ లభిస్తోంది.
ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ వంటి భారీ కాస్టింగ్ ఉండటంతో ఈ మూవీపై మంచి బజ్ ఏర్పడింది. దానికి తగ్గట్టే సినిమాకి కూడా పాజిటివ్ టాక్ రావడంతో మంచి వసూళ్లు రాబడుతోంది. `కన్పప్ప` చిత్రం మొదటి రోజు కలెక్షన్లు మంచు విష్ణు కెరీర్‌లోనే అత్యధికంగా రావడం విశేషం.
`కన్నప్ప`కి పోటీ లేదు, భారీ స్థాయిలో రిలీజ్
`కన్నప్ప` చిత్రం శుక్రవారం భారీ స్థాయిలో విడుదలైంది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, అలాగే ఓవర్సీస్‌లోనూ విడుదలైంది. భారీ సినిమాలు లేకపోవడంతో ఈ చిత్రానికి కలిసి వచ్చింది.
పైగా పెద్ద కాస్టింగ్ ఉండటంతో విడుదల విషయంలో అన్ని భాషల్లోనూ మంచి రిలీజ్ దొరికింది. ఈ క్రమంలో `కన్నప్ప` మూవీ మొదటి రోజు కలెక్షన్లు ఎంత వచ్చాయనేది ఆసక్తికరంగా మారింది.
`కన్నప్ప` ఫస్ట్ డే కలెక్షన్లు ఇవే
`కన్నప్ప` చిత్రం ఫస్ట్ డే కలెక్షన్ల రిపోర్ట్ బయటకు వచ్చింది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఇరవై కోట్లు వసూలు చేసిందని సమాచారం. ఇండియాలో ఇది పది కోట్లు రాబట్టినట్టు తెలుస్తోంది.
ఓవర్సీస్‌లో దీనికి విశేష స్పందన లభిస్తోంది. అక్కడే ఈ మూవీ రూ.10కోట్లు వసూలు చేసిందని టాక్. ఇది మంచు విష్ణు కెరీర్‌లోనే అత్యధికం కావడం విశేషం.
గతంలో ఆయన సినిమాలే కనీసం పది కోట్లు వసూలు చేయలేదు. ఇప్పుడు కేవలం ఓవర్సీస్‌లోనే ఫస్ట్ డేనే ఈ రేంజ్ కలెక్షన్లు రావడం మరో విశేషమని చెప్పాలి.
`కన్నప్ప` మూవీకి శని, ఆదివారాల్లో కలెక్షన్లు పెరిగే ఛాన్స్
సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో శనివారం కలెక్షన్లు పెరిగే అవకాశం ఉంది. శని, ఆదివారాల్లో ఈ మూవీ పుంజుకుంటుంది. భారీ వసూళ్లని రాబడుతుందని చెప్పొచ్చు. ఈ మూడు రోజుల్లోనే పెట్టిన బడ్జెట్‌లో 50-60శాతం రికవరీ అయ్యే అవకాశం ఉంది.
మిగిలినవి లాంగ్‌రన్‌లో రాబట్టే ఛాన్స్ ఉంది. అయితే దీనికి పోటీగా పెద్ద సినిమాలు లేవు. రెండో వారంలో `తమ్ముడు` తప్ప మరో పెద్ద మూవీ లేదు. దీంతో రెండు మూడు వారాల వరకు `కన్నప్ప`కి కలిసి వచ్చే అవకాశం ఉంది.
దీనికితోడు సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్ కి కనెక్ట్ అయితే ఇది పెద్ద రేంజ్ హిట్ అవుతుందని, రెండు వందల కోట్లు దాటి వసూలు చేసినా ఆశ్చర్యం లేదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
`కన్నప్ప`తో మంచు విష్ణు క్రేజీ కమ్ బ్యాక్
`కన్నప్ప` చిత్రానికి రెండువందల కోట్ల బడ్జెట్ అంటూ ప్రచారం జరిగింది. కానీ వంద కోట్లకు అటు ఇటుగా అయి ఉంటుందని ఇన్ సైడ్ వర్గాల టాక్. ఈ లెక్కన నిర్మాతలు సేఫ్ కావాలంటే రెండు వందల కోట్లకుపైగా వసూలు రావాలి.
దీనికితోడు ఓటీటీ, శాటిలైట్, ఆడియో రైట్స్ రూపంలో భారీగానే వస్తుంది. ఈ లెక్కన మంచు హీరోలు ఈ మూవీతో సేఫ్ అవుతారని చెప్పొచ్చు. అదే సమయంలో మంచు విష్ణు తమ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టబోతున్నారని చెప్పొచ్చు.
ఇది ఆయనకి మంచి కమ్ బ్యాక్ అవుతుంది, పాన్ ఇండియాలోనూ ఆయన మార్కెట్ పెరగడానికి ఉపయోగపడుతుంది. అయితే ఈ వీకెండ్ వచ్చే కలెక్షన్లని బట్టి ఈ మూవీ సక్సెస్ రేంజ్‌ని అంచనా వేయోచ్చు. టీమ్ మాత్రం దీన్ని డివోషనల్ బ్లాక్ బస్టర్‌గా ప్రకటించడం విశేషం.
`కన్నప్ప` మూవీ స్టోరీ ఏంటంటే
`కన్నప్ప` మూవీ కథేంటనేది చూస్తే, శ్రీకాళహస్తి ప్రాంతంలోని అటవి ప్రాంతంలో జన్మించిన తిన్నడు(మంచు విష్ణు) దేవుడిని నమ్మడు. చిన్నప్పుడు తాను చూసిన కొన్ని మూఢాచారాల వల్ల ఆ నిర్ణయానికి వస్తాడు.
దేవుడంటే అసహ్యించుకునే తిన్నడు శివ భక్తుడు ఎలా అయ్యాడు? ఆయనలో మార్పుకి రుద్ర(ప్రభాస్) ఎలా కారణమయ్యాడు? అనేది ఈ చిత్ర కథ. ఎమోషనల్ గా సాగుతూ ఆకట్టుకునేలా ఉంది. సెకండాఫ్‌లో మూవీ ధైవభక్తి ప్రధానంగా సాగుతుంది.
ప్రభాస్ ఎంట్రీతో సినిమా రేంజ్ మారిపోయింది. క్లైమాక్స్ ఆద్యంతం గుండెబరువెక్కించేలా ఉంటుంది. ఇదే సినిమాకి ఆయువు పట్టు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ మూవీని మోహన్ బాబు నిర్మించిన విషయం తెలిసిందే.