- Home
- Entertainment
- TV
- `బిగ్ బాస్ తెలుగు 9`లోకి ఇద్దరు హీరోలు, రేటింగ్ కోసం ఈసారి వివాదాస్పద కంటెస్టెంట్లని దించుతున్న నాగార్జున
`బిగ్ బాస్ తెలుగు 9`లోకి ఇద్దరు హీరోలు, రేటింగ్ కోసం ఈసారి వివాదాస్పద కంటెస్టెంట్లని దించుతున్న నాగార్జున
బిగ్ బాస్ తెలుగు 9 హౌజ్‌లోకి ఈ సారి ఇద్దరు హీరోలు రాబోతున్నారట. అంతేకాదు పలువురు వివాదాస్పద కంటెస్టెంట్లని దించుతూ షోని రణరంగంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారట.

`బిగ్ బాస్ తెలుగు 9` ప్రోమోతో సందడి షురూ
`బిగ్ బాస్ తెలుగు 9`వ సీజన్‌కి సంబంధించిన సందడి స్టార్ట్ అవుతుంది. 9వ సీజన్ అనౌన్స్ మెంట్‌తో ప్రోమో విడుదల చేసింది టీమ్. దీంతో బిగ్ బాస్ హడావుడి స్టార్ట్ అయ్యిందని చెప్పొచ్చు.
ఇప్పటికే చాలా రోజులుగా ఈ సీజన్‌లో పాల్గొనబోతున్న కంటెస్టెంట్ల వీరే అంటూ కొన్ని పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొందరిని బిగ్ బాస్ నిర్వాహకులు అప్రోచ్ అయినట్టు తెలిసింది.
ఈ క్రమంలో కొత్తగా పలు క్రేజీ పేర్లు వినిపిస్తున్నాయి. ఈ సారి వివాదాస్పద కంటెస్టెంట్లకి ప్రయారిటీ ఇస్తున్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో ఇద్దరు హీరోలు కూడా ఈ షోకి రాబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది.
`అలేఖ్య చిట్టి పికిల్స్` ఫేమ్ రమ్య కంచర్ల
`బిగ్ బాస్ తెలుగు 9` సీజన్‌కి రాబోతున్న వారి పేర్లలో ప్రముఖంగా వివాదాస్పద ఆర్టిస్ట్ ల పేర్లు తెరపైకి వచ్చాయి. అందులో భాగంగా అలేఖ్య చిట్టి రాబోతుందని సమాచారం. ఆమెని బిగ్ బాస్ నిర్వాహకులు అప్రోచ్ అయ్యారట.
ఆమె అలేఖ్య చిట్టి పికిల్స్ ద్వారా పాపులర్ అయిన విషయం తెలిసిందే. ముగ్గురు అమ్మాయిలు కలిసి ఈ చిట్టి పికిల్స్ ని నడిపిస్తున్నారు. ముగ్గురిలో బాగా అందంగా ఉన్న అమ్మాయి రమ్య మోక్ష కంచర్ల.
పికిల్స్ రేట్ గురించి ప్రశ్నించిన నెటిజన్‌కి బూతులతో సమాధానం చెప్పి వైరల్ అయ్యారు. ఆమెని బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అయ్యారని సమాచారం. ప్రస్తుతం ఎంపిక ప్రక్రియ జరుగుతుందని, రమ్య ఆల్మోస్ట్ కన్ఫమ్ అని అంటున్నారు.
పబ్‌లో రచ్చ చేసిన కల్పిక గణేష్
ఆమెతోపాటు ఆ మధ్య పబ్‌లో గొడవ చేసి పెద్ద రచ్చ చేసిన కల్పిక గణేష్ కూడా ఈ షోకి రాబోతున్నట్టు టాక్. ఆమెని కూడా బిగ్ బాస్ నిర్వాహకులు అప్రోచ్ అయినట్టు సమాచారం. తన బర్త్ డే రోజు పబ్ నిర్వాహకులపై దాడి చేసింది.
అలాగే పోలీసులను కూడా ఇరికిస్తూ కామెంట్స్ చేసింది. ఆ తర్వాత ఇదంతా పాపులారిటీ కోసం, వ్యూస్ కోసం చేసినట్టు తెలిపి షాకిచ్చింది. దీంతో ఆమెపై కేసు కూడా నమోదైనట్టు తెలిసింది. ఇప్పుడు ఆమెని బిగ్ బాస్ షోకి తీసుకొస్తున్నారనే వార్త ఆసక్తికరంగా మారింది.
వందల కోట్ల ల్యాండ్ కబ్జా వివాదంలో రీతూ చౌదరీ
అలాగే సోషల్ మీడియా సెన్సేషన్ రీతూ చౌదరీ పేరు కూడా ప్రధానంగా వినిపించింది. ఆమె ఆ మధ్య కొన్ని వందల కోట్ల ల్యాండ్ కబ్జా వ్యవహారంలో వివాదంలో ఇరుక్కుంది.
తన పేరుతోనే ప్రియుడు ఆ ల్యాండ్‌ని రిజిస్టర్ చేయించాడని, కానీ అది తనకు ఇల్లీగల్ అనే విషయం తెలియదని ఆమె చెప్పడం షాకిచ్చింది. అంతేకాదు సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలను పంచుకుంటూ రచ్చ లేపుతుంది రీతూ చౌదరి.
ఆమె ఈ షోకి వస్తే ఇక రచ్చ వేరేలా ఉంటుందని చెప్పొచ్చు. వీరితోపాటు బెట్టింగ్ యాప్‌లో పేర్లు వినిపించిన వారు కూడా ఈ షోకి వస్తున్నారని అంటున్నారు.
సన్నీ యాదవ్ రాబోతున్నట్టు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. అయితే ఇది ప్రచారం కోసమే చేసిన స్టంటా లేక నిజంగానే వస్తున్నాడా? అనేది తెలియాల్సి ఉంది.
లావణ్య ని వదిలేసిన వివాదంలో రాజ్ తరుణ్
ఇక మరోవైపు వివాదాలకు కేరాఫ్‌గా హీరో ఈ షోకి వస్తున్నారని అంటున్నారు. ఆయన ఎవరో కాదు రాజ్ తరుణ్. గత సీజన్‌లోనే ఆయన వస్తారని ప్రచారం జరిగింది. కానీ నో చెప్పాడట. ఇప్పుడు రావాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.
ఆయన తన ప్రియురాలి విషయంలో వివాదంలో ఇరుక్కున్న విషయం తెలిసిందే. లావణ్య అనే అమ్మాయితో కొన్నాళ్లపాటు సహజీవనం చేసి ఆ తర్వాత మరో హీరోయిన్ తో ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నాడని, లావణ్య కేసు పెట్టింది. పెద్దపెంట చేసింది.
ఈ విషయంలో రాజ్ తరుణ్ ఇమేజ్ బాగా డ్యామేజ్ అయ్యింది. ఇప్పుడు ఆయన బిగ్ బాస్ షోలోకి వస్తున్నారనే వార్త ఆశ్చర్యపరుస్తుంది.
ఆయన చేసిన సినిమాలు పెద్దగా ఆడటం లేదు, నిర్మాతలు ఆయనతో సినిమాలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఈ క్రమంలో మరోసారి తన పాపులారిటీ పెంచుకునేందుకు బిగ్ బాస్ షోకి వస్తున్నారని టాక్.
మరో హీరో సుమంత్ అశ్విన్ బిగ్ బాస్ హౌజ్‌లోకి
సినిమా హీరో కేటగిరిలో మరో హీరో సుమంత్ అశ్విన్ రాబోతున్నట్టు టాక్. ఆయన ప్రముఖ దర్శక, నిర్మాత ఎంఎస్ రాజు తనయుడు అనే విషయం తెలిసిందే. `కేరింత` వంటి సినిమాతో హీరోగా ఆకట్టుకున్నాడు.
చాలా సినిమాలు చేశాడు, కానీ హీరోగా నిలబడలేకపోయాడు. దీంతో తనని తాను నిరూపించుకునేందుకు ఈ సారి బిగ్ బాస్ హౌజ్‌కి వస్తున్నట్టు టాక్. ఇదే నిజమైతే ఈ సారి ఇద్దరు హీరోలు బిగ్ బాస్‌షోలో సందడి చేయబోతున్నారని చెప్పొచ్చు.
అలాగే సీనియర్ నటుడు సాయి కిరణ్, నటుడు `ఛత్రపతి` శేఖర్ కూడా రాబోతున్నట్టు టాక్. మరోవైపు బిగ్ బాస్ తెలుగు 8వ సీజన్ విన్నర్ నిఖిల్ లవర్ కావ్య కూడా రాబోతున్నారట. వీరిద్దరు లవ్ బ్రేకప్ అయిన విషయం తెలిసిందే. ఆ మధ్య ఈ జంట గురించి బాగా చర్చ జరిగింది.
వీరితోపాటు టీవీ సీరియల్స్ నుంచి దీపికా, ప్రియాంక జైన్ ప్రియుడు శివ, జబర్దస్త్ షో నుంచి ఇమ్మాన్యుయెల్, తేజస్విని, మరో బుల్లితెర సెన్సేషన్ దేబ్‌జానీ, టీవీ ఆర్టిస్ట్ సీతా కాంత్, సీనియర్ నటుడు ప్రదీప్, హరికా ఏక్‌నాథ్, మై విలేజ్ షో అనిల్ వంటి వారు పేర్లు వినిపిస్తున్నాయి. మరి వీరిలో ఎంత మంది వస్తారనేది చూడాలి.
సెప్టెంబర్ 7న `బిగ్ బాస్ తెలుగు 9` ప్రారంభం?
`బిగ్ బాస్ తెలుగు 9` కోసం ఎక్కువగా వివాదాస్పద కంటెస్టెంట్లని దించుతున్నారు. గత సీజన్‌లో షోకి పెద్దగా రేటింగ్ రాలేదు. కంటెస్టెంట్లు కూడా డల్‌గా ఉన్నారు. పెద్ద గొడవలు లేకుండా కూల్‌గా గేమ్స్ ఆడుకుంటూ ఉండటంతో జనం పెద్దగా ఆసక్తి చూపించలేదు.
అందుకే బిగ్ బాస్ తెలుగు 9 ప్రోమోలో చెప్పినట్టు ఈ సారి హౌజ్‌ని రణరంగం చేసేందుకు రెడీ అయినట్టు టాక్. ఈ సీజన్ సెప్టెంబర్ 7న ప్రారంభమవుతుందని తెలుస్తోంది.
హోస్ట్ మారతారనే రూమర్లు వినిపించిన నేపథ్యంలో తాజాగా విడుదలైన ప్రోమోతో క్లారిటీ ఇచ్చింది టీమ్. ఈ సారి కూడా నాగార్జుననే హోస్ట్ అని కన్ఫమ్ చేసింది. అంతేకాదు వచ్చే సీజన్ కూడా ఆయనే హోస్ట్ గా వ్యవహరిస్తారు.
ఎందుకంటే పది సీజన్ల వరకు హోస్ట్ నాగార్జుననే అని ఆయనతో హాట్ స్టార్ వాళ్లు అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. ఆ విషయంలో అగ్రిమెంట్ బ్రేక్ చేయడానికి లేదు. కాబట్టి నాగార్జున హోస్ట్ అనేది ఫిక్స్.