- Home
- Entertainment
- TV
- Karthika Deepam 2 Today Episode: దాసును ఆపిన కార్తీక్- తప్పించుకున్న జ్యో- విడాకులకు సిద్ధమైన స్వప్న
Karthika Deepam 2 Today Episode: దాసును ఆపిన కార్తీక్- తప్పించుకున్న జ్యో- విడాకులకు సిద్ధమైన స్వప్న
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (జనవరి 13వ తేదీ)లో జ్యో గురించి నిజం చెప్పాలి అనుకుంటాడు దాసు. అడ్డుపడతాడు కార్తీక్. ఊపిరి పీల్చుకుంటుంది జ్యో. కాశీకి బెయిల్ ఇప్పిస్తాడు శ్రీధర్. విడాకులు కావాలని అడుగుతుంది స్వప్న. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరియల్ మంగళవారం ఎపిసోడ్ లో నేను నీకు ఒక ద్రోహం చేశాను అన్నయ్య అంటాడు దాసు. ఇప్పుడు చెప్పిన మీరు నన్ను క్షమించరు అంటాడు. నువ్వు ఎవరి గురించి చెప్పాలి అనుకుంటున్నావు అని అడుగుతాడు శివన్నారాయణ. జ్యోత్స్న గురించి అంటాడు దాసు. తనని చంపబోయింది జ్యోత్స్ననే అని దాసు చెప్పాలి అనుకుంటున్నాడా? అలా చెప్తే నాన్న జ్యోత్స్నను ఇంట్లో ఉండనివ్వడు అని మనసులో అనుకుంటాడు దశరథ. జ్యోత్స్న గురించి నిజం చెప్పే టైం ఇది కాదు అని దాసును ఆపాలి అనుకుంటాడు కార్తీక్.
కాశీ, జ్యోత్స్న అని దాసు మొదలుపెట్టగానే.. కార్తీక్, దశరథ అడ్డుకుంటారు. దాసు తను అనుకున్నది చెప్పడానికి ఇబ్బంది పడుతున్నాడు పక్కకు తీసుకెళ్లి మాట్లాడతానని అంటాడు దశరథ. కాశీని విడిపించడానికి జ్యోత్స్న సాయం అడిగానని అంటావ్ అంతేనా అని మాట మారుస్తాడు కార్తీక్. ఈ మాత్రం దానికే ఎందుకు మామయ్య ఇబ్బంది పడటం? కాశీకి బెయిల్ ఇప్పించమని తాతను డైరెక్ట్ గా అడగొచ్చు కదా అని మ్యాటర్ డైవర్ట్ చేస్తాడు కార్తీక్. నిజం చెప్పొద్దు అని దాసుకు సైగ చేస్తాడు. దాసు కూడా అదే అడగాలని అనుకున్నానని శివన్నారాయణతో చెప్తాడు.
క్షమించరాని తప్పు చేశాడు
కాశీ గురించి శ్రీధర్ కూడా అడిగాడు. కానీ నీ కొడుకు క్షమించరాని తప్పు చేశాడు. నీ ముఖం చూస్తుంటే వాడ్ని క్షమించాలి అనిపిస్తోంది.. సరే కాశీ బెయిల్ సంగతి నేను చూసుకుంటానులే అని చెప్తాడు శివన్నారాయణ. దాసును తీసుకొని బయటకు వస్తాడు కార్తీక్. ఏంటి మామయ్య ఇది. ఇన్ని రోజులు ఎక్కడికో వెళ్లిపోయావు. సడెన్ గా వచ్చావు. ఏ నిజమైతే ఎవరికి చెప్పొద్దు అన్నానో అదే నేరుగా పెద్దాయనకే చెప్తున్నావు అంటాడు కార్తీక్.
చాటుగా గమనించిన జ్యోత్స్న
దీప ఎవరో తెలియాలని కోరుకుంది నేను కాదు అల్లుడు, మా అమ్మ అంటాడు దాసు. సుమిత్ర వదినను బతికించాలంటే అసలైన వారసురాలు ఉండాలి కదా. అసలైన కూతురిని వెతికి తీసుకురమ్మని మా అమ్మ అడిగింది అని చెప్తాడు దాసు. సుమిత్ర వదిన కూతురు దీప అని నీకు తెలుసు, నాకు తెలుసు, జ్యోత్స్నకు తెలుసు, దీపకు తెలుసు. కానీ మా అమ్మకు తెలియదు కదా. జ్యోత్స్న మా అమ్మకు చెప్పదు. చెప్పొద్దని నా దగ్గర కూడా మాట తీసుకుంది అంటాడు దాసు.
మరోవైపు వీరి ఇద్దరిని చాటుగా గమనిస్తూ ఉంటుంది జ్యోత్స్న. సుమిత్ర వదిన బతకాలంటే నిజం చెప్పక తప్పదు కదా అంటాడు దాసు. నిజం చెప్పాలి కానీ ఇది కరెక్ట్ టైం కాదు అంటాడు కార్తీక్. ఎప్పుడు ఏం చేయాలో నీకన్నా నీకే బాగా తెలుసు. నువ్వే జాగ్రత్తగా చూస్కో అని చెప్పి వెళ్లిపోతాడు దాసు. వీరిద్దరూ ఇంతసేపు ఏం మాట్లాడుకొని ఉంటారు. ఏదేమైనా నేను జాగ్రత్తగా ఉండాలి అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న.
నీకు మాట్లాడే రైట్స్ లేవు
మరోవైపు శ్రీధర్ కోసం వెయిట్ చేస్తుంటారు కావేరి, స్వప్న. ఇంతసేపు ఎక్కడికి వెళ్లావు నాన్న అంటుంది స్వప్న. ఓ గెస్ట్ ని తీసుకొచ్చాను. అక్కడే ఆగిపోయావే.. లోపలికి రా అని పిలుస్తాడు శ్రీధర్. కాశీని లోపలికి రాబోతుండగా.. అక్కడే ఆగు అని స్వప్న కోపంతో అరుస్తుంది. అసలు ఈ మనిషిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? అసలు బయటకు ఎందుకు తీసుకువచ్చావ్ నాన్న? అని శ్రీధర్ పై ఫైర్ అవుతుంది.
కాశీ ఏదో మాట్లాడబోతే.. నీకు మాట్లాడే రైట్స్ లేవు. ఇక్కడి నుంచి వెళ్లిపో అంటుంది. స్వప్న మనం కూర్చొని మాట్లాడుకుందాం అంటాడు శ్రీధర్. నువ్వు మంచోడివి కాబట్టే నిన్ను పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టాడు. నువ్వు తప్పు చేశావని సాక్ష్యం చెప్పాడు. కాశీని ఇంట్లో పెట్టుకోవడమే నువ్వు చేసిన తప్పు నాన్న అంటుంది స్వప్న.
విడాకులు కోరిన స్వప్న
నీ బాధలో అర్థం ఉంది. కాశీ చేసింది తప్పే. తనకు నువ్వు ఏ శిక్ష వేస్తావో వేయ్ అంటాడు దాసు. కాశీ చేసింది తప్పు కాదు మామయ్య మోసం, ద్రోహం. ఇలాంటి వాళ్లకు శిక్ష ఒకటే. విడాకులు తీసుకోవడం.. అంటుంది స్వప్న. ఈ మోసగాడితో నేను కలిసి బతకలేను అంటుంది. స్వప్న అలా మాట్లాడకు. నేను కాశీకి కోర్టు బెయిల్ ఇచ్చి తీసుకొచ్చా. అతను నిర్దోషిగా నిరూపించుకుంటాడా? లేదా మళ్లీ జైలుకు పోతాడా? అన్నది తన ఇష్టం అంటాడు శ్రీధర్.
కాశీ ఈ ఇంట్లో ఉంటే నేను మా అన్నయ్య ఇంటికి వెళ్లిపోతా అంటుంది స్వప్న. తనని బయటకు పొమ్మనండి అంటుంది. పోతాను, నేను దూరమయ్యాకే నా విలువేంటో నీకు అర్థమవుతుందని కోపంగా వెళ్లిపోతాడు కాశీ. నేను ఒక ఆడదాన్ని మోసం చేశాను. నా కూతురిని ఇంకొకడు మోసం చేశాడు అని బాధపడుతాడు శ్రీధర్.
సుమిత్రమ్మ నా కన్నతల్లే
మరోవైపు దీపతో మాట్లాడుతూ ఉంటుంది కాంచన. నేను మళ్లీ చెప్పేంతవరకు నువ్వు మా పుట్టింటికి వెళ్లకు దీప అంటుంది కాంచన. ఆ ఇంటి పరిస్థితి ఏం బాలేదు. ఈ రోజు జ్యోత్స్న ఏం చేసిందో చూశావు కదా. వాళ్లు నీకు ఏదైనా హాని చేయొచ్చు అంటుంది కాంచన. కడుపులో బిడ్డ నా బాధ్యత. నన్ను నేను చూసుకుంటాను. కానీ ఆ ఇంటికి వెళ్లకుండా ఉండలేను అంటుంది దీప.
ఇప్పుడు ఆ ఇంటికి నా అవసరం ఉంది అంటుంది దీప. నువ్వేమైనా సుమిత్ర వదిన కన్న కూతురివి అనుకుంటున్నావా అని అడుగుతుంది కాంచన. అవును అత్తయ్య సుమిత్రమ్మ నా కన్నతల్లే అంటుంది దీప. షాక్ అవుతాడు కార్తీక్. వాళ్లు నన్ను బిడ్డలా చూసుకుంటున్నారు. వాళ్ల రుణం తీర్చుకునే టైం ఇది. వెళ్లకుండా ఉండలేను అంటుంది దీప.
దీప సుమిత్ర కూతురు కాదు కదా..
రుణం తీర్చుకోవడం అంటే ఏంటి అమ్మ? అయినా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది శౌర్య. అమ్మ ఉల్లిపాయలు కట్ చేసింది అంటాడు కార్తీక్. రుణం తీర్చుకోవడం అంటే ఏంటి నాన్న అని మళ్లీ అడుగుతుంది శౌర్య. నేను మా అమ్మ కొడుకును కదా అంటాడు కార్తీక్. అవును నేను మా అమ్మ కూతురిని అంటుంది శౌర్య.
కన్నతల్లి కష్ట కాలంలో ఉన్నప్పుడు బిడ్డలు అండగా ఉండాలి అదే రుణం తీర్చుకోవడం అని శౌర్యకు అర్థమయ్యేలా చెప్తాడు కార్తీక్. దీప సుమిత్ర వదిన కూతురు అయి ఉంటే నువ్వు చెప్పింది కరెక్ట్ గా సరిపోయేది కానీ.. కాదు కదా అంటుంది కాంచన. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

