MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • TV
  • Karthika Deepam 2 Today Episode:దశరథ చేతికి రిపోర్ట్స్- కార్తీక్ ని నిలదీసిన దశరథ- నిజం చెప్పేశాడా?

Karthika Deepam 2 Today Episode:దశరథ చేతికి రిపోర్ట్స్- కార్తీక్ ని నిలదీసిన దశరథ- నిజం చెప్పేశాడా?

కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ (ఫిబ్రవరి 18వ తేదీ)లో దశరథకు జ్యో రిపోర్ట్స్ మెయిల్ చేసిన డాక్టర్. అన్ని నిజాలు రేపు గుడిలో చెప్తానన్న కార్తీక్. నా భార్యను చంపేయాలి అనుకుంటున్నారా అని కార్తీక్ ని నిలదీసిన దశరథ. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..  

4 Min read
Author : Kavitha G
Published : Feb 18 2026, 08:25 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
Image Credit : Jiohotstar

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్

కార్తీక దీపం 2 సీరియల్ బుధవారం ఎపిసోడ్ లో జ్యోత్స్న మంచిది కాదు అల్లుడు.. తన బ్లెడ్ శాంపిల్స్ వదినతో మ్యాచ్ అయ్యాయని నమ్మదు. అసలు ఈ నిజమే బయటపడకూడదు అని తను ఆలోచిస్తే వదినను ఏమైనా చేయచ్చు. కడుపుతో ఉన్న మనిషిని చంపాలనుకున్నవాళ్లకు పెంచిన తల్లి ఒక లెక్కా, సుమిత్ర వదినను జ్యోత్స్న చంపేస్తుందని కార్తీక్ తో చెప్తాడు దాసు. 

27
రిపోర్ట్స్ పంపివ్వండి
Image Credit : Jiohotstar

రిపోర్ట్స్ పంపివ్వండి

అప్పుడే కార్తీక్ కు డాక్టర్ ఫోన్ చేసి మీ మామయ్య హాస్పిటల్ కు వచ్చారు. రిపోర్ట్స్ అడుగుతున్నారు. మెయిల్ చేస్తానని చెప్పాను అని చెప్తుంది. నా వంతు సాయం చేయాలి అనుకున్నాను కానీ.. ఇంత ప్రెషర్ నేను తీసుకోలేను కార్తీక్ అంటుంది డాక్టర్. సరే రిపోర్ట్స్ పంపించేయండి అని చెప్తాడు కార్తీక్. నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నావు అల్లుడు. ఇక నేను హ్యాపీ అంటాడు దాసు. నీతో నాకు పనుంది మామయ్య. ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేయమని చెప్పి వెళ్లిపోతాడు కార్తీక్.

Related Articles

Related image1
Karthika Deepam 2 Today Episode:దీపను నిజం చెప్పమన్న మామ-దశరథలో పెరిగిన డౌట్-నిజాలు బయటపెట్టిన దాసు
Related image2
Karthika Deepam 2 Today Episode: దీప, కార్తీక్ ఏడుపు- డాక్టర్ ని కలిసిన జ్యో- చంపేయాలనుకున్న దాసు
37
గుడికి వెళ్తామన్న కార్తీక్
Image Credit : Jiohotstar

గుడికి వెళ్తామన్న కార్తీక్

మరోవైపు దీప, అనసూయ మాట్లాడుకుంటూ ఉంటారు. మీ అత్తగారు గుడిలో నీపేరుపై పూజ చేయించడానికి తెచ్చిన ప్రమిదలు, కొబ్బరికాయలు ఏం చేయమంటావు దీప? అని అడుగుతుంది అనసూయ. గుడిలో చాలా మంది ఉంటారు కదా వాళ్లకు ఇచ్చేయ్ అక్క అంటుంది కాంచన. అవసరం లేదులే అమ్మ, రేపు నేను, నా భార్య గుడికి వెళ్తాము. వాటిని అలాగే ఉండనివ్వు అంటాడు కార్తీక్. మేము కూడా వస్తాము అంటుంది కాంచన. నువ్వు మాకోసమే కదా మొక్కుకున్నావు. మేము వెళ్లొస్తాంలే అమ్మా అంటాడు కార్తీక్. ఏది అయితే ఏంటి మీరు బాగుండటమే నాకు కావాలి అంటుంది కాంచన.

47
దశరథ చేతికి రిపోర్ట్స్
Image Credit : Jiohotstar

దశరథ చేతికి రిపోర్ట్స్

దశరథ, శివన్నారాయణ ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో డాక్టర్ కాల్ చేసి రిపోర్ట్స్ మెయిల్ చేశానని చెప్తుంది. వాటిని చూసి దశరథ షాక్ అవుతాడు. ఏమైంది దశరథ అని అడుగుతాడు శివన్నారాయణ. ఏం లేదు నాన్న అంటాడు దశరథ. ఇంతలో కార్తీక్ ఫోన్ చేస్తాడు. ఇంపార్టెంట్ కాల్ నాన్న, మనం రేపు మాట్లాడుకుందాం అని చెప్పి పక్కకు వస్తాడు దశరథ. రిపోర్ట్స్ వచ్చాయా మామయ్య అని అడుగుతాడు కార్తీక్. నీకెలా తెలుసురా.. అయినా ఆ రిపోర్ట్స్ ఏంటి? డాక్టర్ ఎందుకు రిపోర్ట్స్ తప్పుగా చెప్పిందని అడుగుతాడు దశరథ. రేపు ఉదయం గుడికి రా మామయ్య అక్కడ అన్ని నిజాలు మాట్లాడుకుందాం అంటాడు కార్తీక్.

57
రేపు అన్ని తెలుస్తాయి..
Image Credit : Jiohotstar

రేపు అన్ని తెలుస్తాయి..

ఉదయం నీ ముఖంలో ఉన్న బాధ ఇప్పుడు లేదు బావ. రేపు ఏం చేయబోతున్నావు గుడికి ఎందుకు అని అడుగుతుంది దీప. రేపు అన్ని తెలుస్తాయిలే.. పడుకో ఉదయాన్నే లేవాలి అంటాడు కార్తీక్. అమ్మను నేను ఎలా కాపాడుతాను బావ. బ్లెడ్ శాంపిల్స్ మ్యాచ్ అయితే సమస్య తీరిపోయినట్లేనా? నేనే అసలైన కూతురు అని చెప్తే ఎవరైనా నమ్ముతారా? దాసు బాబాయి ఎక్కడున్నాడో తెలియదు. ఎప్పుడు వస్తాడో తెలియదు. ఈ సమస్యకు పరిష్కారం ఏంటి అని అడుగుతుంది దీప. దాసు మామయ్య ఎక్కడున్నాడో తెలిసింది. తను కూడా రేపు గుడికి వస్తాడు. ఉదయం అన్ని విషయాలు చెప్తాను పడుకో దీప అంటాడు కార్తీక్.

67
అప్పుడే పిల్లలను మార్చేసి ఉంటారు..
Image Credit : Jiohotstar

అప్పుడే పిల్లలను మార్చేసి ఉంటారు..

మరోవైపు సుమిత్ర, జ్యోత్స్న మాట్లాడుకుంటూ ఉంటారు. దశరథ అక్కడే కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఈ మధ్య నువ్వు సరిగ్గా తినడం లేదని అత్తయ్య చెప్పింది. నేను చాలా సంతోషంగా ఉన్నా. నీ పెళ్లి చూస్తానని, నీ పిల్లలతో ఆడుకుంటానని నాకు నమ్మకం ఉంది. నాకు ఇంత సంతోషాన్ని ఇచ్చిన నువ్వు సంతోషంగా లేకపోతే ఎలా అని జ్యోత్స్నతో అంటుంది సుమిత్ర. నువ్వు పుట్టినప్పుడు ఏం జరిగిందో తెలుసా అని చిన్ననాటి విషయాలను గుర్తుచేసుకుంటుంది. 

నువ్వు పుట్టిన తర్వాత నాలుగైదు గంటల వరకు నేను స్పృహ‌లో లేను అంటుంది సుమిత్ర. అప్పుడే పిల్లలను మార్చేసి ఉంటారు అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. కళ్లు తెరవగానే ఊయలలో ఉన్న నిన్ను చూపించారు. ఇది నా బిడ్డేనా అనిపించింది అంటుంది సుమిత్ర. మొదటి చూపులోనే నీ బిడ్డను కాదని గుర్తుపట్టావన్నమాట అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. అప్పుడు ప్రేమగా దగ్గరకు తీసుకున్నాను. నువ్వు ఏడుపు ఆపలేదు. మీ నాన్న ఎత్తుకున్న ఏడుపు ఆపలేదు. కానీ పారిజాతం అత్తయ్య చేతుల్లోకి వెళ్లగానే నువ్వు ఏడుపు ఆపేశావు అని జ్యోత్స్నతో చెప్తుంది సుమిత్ర. నేను ఆవిడ మనుమరాలిని కదా అందుకే ఆపి ఉంటాను అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న.

సుమిత్ర ఇక చాలు పడుకో అంటాడు దశరథ. మీరు పడుకోరా అంటుంది సుమిత్ర. నేను రేపు చేయాల్సిన ఒక ముఖ్యమైన పని ఉంది. అది చేస్తే నాకు కొంత రిలీఫ్ వస్తుంది. అందుకే ఎప్పుడు తెల్లారుతుందా అని వెయిట్ చూస్తున్నాను అంటాడు దశరథ. నేను హాస్పిటల్ కి వెళ్లి వచ్చిన దగ్గరి నుంచి డాడీ ప్రవర్తనలో ఏదో తేడా ఉందని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. రేపు ఏం జరగబోతుందని ఆలోచిస్తుంది.

77
నా భార్యను చంపేసేవాళ్లే కదా..
Image Credit : Jiohotstar

నా భార్యను చంపేసేవాళ్లే కదా..

గుడిలో కలుసుకుంటారు కార్తీక్, దశరథ. జ్యోత్స్నపై ఈ అనుమానం ఇప్పుడు మొదలైంది కాదురా.. దాసును జ్యోత్స్న చంపాలనుకుంది. కానీ ఎందుకు? శౌర్య, దీపల మీద అటాక్ జరిగినప్పుడు దీప వచ్చి జ్యోత్స్నను కొట్టింది. ఆ రోజు బయటపడలేదు కానీ.. నాకూ జ్యోత్స్నపై అనుమానం వచ్చింది. ఇలా ఎప్పటికప్పుడు తన ప్రవర్తన నేను గమనిస్తూనే ఉన్నాను. ఒక్కరోజు కూడా నేను అనవసరంగా నా కూతురిని అనుమానిస్తున్నానని నాకు అనిపించలేదు.

మొన్న శాంపిల్స్ మ్యాచ్ కానప్పుడు అందరు షాక్ అయితే తను మాత్రం ఇది నాకు ముందే తెలుసు అన్నట్లుగా ఉంది. శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయని చెప్పినప్పుడు మాత్రం షాక్ అయింది. అసలు రిపోర్ట్స్ విషయంలో ఏం జరుగుతోంది. డాక్టర్ ఎందుకు తప్పుడు రిపోర్ట్స్ ఇచ్చింది. ఈ రిపోర్ట్స్ చూస్తే జ్యోత్స్నకు మాకు ఎలాంటి సంబంధం లేదు అన్నట్లుగానే ఉంది. అసలు ఏం జరుగుతోంది? అని కార్తీక్ ను నిలదీస్తాడు దశరథ. నేను ఈ వివరాలు ఏవి తెలుసుకోకుండా నేరుగా సుమిత్రను ఆపరేషన్ కు తీసుకువెళ్లి ఉంటే మీరంతా కలిసి నా భార్యను చంపేసేవాళ్లు కదా అని అంటాడు దశరథ. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Gunde Ninda Gudi Gantalu: గుణతో చేతులు కలిపిన రోహిణీ, మీనాకి చిక్కులు, ప్రమాదంలో బాలు చెల్లెలు మౌనిక
Recommended image2
Karthika Deepam 2 Today Episode:దీపను నిజం చెప్పమన్న మామ-దశరథలో పెరిగిన డౌట్-నిజాలు బయటపెట్టిన దాసు
Recommended image3
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కోసం.. రెమ్యునరేషన్ పెంచిన నాగార్జున? ఎంత వసూలు చేస్తున్నాడంటే?
Related Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode:దీపను నిజం చెప్పమన్న మామ-దశరథలో పెరిగిన డౌట్-నిజాలు బయటపెట్టిన దాసు
Recommended image2
Karthika Deepam 2 Today Episode: దీప, కార్తీక్ ఏడుపు- డాక్టర్ ని కలిసిన జ్యో- చంపేయాలనుకున్న దాసు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved