అనుకోని రోడ్డు ప్రమాదంతో షాక్ కు గురయ్యారు జబర్ధస్త్ స్టార్ కమెడియన్స్ ఇద్దరు. స్టేజ్ మీత తమ పంచులతో ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్వించే రైజింగ్ రాజు, దొరబాబు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ప్రస్తుతం వారి పరిస్థితి ఎలా ఉందంటే?
జబర్దస్త్' కమెడియన్లకు ప్రమాదం..
ప్రముఖ కామెడీ షో 'జబర్దస్త్' ద్వారా తెలుగు ప్రేక్షకులకు నవ్వుల్లో ముంచెత్తుతు చేరువైన కమెడియన్లు రైజింగ్ రాజు (Rising Raju), దొరబాబు (Dora Babu)లకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. పశ్చిమ గోదావరి జిల్లాలో వీరు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురికావడంతో ఇద్దరూ గాయపడ్డారు. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? వారిపరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది?
ప్రమాదం ఎలా జరిగింది?
ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనడానికి రైజింగ్ రాజు, దొరబాబు కాకినాడ నుంచి భీమవరం వైపు కారులో బయలుదేరారు. మార్గమధ్యలో పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం పెన్నాడా అగ్రహారం సమీపంలోకి రాగానే కారు అదుపుతప్పి, రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది.
ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటే?
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, కారులో ఉన్న వారిని బయటకు తీశారు. గాయపడిన రైజింగ్ రాజు, దొరబాబులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు. వీరికి ఎలాంటి ప్రాణాపాయం లేదని తెలియడంతో అభిమానులు, తోటి కళాకారులు, ఈవెంట్ నిర్వాహకులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు. 'జబర్దస్త్' స్కిట్లతో నవ్వులు పంచుతూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రైజింగ్ రాజు, దొరబాబు త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
















