MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • TV
  • Karthika Deepam 2 Today Episode: జ్యో దాసు కూతురని దశరథకు నిజం చెప్పిన కార్తీక్- షాక్ లో దశరథ

Karthika Deepam 2 Today Episode: జ్యో దాసు కూతురని దశరథకు నిజం చెప్పిన కార్తీక్- షాక్ లో దశరథ

కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ (ఫిబ్రవరి 19వ తేదీ)లో జ్యో నీ కన్న కూతురు కాదు అని దశరథతో నిజం చెప్పిన కార్తీక్, దాసు. షాక్ లో దశరథ. కాశీకి టిఫిన్ పెట్టిన స్వప్న. లోలోపల కుంగిపోయిన పారు. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..  

4 Min read
Author : Kavitha G
Published : Feb 19 2026, 08:23 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
Image Credit : Jiohotstar

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్

కార్తీక దీపం 2 సీరియల్ గురువారం ఎపిసోడ్ లో నేను వివరాలు ఏం తెలుసుకోకుండా సుమిత్రను ఆపరేషన్ కి తీసుకెళ్తే అంతా కలిసి తనని చంపేసే వాళ్లు కదా, అసలు మా వెనకాల జరుగుతోంది? నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావని కార్తీక్ ను నిలదీస్తాడు దశరథ. అత్తకు ఏం కాదు మామయ్య అంటాడు కార్తీక్. ఓవైపు జ్యోత్స్న శాంపిల్స్ మ్యాచ్ కాలేదు. నువ్వు ఏమో అత్తకు ఏం కాదు అంటున్నావు. సుమిత్రను ఎలా కాపాడుకుంటాం రా అని అడుగుతాడు దశరథ. 

కార్తీక్ చెప్పేది నిజమే అన్నయ్య. వదినకు ఏం కాదు అంటూ దాసు ఏంట్రీ ఇస్తాడు. ఏం చేసి అయినా సరే కార్తీక్ వాళ్ల అత్తను కాపాడుకుంటాడు అని చెప్తాడు దాసు. ఇంకా ఎన్నిసార్లు టెస్ట్ చేసినా జ్యోత్స్న శాంపిల్స్ మ్యాచ్ కావు అన్నయ్య అంటాడు దాసు. ఎందుకు కావు అని అడుగుతాడు దశరథ. ఎందుకంటే జ్యోత్స్న నీ కన్నకూతురు కాదు కాబట్టి అని బాంబ్ పేలుస్తాడు కార్తీక్.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
కాశీకి టిఫిన్ పెట్టిన స్వప్న
Image Credit : Jiohotstar

కాశీకి టిఫిన్ పెట్టిన స్వప్న

మరోవైపు టిఫిన్ చేయడానికి కూర్చొంటారు శ్రీధర్, స్వప్న. శ్రీధర్ కాశీని తినడానికి పిలుస్తాడు. ఆ మాట వినగానే వెంటనే స్వప్న కుర్చీలో నుంచి లేస్తుంది. ఈ వ్యక్తి పక్కన కూర్చొని నేను తినలేను అంటుంది. తనని ఇంకా నువ్వు నీ భర్తగానే చూస్తున్నావా అని అడుగుతాడు శ్రీధర్. లేదు అయినా సరే నేను తనని పక్కన చూడలేను అంటుంది స్వప్న. 

నువ్వు ఇంత వీక్ పర్సన్ అనుకోలేదు. ఒకరు మనకు వద్దనుకున్నప్పుడు వదిలేయాలి అంటాడు శ్రీధర్. డ్రైవర్ కి కొన్ని లిమిట్స్ ఉంటాయి. నా హద్దుల్లో నేను ఉంటాను అని కింద కూర్చొంటాడు కాశీ. తనకి టిఫిన్ పెట్టమని స్వప్నతో చెప్తాడు శ్రీధర్. ప్లేటు తీసుకొచ్చి టీపాయ్ మీద పెడుతుంది స్వప్న. లేచి పైన కూర్చొని తింటాడు కాశీ.

Related Articles

Related image1
Karthika Deepam 2 Today Episode:దీపను నిజం చెప్పమన్న మామ-దశరథలో పెరిగిన డౌట్-నిజాలు బయటపెట్టిన దాసు
Related image2
Karthika Deepam 2 Today Episode:దశరథ చేతికి రిపోర్ట్స్- కార్తీక్ ని నిలదీసిన దశరథ- నిజం చెప్పేశాడా?
37
షాక్ లో దశరథ
Image Credit : Jiohotstar

షాక్ లో దశరథ

మరోవైపు కార్తీక్ చెప్పిన నిజం విని షాక్ అవుతాడు దశరథ. నువ్వు ఏం మాట్లాడుతున్నావ్ రా. నా బిడ్డ పుట్టిన దగ్గరి నుంచి నా చేతుల్లోనే, నా కళ్ల ముందే పెరిగింది. ఇప్పుడు నా బిడ్డ కాకుండా ఎలా పోతుంది. అది తప్పులు చేసి ఉండొచ్చు. శాంపిల్స్ మ్యాచ్ కాకపోవచ్చు. కానీ జ్యోత్స్న నా కూతురే కాదంటే ఎలా నమ్మాలి అంటాడు దశరథ.

అత్త డెలివరీ అయిన కాసేపటికే బిడ్డలను మార్చేశారు మామయ్య. నీ కూతురు పై నుంచి కిందకు చేరుకుంది. మరొకరి కూతురు నీ కూతురు స్థానంలో ఊయలలోకి చేరుకుందని చెప్తాడు కార్తీక్. బిడ్డలను మార్చాల్సిన అవసరం ఎవరికి ఉందిరా? అని అడుగుతాడు దశరథ. మా అమ్మకు అన్నయ్య అంటాడు దాసు. షాక్ అవుతాడు దశరథ. తాత మీద పగతో పారునే బిడ్డలను మార్చేసింది. ప్రత్యక్షసాక్షి దాసు మామయ్యనే అని చెప్తాడు కార్తీక్.

47
అందుకే జ్యో అంటే పారుకు ప్రేమ
Image Credit : Jiohotstar

అందుకే జ్యో అంటే పారుకు ప్రేమ

బిడ్డలను కళ్ల ముందే మార్చినా ఏం చేయలేని పరిస్థతిలో ఉండిపోయాను అన్నయ్య అంటాడు దాసు. నా బిడ్డను తీసుకెళ్లి, మరొకరి బిడ్డ నా ఇంట్లో పెరగాలని పిన్ని కోరుకోవడం ఏంటి అని అడుగుతాడు దశరథ. జ్యోత్స్న ఎవరి కూతురో కాదు మామయ్య... దాసు మామయ్య కూతురే అని చెప్తాడు కార్తీక్. నాకు, కళ్యాణికి పుట్టిన కూతురే జ్యోత్స్న అన్నయ్య. మా అమ్మ కావాలనే నా బిడ్డను నీ ఇంటి వారసురాలిని చేసింది అంటాడు దాసు. సొంత మనుమరాలు కాబట్టే జ్యోత్స్న అంటే పారుకు అంత ప్రేమ అని చెప్తాడు కార్తీక్. దానికి రిలేటెడ్ గా గతంలో జరిగిన కొన్ని విషయాలను గుర్తుచేసుకుంటాడు దశరథ.

57
జ్యోత్స్నకు నిజం తెలుసు
Image Credit : Jiohotstar

జ్యోత్స్నకు నిజం తెలుసు

నీకు ఇంకో విషయం చెప్పనా మామయ్య.. జ్యోత్స్న మీ సొంత కూతురు కాదని తనకు కూడా తెలుసు. ఈ నిజం చెప్పొద్దని దాసు మామయ్య దగ్గర జ్యోత్స్న మాట తీసుకుంది. నిజం ఎక్కడ బయటపడుతుందోనని కన్నతండ్రినే చంపాలనుకుంది అని చెప్తాడు కార్తీక్. ఈ నిజాలు నీకు ఎప్పుడు తెలుసురా అని అడుగుతాడు దశరథ. కొన్నేళ్ల క్రితమే తెలిశాయి అంటాడు కార్తీక్. అన్ని తెలిసి కూడా మాతో ఏం చెప్పలేదు. అసలు నీకు నన్ను మామయ్య అని పిలిచే అర్హతే లేదు అని కార్తీక్ పై కాస్త సీరియస్ అవుతాడు దశరథ.

67
షాక్ అయిన జ్యోత్స్న
Image Credit : Jiohotstar

షాక్ అయిన జ్యోత్స్న

మరోవైపు ఇంట్లో తిరుగుతూ ఈ ఆస్తి అంతా నాదే అనుకున్నా. ఏదో ఒక రోజు ముసలోడిని, వాడి కొడుకును గెంటేసి హాల్లో పెద్ద ఊయల వేసుకొని కాలు మీద కాలు వేసుకుని ఊగుదామనుకున్నా.. ఎంత మోసం చేశావురా సైదులు అని మనసులో అనుకుంటుంది పారు. అంతలో శివన్నారాయణ వచ్చి ఏమైంది పారిజాతం ఏం వెతుకుతున్నావు అని అడుగుతాడు. రత్నాల కోసం, వజ్రాన్ని పారేసుకున్నాను. ఈ మధ్యే తెలిసింది నాకు దొరికింది రంగురాయి అని అంటుంది పారు. ఇంతలో కాశీ, శ్రీధర్ అక్కడికి వస్తారు. 

కాశీతో మాట్లాడుతుంది పారు. తండ్రి కనిపించడం లేదనే బెంగతో ఎక్కడో తిరుగుతున్నావు అనుకున్నాను అంటుంది పారు. నేను బాగానే ఉన్నాను. నాన్న కనిపించాడు, మాట్లాడాను. నా గురించి నువ్వు ఏం బాధపడకు అంటాడు కాశీ. ఆ మాటలు విని షాక్ అవుతుంది జ్యోత్స్న. దాసు ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్లాడు. నైట్ డాడీ చెప్పిన ముఖ్యమైన పని దాసును కలవడమేనా అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. మరి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావురా అని కాశీని అడుగుతుంది పారు. కాశీని డ్రైవర్ గా పెట్టాం. వాడు చేసే పని వెనుక ఓ ప్రయోజనం ఉందని చెప్తాడు శివన్నారాయణ చెప్పి.. శ్రీధర్ తో ఆఫీసు విషయాలు మాట్లాడుతుంటాడు శివన్నారాయణ.

77
నా కూతురు ఎవరు?
Image Credit : Jiohotstar

నా కూతురు ఎవరు?

నేను ఇంకో విషయం అడుగుతా నిజం చెప్తావా అని కార్తీక్ ని అడుగుతాడు దశరథ. నా కూతురు ఎవరు? తను బతికే ఉందా? లేదా మా పిన్ని నా బిడ్డను చంపేసిందా? అని ఎమోషనల్ అవుతాడు దశరథ. బతికే ఉంది మామయ్య. ఇక్కడే ఉంది. నీ కోసం నీ కూతురిని కూడా తీసుకొచ్చాను అని చెప్తాడు కార్తీక్. మరోవైపు దీప, దీపాలు వెలిగిస్తూ ఉంటుంది. ఇప్పటివరకు కొన్ని నిజాలు చెప్పాను. ఇప్పుడు కొన్ని చూపిస్తాను నాతో రా మామయ్య అని కార్తీక్ దశరథతో అనడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu: నవదీప్‌కు కౌశల్ మందా కౌంటర్.. 'సభ్య సమాజానికి ఏమివ్వాలో చెప్పు' అంటూ షాకింగ్ కామెంట్స్
Recommended image2
Bigg Boss Agnipariksha 2: సృష్టితో డీమాన్ పవన్ రొమాన్స్, డేంజర్ కార్డ్ బయటకు తీసిన అభిజిత్
Recommended image3
Express Hari Marriage: హీరోయిన్‌ను పెళ్లాడబోతున్న ఎక్స్‌ప్రెస్ హరి! వైరల్ అవుతున్న వీడియోలో నిజమెంత?
Related Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode:దీపను నిజం చెప్పమన్న మామ-దశరథలో పెరిగిన డౌట్-నిజాలు బయటపెట్టిన దాసు
Recommended image2
Karthika Deepam 2 Today Episode:దశరథ చేతికి రిపోర్ట్స్- కార్తీక్ ని నిలదీసిన దశరథ- నిజం చెప్పేశాడా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved