- Home
- Entertainment
- TV
- Karthika Deepam 2 Today Episode: దశరథ మాటలకు వణికిపోయిన జ్యో, పారు- దీపకు ఘన స్వాగతం- దశరథ సంతోషం
Karthika Deepam 2 Today Episode: దశరథ మాటలకు వణికిపోయిన జ్యో, పారు- దీపకు ఘన స్వాగతం- దశరథ సంతోషం
కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ (ఫిబ్రవరి 23వ తేదీ)లో దీపకు దిష్టి తీయించి ఇంట్లోకి స్వాగతం పలికిన దశరథ. జ్యో తన కూతురు కాదని ఇన్ డైరెక్ట్ గా మాట్లాడిన దశరథ. వణికిపోయిన పారు, జ్యో. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరియల్ సోమవారం ఎపిసోడ్‌లో జ్యో, పారు బయటకు వెళ్లాలి అనుకుంటారు. గుమ్మం దగ్గర శివన్నారాయణ ఉండటంతో ఆగిపోతారు. తాత అక్కడ ఉండగా బయటకు వెళ్లలేము అంటుంది జ్యోత్స్న. అవును సుమిత్ర కూతురా అంటుంది పారు. నువ్వు పదే పదే అలా పిలవకు అంటుంది జ్యోత్స్న. అసలు నిజం తెలిశాక నువ్వు బాధపడతావు అంటుంది జ్యోత్స్న.
నువ్వు నా మనుమరాలివి కాదు అనే ట్విస్ట్ కన్నా.. పెద్ద ట్విస్ట్ ఏం ఉండదు అంటుంది పారు. ఉంది గ్రానీ.. ఈ గేమ్ ఫినిషింగ్‌లో నీకు అదిరిపోయే ట్విస్ట్ ఉంటుంది చూడు అంటుంది జ్యోత్స్న. అంతలో శివన్నారాయణ పక్కకు వెళ్తాడు. జ్యోత్స్న, పారు బయటకు వెళ్లాలి అనుకుంటారు. ఇంతలో దశరథ, దీప, కార్తీక్ వస్తారు. నాకు నిజం తెలిశాక నా బిడ్డ మొదటిసారి నా ఇంట్లో అడుగు పెట్టబోతుంది అని సంతోషపడతాడు దశరథ.
వణికిపోయిన పారు, జ్యో
కార్తీక్, దీప, దశరథ గుమ్మం దగ్గరకు రాగానే జ్యో, పారు ఎదురవుతారు. వాళ్లను ఒక చూపు చూస్తాడు దశరథ. లోలోపల వణికిపోతారు పారు, జ్యో. డాడీ ఏంటి నిజం తెలిసిన మనిషిలా చూస్తున్నాడు. దాసు నిజం చెప్పేశాడా అని మనసులో అనుకుంటుంది జ్యో. పిన్ని ఎర్రనీళ్లు తీసుకురా, నా కూతురుకి దిష్టి తీయాలి అంటాడు దశరథ. షాక్ అవుతారు పారు, జ్యో. తర్వాత ఇంట్లో అందరిని పిలుస్తాడు దశరథ.
దీపకు స్వాగతం
సుమిత్రతో దీపకు దిష్టి తీయించి, ఘనంగా స్వాగతం పలుకుతాడు. దశరథ చేసే పనులు చూసి షాక్ అవుతారు పారు, జ్యోత్స్న. డౌటే లేదు దాసు డాడీకి నిజం చెప్పేసి ఉంటాడు. అందుకే ఇలా ప్రవర్తిస్తున్నాడు అనుకుంటుంది జ్యోత్స్న. సుమిత్ర పేరుమీద అర్చన చేయించడానికి గుడికి వెళ్లాను. దేవుడు ఈ రోజు నాకు చాలా విషయాలు తెలిసేలా చేశాడు. చెప్పడం మర్చిపోయాను అక్కడ దాసు కూడా కనిపించాడు అంటాడు దశరథ. ఆ మాట వినగానే కంగారు పడతారు పారు, జ్యోత్స్న. నేను ఇక్కడినుంచి వెళ్లిపోవాలి అని బయటకు వెళ్లడానికి ట్రై చేస్తుంది జ్యోత్స్న. ఆగు జ్యోత్స్న. ఎక్కడికి వెళ్తున్నావు. నువ్వు ఎక్కడికి వెళ్లకూడదు. ఇంట్లోనే ఉండాలి అంటాడు దశరథ. కంగారు పడుతుంది జ్యోత్స్న.
పారు కన్ఫ్యూజన్
పిన్ని లోపలికి వెళ్లి స్వీట్స్ తీసుకురా. నా కూతురికి తినిపించాలి అంటాడు దశరథ. పారు స్వీట్స్ తీసుకొచ్చి ఎవరికి పెట్టాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతుంది. కన్ఫ్యూజన్ ఎందుకు పిన్ని నా కన్నకూతురికే పెట్టు అని దీప దగ్గరి దాక తీసుకెళ్లి జ్యోత్స్నకు తినిపిస్తాడు దశరథ. డాడీకి నిజం తెలిసిందా లేదా నాకు అలా అనిపిస్తోందా అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. నా కూతురు ఎప్పుడు సంతోషంగా ఉండాలి. నువ్వు కలకాలం సుఖంగా ఉండాలి జ్యోత్స్న అంటాడు దశరథ.
సంతోషంలో దశరథ
దీపకు ఎందుకు దిష్టి తీయించావు అని అడుగుతాడు శివన్నారాయణ. ఇందాక గుడిలో పంతులు గారు చెప్పారు. అమ్మాయికి నరదిష్టి ఎక్కువగా ఉందని, దీపకు నేనే కాళ్లు కడిగి కన్యదానం చేశాను కదా.. అప్పుడు తన బాధ్యత కూడా నాదే కదా నాన్న. అందుకే దిష్టి తీయించాను అని చెప్తాడు దశరథ. మంచి పని చేశావు అంటాడు శివన్నారాయణ. దాసు గురించి అడుగుతుంది పారు.
మరో 10 నిమిషాల్లో ఇక్కడికే వస్తాడు పిన్ని అని చెప్తాడు దశరథ. ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా భార్యను కాపాడటానికి నా కూతురు ఉంది అని చెప్తాడు దశరథ. జ్యోత్స్న వైపు చూసి మీ అమ్మను కాపాడుకుంటాను అని చెప్పమ్మా.. నాకు ధైర్యంగా ఉంటుంది అంటాడు దశరథ. మీరు భయపడకండి డాడీ. నేను మమ్మీని ఎలాగైనా కాపాడుతాను అంటుంది జ్యోత్స్న. ఇదిగో ఈ మాటలే నా ధైర్యం సుమిత్ర అంటాడు దశరథ.
కార్తీక్ ని హగ్ చేసుకున్న దీప
మరోవైపు కార్తీక్ ని హగ్ చేసుకొని థాంక్యూ చెప్తుంది దీప. ఈ నిజం ఇలాగే ఉండిపోతుంది అనుకున్నాను. నా తండ్రికి తెలిసేలా చేసి నాకు పెద్ద గిఫ్ట్ ఇచ్చావు అంటుంది దీప. నాన్న ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నాడు. కానీ, నేను అమ్మ కోసం నా బిడ్డను వదులుకుంటున్నాని తెలిస్తే ఒప్పుకుంటాడా అని అడుగుతుంది దీప. తల్లిదండ్రులం మనమే ఒప్పుకున్నాక మామయ్య ఏం చేస్తాడు. అత్తను కాపాడానికి ఇంకో దారిలేదు కదా అంటాడు కార్తీక్. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

