- Home
- Entertainment
- Bigg Boss Telugu 10: నరేష్ గంజి తింటుంటే చూసి ఏడ్చేసిన రామ్ ప్రసాద్.. అల్టిమేట్ పవర్ దక్కించుకున్న అమన్
Bigg Boss Telugu 10: నరేష్ గంజి తింటుంటే చూసి ఏడ్చేసిన రామ్ ప్రసాద్.. అల్టిమేట్ పవర్ దక్కించుకున్న అమన్
బిగ్ బాస్ హౌస్ లో 75వ రోజు ఎమోషనల్ సంఘటన చోటు చేసుకుంది. నరేష్ కోసం రామ్ ప్రసాద్ కన్నీళ్లు పెట్టుకున్నారు. అదే విధంగా అమన్ కొత్త కెప్టెన్ గా అవతరించారు. అల్టిమేట్ పవర్ కూడా దక్కించుకున్నారు.

బిగ్ బాస్ తెలుగు 10
బిగ్ బాస్ హౌస్ లో శుక్రవారం రోజు కెప్టెన్సీ టాస్క్ జరిగింది. కెప్టెన్సీ పోరులో పాల్గొనేందుకు కంటెండర్స్ గానలుగురికి అవకాశం దక్కింది. త్రిగుణ్ తన టీమ్ నుంచి అమన్, దేబ్జానీ, శివకుమార్ లకు ఛాన్స్ ఇచ్చారు. ముకేశ్ టీమ్ టాస్కులలో వెనుకబడింది కాబట్టి వాళ్ళ టీమ్ నుంచి ఒక్కరికే ఛాన్స్. ఆ ఒక్కరిని కూడా టాస్క్ ఇచ్చి ఎంపిక చేశారు.
కెప్టెన్సీ పోటీ
ఈ టాస్క్ లో డిక్టేటర్ అయిన ముకేశ్ కూడా పాల్గొన్నారు. కెప్టెన్సీ కంటెండర్ గా అవకాశం దక్కించుకోవడం కోసం ముకేశ్, నీతూ, ఆర్కే గేమ్ లో పోటీ పడ్డారు. కానీ నీతూ విజయం సాధించి కంటెండర్ గా అవకాశం దక్కించుకుంది. దీనితో నీతూ, అమన్, దేబ్జానీ, శివకుమార్ కెప్టెన్సీ పోటీలో పాల్గొన్నారు. ఎవరికీ కేటాయించిన బ్లాక్స్ ని వేగంగా నిలబెట్టి ఆ తర్వాత పడగొట్టాలి. ఎవరు ముందుగా ఈ టాస్క్ ఫినిష్ చేస్తే వాళ్లే విజేతలు.
కొత్త కెప్టెన్ గా అమన్
ఈ టాస్క్ లో అమన్ విజయం సాధించి హౌస్ కి కొత్త కెప్టెన్ గా అవతరించారు. కెప్టెన్సీ దక్కించుకోవడం మాత్రమే కాదు. అతడికి అల్టిమేట్ పవర్ కూడా దక్కింది. అల్టిమేట్ పవర్ అంటే టికెట్ టు ఫినాలే టాస్క్ లో పాల్గొనే కంటెండర్ గా ఛాన్స్ దక్కడం. అంతకు ముందు హౌస్ లో ఎమోషనల్ సంఘటన చోటు చేసుకుంది. ముందంజలో ఉన్న త్రిగుణ్ టీమ్ కి బిగ్ బాస్ బిర్యానీ, భోజనం పంపారు. ముందంజలో ఉన్న త్రిగుణ్ టీమ్, అదే విధంగా మరో డిక్టేటర్ అయిన ముకేశ్ మాత్రమే ఈ భోజనం తినాలి. ఓడిపోయిన ముకేశ్ టీమ్ సభ్యులు మాత్రం బిగ్ బాస్ పంపిన గంజి మాత్రమే తినాలి.
నరేష్ ని చూసి ఏడ్చేసిన రామ్ ప్రసాద్
నరేష్ ముకేశ్ టీమ్ లో ఉన్నాడు. దీనితో గంజి తినక తప్పలేదు. అది చూసి రాంప్రసాద్ ఎమోషనల్ అయ్యాడు. నరేష్ అలా గంజి తింటుంటే తట్టుకోలేకపోయాను అని త్రిగుణ్ వద్ద ఏడ్చాడు. మేము బయట ఎలా తింటామో తెలుసా.. కానీ ఈ రోజు వాడు గంజి తింటుంటే చూడలేకపోయాను అని రామ్ ప్రసాద్ కన్నీళ్లు పెట్టుకున్నాడు.














