MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • TV
  • Karthika Deepam 2 Today Episode: దీప, కార్తీక్ ఏడుపు- డాక్టర్ ని కలిసిన జ్యో- చంపేయాలనుకున్న దాసు

Karthika Deepam 2 Today Episode: దీప, కార్తీక్ ఏడుపు- డాక్టర్ ని కలిసిన జ్యో- చంపేయాలనుకున్న దాసు

కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ (ఫిబ్రవరి 16వ తేదీ)లో కన్నీళ్లు పెట్టుకున్న కార్తీక్, దీప. డాక్టర్ ని కలిసిన జ్యో. కార్తీక్ కి ఫోన్ చేసిన డాక్టర్. ఆవేశంతో డాక్టర్ ని చంపాలి అనుకున్న దాసు. ఆపిన కార్తీక్. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...  

4 Min read
Author : Kavitha G
Published : Feb 16 2026, 08:22 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
Image Credit : Jiohotstar

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్

కార్తీక దీపం 2 సీరియల్ సోమవారం ఎపిసోడ్ లో నా తరపున అత్తయ్యతో నువ్వే మాట్లాడాలి బావ అంటుంది దీప. ఏం మాట్లాడాలి అంటాడు కార్తీక్. పుట్టబోయే బిడ్డ మీద ఆశలు పెంచుకోవద్దని చెప్పాలి అంటుంది దీప. ఏం మాట్లాడుతున్నావు దీప. ఎవరితో ఏం చెప్పమంటున్నావో అర్థమవుతోందా? నేను చెప్పలేను. నా వల్ల కాదు. అని బోరున ఏడుస్తాడు కార్తీక్. చెప్పకపోతే బిడ్డను చంపిన హంతకులుగా మనం మిగిలిపోతాం అని ఏడుస్తుంది దీప. 

ఈ రోజు మామయ్య జ్యోత్స్న మీద అనుమానంతో నన్ను హాస్పిటల్ కి తీసుకెళ్లాడు. కానీ డాక్టర్ నిజం చెప్పలేదు. మామయ్య వెళ్లిపోయాక నేను డాక్టర్ ని ఓ ప్రశ్న అడిగాను అంటాడు కార్తీక్. ఏంటి అంటుంది దీప. ఆపరేషన్ తర్వాత బిడ్డ బ్రతకడానికి ఏమైనా ఛాన్స్ ఉంటుందా అని అడిగాను. డాక్టర్ ఆశలు వదిలేసుకోవాలని చెప్పింది. ఆ మాట విన్న తర్వాత నా పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించు అని దీప ఒడిలో పడుకొని ఏడుస్తాడు కార్తీక్.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
షాక్ అయిన దాసు
Image Credit : Jiohotstar

షాక్ అయిన దాసు

మరొవైపు దాసు శ్రీధర్ ఇంటికి వచ్చి కాశీని కలుస్తాడు. నాన్న అని కాశీ పిలవగానే, మర్చిపోయావేమో అనుకున్నాను రా.. గుర్తుపట్టావే అంటాడు. అప్పుడు నా బుద్ధి సరిగ్గా పనిచేయక అలా మాట్లాడాను నాన్న. నన్ను క్షమించు అంటాడు కాశీ. ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు దాసు. మామయ్యకు డ్రైవర్ గా చేరాను. స్వప్న విడాకులు కావాలంటోంది. నేను నా భార్యను వదులుకోలేను నాన్న. అందుకే మామయ్య చెప్పినట్లు వింటున్నాను అంటాడు కాశీ. మా అమ్మ చేసిన పాపాలే నా పిల్లల జీవితాలకు శాపాలు అయ్యాయని నోరు జారుతాడు దాసు.

పిల్లలు ఏంటి నాన్న నీకుంది నేను ఒక్కడినే కదా అంటాడు కాశీ. మాట వరుసకు అన్నాను లేరా అంటాడు దాసు. మరి నానమ్మ చేసిన పాపం ఏంటి అని అడుగుతుడు కాశీ. మా అమ్మ మీ అమ్మ బాగోగులు సరిగ్గా చూసుకోలేదురా అని కవర్ చేస్తాడు కాశీ. నా జీవితాన్ని ఇలా చేసినందుకు జ్యోత్స్న అక్కను నిలదీయాలి అనుకున్నాను. కానీ తను సుమిత్ర పెద్దమ్మను కాపాడబోతుందని వదిలేశాను అంటాడు కాశీ. అదేంటి శాంపిల్స్ మ్యాచ్ కాలేదు కదరా అంటాడు దాసు. లేదు నాన్న రెండో సారి మ్యాచ్ అయ్యాయి అనగానే దాసు షాక్ అవుతాడు. జ్యోత్స్న నా కూతురు కదా.. శాంపిల్స్ ఎలా మ్యాచ్ అయ్యాయని డాక్టర్ దగ్గరకు బయల్దేరుతాడు దాసు.

Related Articles

Related image1
Karthika Deepam 2 Today Episode: జ్యోను ఎడాపెడా వాయించిన పారు- ఇంట్లో నుంచి వెళ్లిపోతానన్న కాంచన
Related image2
Karthika Deepam 2 Today Episode: డాక్టర్ ని కలిసిన దశరథ- తప్పించుకున్న దాసు- జ్యోను ఫాలో అయిన పారు
37
నువ్వు సుమిత్ర కూతురివేనా?
Image Credit : Jiohotstar

నువ్వు సుమిత్ర కూతురివేనా?

డాక్టర్ ని కలవడానికి వెళ్తుంది జ్యోత్స్న. నేను మీతో కొంచెం మాట్లాడాలి అంటుంది. ఇక్కడ ఏం జరుగుతుందో కార్తీక్ కు తెలియడం మంచిది అని కార్తీక్ కు సైలెంట్ గా ఫోన్ చేస్తుంది డాక్టర్. కాల్ లో ఉన్న కార్తీక్ కి అర్థమయ్యేలా… చెప్పు జ్యోత్స్న. నాతో ఏదో మాట్లాడాలి అన్నారు కదా ఏంటి అని అడుగుతుంది డాక్టర్. 

నా బ్లెడ్ శాంపిల్స్ మొదటి సారి మ్యాచ్ కాలేదు. రెండోసారి అయ్యాయి. వాటిలో ఏది నిజం అని అడుగుతుంది జ్యోత్స్న. అది విని హాస్పిటల్ కి బయల్దేరుతాడు కార్తీక్. శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయని అబద్దం చెప్పారా? లేదా ఎవరైనా చెప్పించారా? అని డాక్టర్ ను అడుగుతుంది జ్యోత్స్న. గట్టిగా జ్యోత్స్న అని అంటుంది డాక్టర్. నువ్వు సుమిత్ర కూతురివే కదా అని ప్రశ్నిస్తుంది.

47
డాక్టర్ ని చంపాలి అనుకున్న దాసు
Image Credit : Jiohotstar

డాక్టర్ ని చంపాలి అనుకున్న దాసు

అంతలో దాసు హాస్పిటల్ కి వస్తాడు. జ్యోత్స్న, డాక్టర్ మాట్లాడుకునేది దూరం నుంచి చూస్తాడు. నువ్వే సుమిత్ర కూతురివి అయినప్పుడు ఏ రిపోర్ట్ అబద్దమో, ఏది నిజమో నీకు తెలియదా? అంటుంది డాక్టర్. మిమ్మల్ని చూస్తుంటే మీ అమ్మ ప్రాణాలు కాపాడటం మీకు ఇష్టం లేదని అనిపిస్తోంది. ఏదైనా ఉంటే మీరు మీ నాన్నతో మాట్లాడండి కాల్ చేస్తాను అని ఫోన్ తీస్తుంది డాక్టర్. వద్దు డాక్టర్ నేను ఇక్కడికి వచ్చిన విషయం ఎవరితో చెప్పకండి. మా అమ్మను నేను కాపాడుతాను అని వెళ్లిపోతుంది జ్యోత్స్న. డాక్టర్, జ్యోత్స్నతో కలిసిపోయిందని అపార్థం చేసుకుంటాడు దాసు. ఆవేశంతో కత్తెర తీసుకొని డాక్టర్ ని చంపాలి అనుకుంటాడు. కార్తీక్ వచ్చి ఆపుతాడు.

57
కాంచన కోపం
Image Credit : Jiohotstar

కాంచన కోపం

మరోవైపు పెంచిన తల్లిదండ్రుల ఫోటో దగ్గర దీపం పెడుతుంది దీప. అనసూయను పిలుస్తుంది కాంచన. ఏంటి అత్తయ్య నాతో చెప్పండి చేస్తాను అంటుంది దీప. కాస్త కోపంగా నా పనులు నేను చేసుకోగలను అంటుంది కాంచన. ఈ రోజు గుడికి వెళ్లాలి అనుకున్నాను. నేను ఆశపడ్డది జరగకుండా చేశారు. ఎవరి పనులు వాళ్లు చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది అంటుంది కాంచన. మా అమ్మను ఎందుకు తిడుతున్నావు అని అడుగుతుంది శౌర్య. నీ పని నువ్వు చూసుకోవే అంటుంది కాంచన. ఏంటి ఇంత పొద్దున్నే ఇంత కోపం అనుకుంటూ ఎంట్రీ ఇస్తాడు శ్రీధర్.

67
శ్రీధర్ డౌట్
Image Credit : Jiohotstar

శ్రీధర్ డౌట్

స్వీట్స్ తెచ్చి అందరికి ఇస్తాడు శ్రీధర్. ఏమైంది దీప ఎందుకు అందరు అలా ఉన్నారు అని అడుగుతాడు శ్రీధర్. మీ గురించే మామయ్య అంటుంది దీప. ఏమైందని అడిగితే కార్తీక్ తల్లితో మాట్లాడిన మాటలను శ్రీధర్ తో చెప్తుంది దీప. కార్తీక్ ఎందుకు అలా అడిగాడు అని డౌట్ పడతాడు శ్రీధర్.

77
మా మధ్య దాపరికాలు లేవు
Image Credit : Jiohotstar

మా మధ్య దాపరికాలు లేవు

మరోవైపు దాసుకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తాడు కార్తీక్. ఇంతలో డాక్టర్ వాళ్ల దగ్గరకు వస్తుంది. ఈయన ఎవరు? ఎందుకు ఇంత ఆవేశంగా ఉన్నారు అని అడుగుతుంది డాక్టర్. ఈయన మామయ్య అని చెప్తాడు కార్తీక్. డాక్టర్ హారికకు అన్ని తెలుసు. నీకే కొన్ని విషయాలు తెలియాలి మామయ్య అని దాసుకు చెప్తాడు కార్తీక్. నా భార్యే మా అత్త కూతురని మా మామయ్యకు కూడా తెలుసు.

ఆయన దగ్గర నాకు దాపరికాలు లేవు. జ్యోత్స్న ఎందుకు వచ్చిందో నాకు తెలుసు. మా మామయ్యకు కూడా చెప్పండి డాక్టర్ అని అడుగుతాడు కార్తీక్. జ్యోత్స్నకు, తనకు మధ్య జరిగిన సంభాషణ గురించి చెప్తుంది డాక్టర్. మీ మామయ్య వచ్చి ఎలాగైతే అడిగాడో అలాగే జ్యోత్స్న కూడా అడిగింది అంటుంది డాక్టర్. అంతటితో నేటి కార్తీక్ దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu: నవదీప్‌కు కౌశల్ మందా కౌంటర్.. 'సభ్య సమాజానికి ఏమివ్వాలో చెప్పు' అంటూ షాకింగ్ కామెంట్స్
Recommended image2
Bigg Boss Agnipariksha 2: సృష్టితో డీమాన్ పవన్ రొమాన్స్, డేంజర్ కార్డ్ బయటకు తీసిన అభిజిత్
Recommended image3
Express Hari Marriage: హీరోయిన్‌ను పెళ్లాడబోతున్న ఎక్స్‌ప్రెస్ హరి! వైరల్ అవుతున్న వీడియోలో నిజమెంత?
Related Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode: జ్యోను ఎడాపెడా వాయించిన పారు- ఇంట్లో నుంచి వెళ్లిపోతానన్న కాంచన
Recommended image2
Karthika Deepam 2 Today Episode: డాక్టర్ ని కలిసిన దశరథ- తప్పించుకున్న దాసు- జ్యోను ఫాలో అయిన పారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved