- Home
- Entertainment
- TV
- Karthika Deepam 2 Today Episode:దీపను నిజం చెప్పమన్న మామ-దశరథలో పెరిగిన డౌట్-నిజాలు బయటపెట్టిన దాసు
Karthika Deepam 2 Today Episode:దీపను నిజం చెప్పమన్న మామ-దశరథలో పెరిగిన డౌట్-నిజాలు బయటపెట్టిన దాసు
కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ (ఫిబ్రవరి 17వ తేదీ)లో దీపే సుమిత్ర కూతురని చెప్పడం మంచిదన్న డాక్టర్. బిడ్డకు ఏదైనా అయితే మీ అత్తను చంపినట్లేనన్న శ్రీధర్. దీపను చంపాలనుకుంది జ్యోనే అని కార్తీక్ తో చెప్పిన దాసు. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరియల్ మంగళవారం ఎపిసోడ్ లో జ్యోత్స్న మీ దగ్గరకు ఎందుకు వచ్చిందనే విషయాన్ని మా మామయ్యతో కూడా చెప్పండి అని అడుగుతాడు కార్తీక్. జ్యోత్స్న తనతో మాట్లాడిన విషయాలను దాసు, కార్తీక్ లతో చెప్తుంది డాక్టర్. నేను సీరియస్ గా మాట్లాడేసరికి జ్యోత్స్న వెళ్లిపోయింది కానీ.. మీరు చాలా అలెర్ట్ గా ఉండాలి కార్తీక్ అని చెప్తుంది డాక్టర్. నేను మీకు చాలా ప్రెషర్ ఇస్తున్నట్లు ఉన్నాను సారీ డాక్టర్ అంటాడు కార్తీక్. ఎప్పుడైనా సరే నిజం చెప్పాల్సిందే. దీన్ని ఎక్కువరోజులు దాచలేరు. కనీసం దశరథ గారికైనా నిజం చెప్పాల్సింది అంటుంది డాక్టర్. నేను చూసుకుంటాను డాక్టర్ అంటాడు కార్తీక్. పదా అల్లుడు నిజం చెప్పెద్దామని ఆవేశంగా బయటకు వెళ్తాడు దాసు.
దశరథలో పెరిగిన అనుమానం
జ్యోత్స్న ఇంటికి రాగానే ఇప్పటివరకు ఎక్కడికి వెళ్లావే అని అడుగుతుంది పారు. ఎక్కడికో వెళ్లాను లే అంటుంది జ్యోత్స్న. నాతో చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నావు కదా అని పారు అనగానే చిరాకు పడ్డ జ్యోత్స్న డాక్టర్ హారికను కలవడానికి వెళ్లాను. కానీ ఈ విషయం ఇంట్లో చెప్పకు అంటుంది. ఎందుకు చెప్పొద్దు అనుకుంటూ వాళ్ల దగ్గరకు వస్తాడు దశరథ. షాక్ అవుతుంది జ్యోత్స్న. ఎవరు వినకూడదో వాళ్లే విన్నారు. అయినా నాకేంటి.. అదే సమాధానం చెప్పుకుంటుంది అని మనసులో అనుకుంటుంది పారు. హాస్పిటల్ కి వెళ్లావని ఎందుకు చెప్పకూడదు జ్యోత్స్న అని అనుమానంగా అడుగుతాడు దశరథ.
ఏమైంది దశరథ అనుకుంటూ వస్తాడు శివన్నారాయణ . ఇప్పుడు మనతో చెప్పకుండా జ్యోత్స్న హాస్పిటల్ కు వెళ్లాల్సిన అవసరం ఏముంది? నాన్న అని అడుగుతాడు దశరథ. మమ్మీ పరిస్థితి బాలేదు కదా.. ఇచ్చిన టైమ్ కంటే ముందే ఆపరేషన్ చేయమని డాక్టర్ ని అడగానికి వెళ్లాను అని కవర్ చేస్తుంది జ్యోత్స్న.
డాక్టర్ కి ఫోన్ చేస్తే.. నువ్వు ఏం అడిగావో ఆవిడ ఏం చెప్పారో అన్ని తెలుస్తాయి అంటాడు దశరథ. నా మీద నమ్మకం లేకుంటే చేయండి డాడీ అంటుంది జ్యోత్స్న. శివన్నారాయణ కలగజేసుకొని.. తను తల్లికోసం ఆలోచిస్తోంది. అందులో తప్పేముంది. వదిలేయ్ దశరథ అంటూ జ్యోత్స్నకు సపోర్ట్ చేస్తాడు శివన్నారాయణ. నాలో మాత్రం చాలా అనుమానాలు ఉన్నాయి నాన్న అని మనసులో అనుకుంటాడు దశరథ.
మీ అత్తను చంపినట్లే..
మరోవైపు దీప, శ్రీధర్ మాట్లాడుకుంటూ ఉంటారు. కార్తీక్ కి వాళ్ల అమ్మ అంటే చాలా ఇష్టం. వాడు కాంచనను బాధపెట్టే ఏ పని చేయడు. అలాంటిది నాకోసం వాళ్ల అమ్మను అలా అడిగాడంటే నేను నమ్మలేకపోతున్నాను. మామాలుగా అయితే కాంచన అడిగిన మాట మీరు ఇవ్వాల్సిందే. కానీ ఆలోచించారు అంటే మీరు ఏదో పెద్ద సమస్యలోనే ఉన్నారు. అదేంటో నిజం చెప్పమ్మా అంటాడు శ్రీధర్.
ఏం లేదు మామయ్య అంటుంది దీప. కాంచన, కార్తీక్ పిల్లలను ఎత్తుకొని ఆడుకోవాలని ఎప్పటినుంచో కలలు కంటోంది. పొరపాటున బిడ్డకు ఏమైనా అయితే నువ్వు మీ అత్తను చంపినట్లే.. తను భరించలేదు. బిడ్డ జాగ్రత్త దీప అంటాడు శ్రీధర్. తల్లి కోసం బిడ్డను చంపుకోబోతున్నాను అని లోలోపలే ఏడుస్తుంది దీప. నీకు కార్తీక్ లాంటి భర్తనిచ్చిన మీ అత్తకు నీ బిడ్డను ఇచ్చావంటే తన రుణం తీర్చుకున్నట్లే అని చెప్పి వెళ్లిపోతాడు శ్రీధర్.
కార్తీక్ తో నిజాలు చెప్పిన దాసు
మరోవైపు ఆవేశంగా ఉన్న దాసును కూల్ చేసే ప్రయత్నం చేస్తుంటాడు కార్తీక్. అసలు నీకు ఏమైంది మామయ్య. ఇన్ని రోజులు ఎక్కడికి వెళిపోయావ్ ? అని దాసును అడుగుతాడు కార్తీక్. నా కూతురే నన్ను కిడ్నాప్ చేయించింది అల్లుడు చెప్తాడు దాసు. షాక్ అవుతాడు కార్తీక్. నాకు కాపలాగా ఇద్దరు రౌడీలను కూడా పెట్టింది. వాళ్లను బురిడి కొట్టించి తప్పించుకొని వచ్చాను అని చెప్తాడు దాసు. అయితే ఈపాటికే జ్యోత్స్నకు ఈ విషయం తెలిసి ఉంటుంది అంటాడు కార్తీక్.
ఎప్పుడో తెలిసి ఉంటుంది. ఇంటి ముందు నిలబడి నాకోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అంటాడు దాసు. ఇంకా ఏం ఆలోచిస్తున్నావు అల్లుడు. జ్యోత్స్న మంచిది కాదు. మనం ఎంత త్వరగా నిజం చెప్తే అంత మంచిది అంటాడు దాసు. ఇప్పుడు నువ్వు చెప్పొద్దు. టైం చూసుకొని నేను చెప్తాను మామయ్య అని దాసును ఆపుతాడు కార్తీక్. రౌడీలను పంపించి దీపను చంపాలనుకుంది కూడా జ్యోత్స్ననే అల్లుడు. అదృష్టం బాగుండి దీప బ్రతికిపోయింది కానీ.. ఏదైనా అయితే ఎలా? తన గురించి తెలిసి కూడా వదిలేద్దామంటావా? అని కార్తీక్ ని గట్టిగా అడుగుతాడు దాసు.
రిపోర్ట్స్ గురించి దశరథ ఆరా..
మరోవైపు డాక్టర్ హారికను కలిసి జ్యోత్స్న రిపోర్ట్స్ గురించి ఆరా తీస్తాడు దశరథ. నా ట్రీట్ మెంట్ మీద నమ్మకం లేదా అని అడుగుతుంది డాక్టర్. అలా అని కాదు. నాలోపల కొన్ని అనుమానాలు ఉన్నాయి. అవి తీరాలంటే నాకు జ్యోత్స్న రిపోర్ట్స్ కావాలి. వేరే డాక్టర్ దగ్గర సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలి అనుకుంటున్నాను అని చెప్తాడు దశరథ. రిపోర్ట్స్ చూస్తే జ్యోత్స్న మీ కూతురు కాదని తెలిసిపోతుంది అని మనసులో అనుకుంటుంది డాక్టర్. నాకు ఇప్పుడు ఒక ఆపరేషన్ ఉంది. రిపోర్ట్స్ మీకు మెయిల్ చేస్తాను అని దశరథను పంపిస్తుంది డాక్టర్.
వదిలేద్దాం అంటావా?
నిజం తెలిశాక కూడా జ్యోత్స్నను వదిలేద్దాం అంటావా అల్లుడు.. చెప్పు అని ఆవేశంగా అడుగుతాడు దాసు. నీకంటే పదిరెట్ల ఆవేశం, కోపం నాకు ఉన్నాయి. కానీ.. అక్కడ అత్త ఆరోగ్య పరిస్థితి అస్సలు బాలేదు. మనషులను గుర్తుపట్టని స్థితిలో ఉంది అంటాడు కార్తీక్. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

