MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • TV
  • Brahmamudi Serial Today Episode: సుభాష్ ఆపరేషన్ కోసం అవస్థలు, వంట మనిషిగా ఇందు

Brahmamudi Serial Today Episode: సుభాష్ ఆపరేషన్ కోసం అవస్థలు, వంట మనిషిగా ఇందు

Brahmamudi Serial Today Episode: బ్రహ్మముడి ఎపిసోడ్ రసవత్తరంగా సాగుతోంది. సుభాష్‍కు ఆపరేషన్ చేయించడానికి డబ్బుల కోసం ఇందు, అపర్ణ బాధపడతారు. వంట మనిషిగా వెళ్లేందుకు రెడీ అయిన ఇందు. మరి ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉందో చూసేద్దాం.  

2 Min read
Author : Nandini Arava
Published : Mar 11 2026, 11:33 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
మన డబ్బును రాబందుల్లా పీక్కు తింటున్నారు
Image Credit : jio hotstar

మన డబ్బును రాబందుల్లా పీక్కు తింటున్నారు

ఎంత త్వరగా ఆపరేషన్ చేస్తే అంత మంచిదని, లేకపోతే ఫ్యూచర్లో నడవడం కష్టమని డాక్టర్ చెబుతారు. కోట్ల రూపాయల ఆస్తి ఉన్నా మీకు ఆపరేషన్ చేయించడానికి చేతిలో ఒక్క రూపాయి కూడా లేదని అపర్ణ బాధ పడుతుంది. ఇప్పుడు అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురావాలని ఏడుస్తుంది.వచ్చిన డబ్బును వాళ్లంతా రాబందుల్లా పీక్కు తింటున్నారని అంటుంది. మనకెవరు సహాయం చేస్తారు అని అపర్ణ మదనపడుతుంది.

27
తాత ఆపరేషన్‍కు డబ్బుల కోసం రేఖ దగ్గరకు ఇందు
Image Credit : jio hotstar

తాత ఆపరేషన్‍కు డబ్బుల కోసం రేఖ దగ్గరకు ఇందు

రేఖ ఆంటీనే డబ్బులు అడుగుతానని ఇందు అంటుంది. తాతయ్య కోసం అడుగుతానని అంటుంది. ఒకప్పుడు రాజులా బతికిన తాతలో మళ్లీ పూర్వవైభవం తీసుకొస్తాను అని ఇందు అంటుంది. అప్పుడు సుభాష్‍..నా కోసం వాళ్ల దగ్గర చేయి చాచి దేహీ అని అడగొద్దు అంటారు. ఇప్పటివరకూ నీకోసం చేయలేకపోయా, భవిష్యత్‍లో చేస్తానన్న ఆశ కూడా లేదంటారు. చచ్చే వరకూ జీవచ్ఛ వంలా పడి ఉంటా అంటారు. తాతయ్య అలా మాట్లాడొద్దు..మీకోసం నేను ఏం చేయలేకపోతే బతికుండి వృథా అని ఇందు బాధపడుతుంది. సుభాష్ వద్దన్నా కూడా ఇందు...రేఖ దగ్గరకు వెళ్తుంది. మన బాధ్యతను భుజాన వేసుకుని ఇందు కష్టపడుతోందని అపర్ణ అంటుంది.

Related Articles

Related image1
Brahmamudi Serial Today Episode: ఆస్తి మొత్తం కొట్టేసేందుకు రేఖ మాస్టర్ ప్లాన్... డబ్బు కోసం రాజ్ స్కామ్
Related image2
Brahmamudi Today Episode: ఇరుక్కున్న స్వాతి, ఇందు.. రేఖపై పగతో రగిలిపోతున్న నందు
37
దొంగను పోలీసులకు అప్పగించిన నందు
Image Credit : jio hotstar

దొంగను పోలీసులకు అప్పగించిన నందు

దగ్గరలో ఓ షాపు ముందు నిలబడి ఫోన్‍లో దొంగను చూసి...స్టేషన్‍లో ఇతని ఫొటో ఉంది కదా, నగలు కొట్టేసింది వీడే కదా అని నందు అనుకుంటుంది. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి పిలిపించి దొంగను పట్టిస్తుంది. ముందు నువ్వు డిగ్రీ కంప్లీట్ చేయ్ అని ఎస్సై అంటారు. నీ అంతు చూస్తా అని దొంగ బెదిరిస్తాడు.

47
ఐశ్వర్యకు నెక్లెస్ డిజైన్ చేయించిన ఐశ్వర్య
Image Credit : jio hotstar

ఐశ్వర్యకు నెక్లెస్ డిజైన్ చేయించిన ఐశ్వర్య

అప్పటికీ రేఖ, భ్రమరాంబ..ల్యాప్‍టాప్‍లో నగలు చూస్తుంటారు. ఐశ్వర్య పుట్టినరోజు కోసం నెక్లెస్ చేయించా అంటుంది రేఖ. నా కూతురు కోసం కూడా ఇలాంటి నెక్లెస్ చేయించు అని భ్రమరాంబ అంటుంది. ఇంతలో ఇందు వస్తుంది. మీతో అర్జెంటుగా మాట్లాడాలి అని రేఖతో ఇందు అంటుంది. తర్వాత రా ,ఇప్పుడు కాదు అంటుంది. తాతయ్య ఆపరేషన్ కోసం రూ.15 లక్షలు కావాలని ఇందు అంటుంది. నెక్లెస్ చూసి కళ్లు చెదిరిపోయేలా ఉందని భ్రమరాంబ అంటుంది.

57
నీ ఏడుపుతో నాకు ఇరిటేటింగ్‍గా ఉంది: ఐశ్వర్య
Image Credit : jio hotstar

నీ ఏడుపుతో నాకు ఇరిటేటింగ్‍గా ఉంది: ఐశ్వర్య

ఇంతలో హాయ్ అనుకుని ఐశ్వర్య వస్తుంది. ఇందును చూసి చిరాకుగా అరుస్తుంది. నీ ఏడుపు చూసి నాకు ఇరిటేటింగ్‍గా ఉంది అని ఐశ్వర్య అంటుంది. పబ్‍కు వెళ్లాలని డబ్బులు అడుగుతుంది ఐశ్వర్య. ఎంతకావాలి అని అడిగితే రూ.లక్ష కావాలంటుంది. వెంటనే ఫోన్ పే చేస్తుంది.

67
డబ్బుల కోసం రేఖను బతిమాలిన ఇందు
Image Credit : jio hotstar

డబ్బుల కోసం రేఖను బతిమాలిన ఇందు

డబ్బులు ఇవ్వాలని బతిమాలుతుంది ఇందు. ఈరోజురాత్రికి బిజినెస్ మ్యాన్ శివరాం వస్తున్నారని, అందుకే అన్ని రకాల నాన్ వెబ్ వంటలు చేయు అని రేఖ...ఇందును ఆర్డర్ వేస్తుంది. ఇక్కడి నుంచి వెళ్లు అని ఇందుపై చిరాకు పడుతుంది.

77
వంట మనిషిగా ఇందు
Image Credit : jio hotstar

వంట మనిషిగా ఇందు

శివరామ్ కోసం ఇంట్లో అటుఇటూ తిరుగుతూ ఉంటుంది రేఖ. ఎందుకంత టెన్షన్ పడతావ్ అని భ్రమరాంబ అంటుంది. ఆయన్ని మెప్పిస్తే ఫ్యూచర్‍లో ఆస్తి కాపాడుకోవచ్చని రేఖ అంటుంది. ఇంతలో శివరాం వచ్చేస్తారు. డిన్నర్ రెడీగా ఉంది, తింటూ మాట్లాడుకుందాం అంటుంది.

పక్కనుంచి చూస్తున్న స్వాతి, అపర్ణ మాట్లాడుకుంటుంటారు. గొప్పలు చెప్పుకుంటున్నారు చూడు, ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడి అని స్వాతి అంటుంది. ఇంతలో ఇందు వడ్డించడానికి వస్తుంది. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరూ అని శివరాం అంటారు. పనిమనిషి అని భ్రమరాంబ అంటుంది. ఫుడ్ తింటూ చాలా బాగుందని శివరాం అంటాడు. మా అమ్మ చేతి వంటలా వందని మెచ్చుకుంటాడు. ఇందును మా ఇంటికి వంట చేయడానికి పంపించాలని అడుగుతాడు. తప్పకుండా పంపిస్తామని రేఖ అంటుంది. ఇందు కూడా వంట చేయడానికి ఓకే అంటుంది. ఇంతలో ఎపిసోడ్ ముగుస్తుంది. 

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో ఛానెల్లో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
వినోదం
Latest Videos
Recommended Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode: జ్యో మాస్టర్ ప్లాన్- ఇరుక్కున్న దీప, కార్తీక్- నిజం బయటపడుతుందా?
Recommended image2
Divi Vadthya: అలాంటి వాడు దొరకడం లేదట.. దివి ఆవేదన
Recommended image3
Brahmamudi Today Episode: ఇరుక్కున్న స్వాతి, ఇందు.. రేఖపై పగతో రగిలిపోతున్న నందు
Related Stories
Recommended image1
Brahmamudi Serial Today Episode: ఆస్తి మొత్తం కొట్టేసేందుకు రేఖ మాస్టర్ ప్లాన్... డబ్బు కోసం రాజ్ స్కామ్
Recommended image2
Brahmamudi Today Episode: ఇరుక్కున్న స్వాతి, ఇందు.. రేఖపై పగతో రగిలిపోతున్న నందు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved