MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • TV
  • Karthika Deepam 2 Today Episode: ఒక్కటైన తండ్రి, కూతురు- జ్యో టెన్షన్- దశరథ ఆవేశం- జైలుకు జ్యో?

Karthika Deepam 2 Today Episode: ఒక్కటైన తండ్రి, కూతురు- జ్యో టెన్షన్- దశరథ ఆవేశం- జైలుకు జ్యో?

కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ (ఫిబ్రవరి 20వ తేదీ)లో కాశీని మళ్లీ తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేసిన జ్యో. దీపే నీ కన్నకూతురని దశరథకు నిజం చెప్పిన కార్తీక్. తండ్రిని పట్టుకొని కన్నీళ్లు పెట్టుకున్న దీప. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..  

4 Min read
Author : Kavitha G
Published : Feb 20 2026, 08:36 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
Image Credit : Jiohotstar

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్

కార్తీక దీపం 2 సీరియల్ శుక్రవారం ఎపిసోడ్ లో కాశీతో నార్మల్ గా మాట్లాడ్డానికి ట్రై చేస్తుంది జ్యోత్స్న. నువ్వు నా జీవితాన్ని నాశనం చేసింది చాలు. నువ్వు నాతో మాట్లాడకు అంటాడు కాశీ. పారు కూడా కాశీకే వత్తాసు పలుకుతుంది. నువ్వు పూర్తిగా నా మాట వినుంటే ఈ పరిస్థితి రాకపోయేది అంటుంది జ్యోత్స్న. నీ మాట వింటే ఇంకా నేను జైల్లోనే ఉండేవాడ్ని. నీ వల్ల నా భార్య కూడా నన్ను వదిలేసింది అంటాడు కాశీ.

29
నీతో నాకు మాటలు అనవసరం
Image Credit : Jiohotstar

నీతో నాకు మాటలు అనవసరం

నీ ప్లేస్ లో నేనుంటే వేరేవాళ్లను పెళ్లిచేసుకునేదాన్ని అంటుంది జ్యోత్స్న. నీకు ప్రేమ, బంధాలు అంటే విలువ లేదు. నువ్వు అలాగే చేస్తావు. నేను చేయలేను. అయినా నీతో నాకు మాటలు అనవసరం అంటాడు కాశీ. దాసు బాబాయి కనిపించాడు అని చెప్పావు కదా.. ఏం చెప్పాడు అని అడుగుతుంది జ్యోత్స్న. నీకెందుకు అంటాడు కాశీ. బాబాయ్ కోసం పారు బాధపడుతోంది అంటుంది జ్యోత్స్న. బావను కలవడానికి వెళ్తున్నాను అని చెప్పాడు అంటాడు కాశీ. ఇక్కడికి రాకుండా బావను కలవడానికి వెళ్లాడు అంటే ఏదో చేస్తున్నారు అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న.

Related Articles

Related image1
Karthika Deepam 2 Today Episode:దశరథ చేతికి రిపోర్ట్స్- కార్తీక్ ని నిలదీసిన దశరథ- నిజం చెప్పేశాడా?
Related image2
Karthika Deepam 2 Today Episode: జ్యో దాసు కూతురని దశరథకు నిజం చెప్పిన కార్తీక్- షాక్ లో దశరథ
39
దీపే నీ కన్నకూతురు
Image Credit : Jiohotstar

దీపే నీ కన్నకూతురు

దశరథను చేయి పట్టుకొని దీప ఉన్న చోటుకి తీసుకెళ్తాడు కార్తీక్. నా కూతురు ఎక్కడ ఉందో చూపించరా.. నీ నోటి నుంచి అదిగో నీ కూతురు అనే మాట తప్ప, ఇంకేది నేను వినాలి అనుకోవట్లేదు అంటాడు దశరథ. చూపిస్తా, మామయ్య అని దీపాలు వెలిగిస్తున్న దీపను చూపిస్తాడు కార్తీక్. కళ్లు తుడుచుకొని దీపను చూసి షాక్ అవుతాడు దశరథ. దీపే నీ కన్నకూతురు మామయ్య అని చెప్తాడు కార్తీక్. మా అమ్మ దూరం చేసిన బిడ్డ దీపే అన్నయ్య అంటాడు దాసు. నువ్వు తన తండ్రివి అని దీపకు తెలుసు అని చెప్తాడు కార్తీక్.

49
నాన్న అని పిలువు
Image Credit : Jiohotstar

నాన్న అని పిలువు

దశరథ, దీప దగ్గరకు వెళ్తాడు. ఏంటి చిన్నయ్య గారు మీరూ గుడికి వచ్చారా.. సుమిత్రమ్మ కూడా వచ్చిందా? మీరు వస్తున్నట్లు బావ నాతో చెప్పనేలేదు అంటుంది దీప. చిన్నయ్య గారు కాదమ్మా నాన్న అని పిలువు అంటాడు దశరథ. పిలవాలని ఉన్నా, నాకు ఆ అదృష్టం లేదు అంటుంది దీప. కన్నతండ్రి మీద అధికారం కన్న కూతురికి కాకుండా ఎవరికి ఉంటుంది అని ఎమోషనల్ అవుతాడు దశరథ. కార్తీక్ ముఖం చూస్తుంది దీప. నిజం చెప్పేశాను దీప. నువ్వు ఇక మీ నాన్నను మనస్ఫూర్తిగా నాన్న అని పిలుచుకోవచ్చు అంటాడు కార్తీక్.

59
దీపను గుండెలకు హత్తుకున్న దశరథ
Image Credit : Jiohotstar

దీపను గుండెలకు హత్తుకున్న దశరథ

తండ్రి కాళ్లకు దండం పెడుతుంది దీప. పైకి లేపి గుండెలకు హత్తుకుంటాడు దశరథ. కన్నీళ్లు పెట్టుకుంటుంది దీప. వాడంటే నా మేనల్లుడు నిజం దాచి ఉండొచ్చు. కానీ నువ్వు మా కన్నకూతురివే కదా.. మా కళ్ల ముందే తిరుగుతూ నిజం చెప్పకుండా ఎలా ఉన్నావు. నీ కన్నీళ్లను ఎలా గుండెల్లో దాచుకున్నావు అని ఎమోషనల్ అవుతాడు దశరథ. నేను మీ దగ్గరి నుంచి నాకు తెలియకుండానే దూరమయ్యాను. తెలియకుండానే దగ్గరయ్యాను. నువ్వు నన్ను మొదటిసారి పిలిచిన పిలుపు నా పెంచిన తండ్రిని గుర్తుచేసింది. అప్పుడు నాకు తెలియదు. నేను నా కన్నతండ్రితో మాట్లాడుతున్నానని అంటూ తండ్రి గుండెలపై వాలి కన్నీళ్లు పెట్టుకుంటుంది దీప.

69
అన్నీ తనే చేసింది..
Image Credit : Jiohotstar

అన్నీ తనే చేసింది..

ఇన్ని రోజులు నిజం ఎందుకు చెప్పలేదమ్మా అని దీపను అడుగుతాడు దశరథ. నేనే చెప్పొద్దన్నాను మామయ్య అంటాడు కార్తీక్. ఎందుకురా అంటాడు దశరథ. దీప, శౌర్యను చంపాలనుకుంది జ్యోత్స్ననే మామయ్య. దీప ఆ ఇంటి వారసురాలు అని తెలిసినప్పటి నుంచి తనని ఆ ఇంటికి దూరం చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేసింది. నేను దీపను పెళ్లి చేసుకున్నాక మీరు మాకు దూరం అయ్యారు. తర్వాత దీప హాస్పిటల్లో ఉన్నప్పుడు అగ్రిమెంట్ మీద సంతకం పెడితేనే దీపను కాపాడతానని జ్యోత్స్న బేరం పెట్టింది. 

79
పోలీసులకు పట్టిస్తాను..
Image Credit : Jiohotstar

పోలీసులకు పట్టిస్తాను..

ఆ అగ్రిమెంట్ తో మళ్లీ మీ ఇంటికి వచ్చాము. అవమానాలు పడ్డాము. అన్నీ జ్యోత్స్న, పారులను నుంచి మిమ్మల్ని కాపాడుకునేందుకే అని చెప్తాడు కార్తీక్. జ్యోత్స్న తన కూతురు కాదని అత్తకు తెలిస్తే, తను ఎలా తీసుకుంటుందో కూడా తెలియదు. అందుకే ఈ నిజాలు ఎవరికీ చెప్పలేదు అని చెప్తాడు కార్తీక్. జ్యోత్స్న ఆటలన్నీ నిజం నాకు తెలియనంత వరకే. నేను తన పని చెప్తాను. దీపే నా కూతురని ఈ రోజు అందరికీ తెలియాలి. జ్యోత్స్నను జైలుకు పంపిస్తాను అనుకుంటూ ఆవేశంగా అక్కడి నుంచి బయల్దేరుతాడు దశరథ.

89
జ్యోత్స్న టెన్షన్
Image Credit : Jiohotstar

జ్యోత్స్న టెన్షన్

ఏదో జరుగుతోంది. కానీ ఏం జరుగుతుందో తెలియట్లేదు అని టెన్షన్ పడుతుంటుంది జ్యోత్స్న. దాసు, బావను కలవడానికి వెళ్లాడు అంటే నేను ముందు అత్త ఇంటికి వెళ్లాలి. వెళ్లే దారిలోనే దాసును ఏదో ఒకటి చేయాలి. అదే కరెక్ట్ లేకపోతే ఈ టెన్షన్స్ అన్నీ నేను పడలేను అని అనుకుంటుంది జ్యోత్స్న. అంతలో పారు అక్కడికి వస్తుంది.

99
పోలీసులు నీకోసమే వస్తారు..
Image Credit : Jiohotstar

పోలీసులు నీకోసమే వస్తారు..

ఏం ఆలోచిస్తున్నావు అంటుంది పారు. మన వెనకాల ఏదో జరుగుతోంది గ్రానీ అంటుంది జ్యోత్స్న. ఏం జరిగినా నీకు ఇబ్బందిలేదు. నువ్వు శివన్నారాయణ అసలు వారసురాలివి కదా అంటుంది పారు. నాన్న, బావ దగ్గరికి వెళ్లి నిజం చెప్తే ఏమవుతుందో తెలుసా అంటుంది జ్యోత్స్న. నువ్వు నా ముందు కూడా నటించకు. మీ నాన్న దశరథ కదా అంటుంది పారు. అది నేను నమ్మట్లేదు అంటుంది జ్యోత్స్న. నువ్వు సుమిత్ర కూతురువి అని చెప్పడానికి సాక్ష్యాలు ఉన్నాయి. కానీ మా దగ్గర ఏం ఉన్నాయి అంటుంది పారు. 

ఓ దాసు కిడ్నాప్ గురించి బయటపడుతుందని భయపడుతున్నావా? బయటపడితే నువ్వు పోలీసు స్టేషన్ కి వెళ్లడం ఖాయం అంటుంది పారు. పోలీసులు వస్తారు. కానీ నాకోసం కాదు.. పిల్లలను మార్చి అంతకంటే పెద్ద పాపం చేసిన నీకోసం అంటుంది గ్రానీ. నువ్వు చేసిన పని నా పాలిట వరమే కావచ్చు. కానీ అది ఈ ఇంట్లో వాళ్లు క్షమించలేని నేరం అని జ్యోత్స్న అనడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
OTT: చెమటలు పట్టించే క్రైమ్, థ్రిల్లర్.. డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు, ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడో తెలుసా?
Recommended image2
Gunde Ninda Gudi Gantalu: మౌనిక మీద సంజూ కుట్ర, బాలు ఫోన్ కొట్టేసిన రోహిణీ, వీడియో దొరికిందా?
Recommended image3
Karthika Deepam 2 Today Episode: జ్యో దాసు కూతురని దశరథకు నిజం చెప్పిన కార్తీక్- షాక్ లో దశరథ
Related Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode:దశరథ చేతికి రిపోర్ట్స్- కార్తీక్ ని నిలదీసిన దశరథ- నిజం చెప్పేశాడా?
Recommended image2
Karthika Deepam 2 Today Episode: జ్యో దాసు కూతురని దశరథకు నిజం చెప్పిన కార్తీక్- షాక్ లో దశరథ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved