- Home
- Entertainment
- Bigg Boss 10: బిగ్ బాస్ 11 వారం ఎలిమినేషన్.. నీతూ నటరాజ్ ఎలిమినేట్.. మరో కంటెస్టెంట్ కూడా?
Bigg Boss 10: బిగ్ బాస్ 11 వారం ఎలిమినేషన్.. నీతూ నటరాజ్ ఎలిమినేట్.. మరో కంటెస్టెంట్ కూడా?
బిగ్ బాస్ తెలుగు 10.. 11 వారం హౌజ్‌ని ఎవరు వీడుతారు, ఎలిమినేషన్ అయ్యేది ఎవరనేది ఆసక్తికరంగా మారిన నేపథ్యంలో ఇప్పుడు క్రేజీ అప్ డేట్ వచ్చింది. ఊహించినట్టుగానే ఎలిమినేషన్ జరిగిందట.

బిగ్ బాస్ తెలుగు 10 11 వారం ఎలిమినేషన్
బిగ్ బాస్ తెలుగు 10.. 11 వారం ఎలిమినేషన్‌కి సంబంధించిన ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో ముందు నుంచి ఊహించిందే జరిగింది. క్రేజీ ఎలిమినేషన్ జరిగిందని సమాచారం. ఈ వారం త్రిగుణ్, ముఖేష్, దేబ్జానీ, అమన్, రామకృష్ణ, వార్షిణి, రామ్ ప్రసాద్, వంశీ, సుధీర్, శివ, నీతూ మాస్టర్ నామినేషన్లో ఉన్నారు. వీరిలో ఒకరు ఎలిమినేట్ కావాల్సి ఉంది. అందులో భాగంగా ఇప్పుడు ఎలిమినేషన్‌కి సంబంధించిన అప్ డేట్ వచ్చింది.
నీతూ నటరాజ్ ఎలిమినేషన్
11వ వారం బిగ్ బాస్ హౌజ్ నుంచి నీతూ నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యిందని తెలుస్తోంది. ఓటింగ్‌లో ఆమె బాటమ్‌లో ఉంది. బిగ్ బాస్ అభిమానులు నిర్వహించిన ఓటింగ్‌లో ఆమె లీస్ట్ లో ఉన్నారు. ఆమెతోపాటు రామకృష్ణ, శివ, సుధీర్ కూడా లీస్ట్ లో ఉన్నారు. వీరిలో ఒకరు ఎలిమినేట్ అవుతారనే ప్రచారం జరిగింది. అందులో నీతూ నటరాజ్ మాస్టర్‌కే ఎక్కువ ఛాన్స్ ఉందన్నారు. ఊహించినట్టుగానే ఇప్పుడు ఆమె ఎలిమినేట్ అయినట్టు తెలుస్తోంది.
డబుల్ ఎలిమినేషన్‌కి ఛాన్స్
అయితే ఈ వారం డబుల్ ఎలిమినేషన్‌కి ఛాన్స్ ఉందట. నీతూ నటరాజ్ మాస్టర్‌తోపాటు మరొకరు ఎలిమినేట్ అయినా ఆశ్చర్యం లేదంటున్నారు. అందులో రామకృష్ణగానీ, సుధీర్గానీ ఉండే అవకాశం ఉంది. అయితే ఓటింగ్‌లో శివకుమార్ కి కూడా తక్కువగానే ఓట్లు వచ్చాయి. కానీ ఆయన్ని ఇప్పుడే ఎలిమినేషన్ చేసే అవకాశం లేదు. టాప్ 5లో ఉంటాడని టాక్. ఈ నేపథ్యంలో వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన వారిని ఎలిమినేట్ చేస్తారని అన్నారు. అలా నీతూ నటరాజ్‌తోపాటు డబుల్ ఎలిమినేషన్ ఉంటే రామకృష్ణ కూడా హౌజ్‌ని వీడే అవకాశాలున్నాయి. మరి డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా లేదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.
నీతూ నటరాజ్ మాస్టర్ ప్రారంభంలో హడావుడి చేసింది. ఫైరింగ్‌తో ఉంది. కానీ ఆ తర్వాత ఆ జోరు చూపించలేకపోయింది. పెద్దగా యాక్టివ్‌గా కనిపించలేదు. కంటెంట్ ఇవ్వడంలో ఫెయిల్ అయ్యింది. అందుకే ఆమెని ఈ వారం హౌజ్ నుంచి పంపించినట్టు సమాచారం.















