- Home
- Entertainment
- TV
- Karthika Deepam 2 Today Episode: సూపర్ ట్విస్ట్- బయడపడనున్న జ్యో జాతకం- రంగం సిద్ధం చేసిన దాసు
Karthika Deepam 2 Today Episode: సూపర్ ట్విస్ట్- బయడపడనున్న జ్యో జాతకం- రంగం సిద్ధం చేసిన దాసు
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (జనవరి 12వ తేదీ)లో నిజాలు మోసి ఈ గుండెె రాటు తేలిపోయింది అన్న కార్తీక్. అసలైన వారసురాలి గురించి తెలుసుకునే ప్రయత్నం చేసిన పారు. జ్యో గురించి నిజం చెప్పడం మంచిదన్న దాసు. వణికిపోయిన జ్యోత్స్న. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరియల్ సోమవారం ఎపిసోడ్ లో నిజాలు చెప్పడం చాలా ఈజీ కానీ.. వాటిని దాయడమే కష్టం మామయ్య అంటాడు కార్తీక్. నిజాలు దాయడమే కష్టం అయితే వాటిని మోయడం ఇంకెంత కష్టమో.. అలాంటి నిజాలను మోసి మోసి ఈ గుండె రాటు దేలిపోయింది అని ఎమోషనల్ అవుతాడు కార్తీక్. సుమిత్ర అత్త నాకు కన్నతల్లి లాంటిది. అత్తకు కొడుకు లేడనే లోటు నాతో తీర్చుకుంది. అలాంటి అత్తను ఈ పరిస్థితుల్లో చూస్తుంటే లోపల నాకు ఎంత బాధగా ఉంటుందో ఆలోచించు అంటాడు కార్తీక్.
అత్తకు ఏం కాదని ముందు మనం నమ్మాలి. అప్పుడే మనం అత్తకు ధైర్యం చెప్పగలం అంటాడు కార్తీక్. అవును అన్నయ్య, కార్తీక్ చెప్పింది నిజమే. వదినకు ఏం కాదు నువ్వు వదినా కలిసి నిండు నూరేళ్లు సంతోషంగా ఉంటారు. నీ కూతురి పెళ్లి చేస్తారు. వదినకు ఏం కాదు నువ్వు ధైర్యంగా ఉండమంటుంది కాంచన.
నీలాంటి తండ్రిని నేను ఎక్కడా చూడలేదు
మరోవైపు దాసు, పారిజాతం జ్యోత్స్న మాట్లాడుకుంటూ ఉంటారు. సుమిత్ర గురించి నీకు తెలిసే ఉంటుంది కదా అని దాసును అడుగుతుంది పారు. తెలుసు అమ్మ అంటాడు దాసు. తెలిసి కూడా నువ్వు ఇంత ప్రశాంతంగా ఎలా ఉన్నావురా? అంటుంది పారు. మనం చెప్పాలి అనుకున్న నిజాన్ని దేవుడే చెప్తేంటే ఎవరు ఏం చేస్తారమ్మా అంటాడు దాసు. అలా మాట్లాడకురా.. మెడికల్ టెస్టులు చేస్తే జ్యోత్స్న దొరికిపోతుంది. నీ కూతురిని ఇప్పుడు నువ్వే కాపాడాలి అని అడుగుతుంది పారిజాతం.
నేను ఆ పని చేయలేను అంటాడు దాసు. నీలాంటి తండ్రిని నేను ఎక్కడా చూడలేదు. ఏ తండ్రి అయినా సమస్య కూతురు వరకూ రాకుండా కాపాడుతాడు. కానీ నువ్వు అంటూ రెచ్చిపోతుంది జ్యోత్స్న. కూతురు రోడ్డు మీద పడితే తండ్రిగా ఆదుకుంటాను. ఇంట్లో చోటు ఇస్తాను అంటాడు దాసు. అలాంటి బ్రతుకు బ్రతకడం కంటే చావడం మేలు అంటుంది జ్యోత్స్న. దాని మాటలు వదిలెయ్ నువ్వు ఈ ఒక్క సాయం చేయ్ రా మనమంతా ఒక కుటుంబం అంటుంది పారు.
మరి కాశీ ఎవరు అని అడుగుతాడు దాసు. వాడు మన కుటుంబమే అంటుంది పారు. మరి కాశీని ఎందుకు వదిలేశారని అడుగుతాడు దాసు. నువ్వు నీ కూతురిని కాపాడు, అది కాశీని కాపాడుతుంది అంటుంది పారు. ఇప్పుడు నీకు ఏం కావాలి అమ్మా అని అడుగుతాడు దాసు. అసలైన వారసురాలు బతికే ఉందన్నావు కదా... ఎక్కడుంది అని అడుగుతుంది పారు.
నువ్వు భయపడకు
ఇక్కడే ఉంది అంటాడు దాసు. అప్పుడే కాఫీ కప్ తో ఎంట్రీ ఇస్తుంది దీప. ఎలా ఉన్నావ్ బాబాయ్ అని అడుగుతుంది దీప. నేను బాగున్నాను. సుమిత్ర వదినకు కూడా ఏం కాదు.. నువ్వు భయపడకు అమ్మా.. కన్నకూతురు ఉంది కదా కాపాడుకుంటుందని అంటాడు దాసు. నాన్నను పిలిపించిన పని ఏంటో చెప్పు గ్రానీ అంటుంది జ్యోత్స్న. నువ్వు అసలు వారసురాలిని తీసుకురావాలి అంటుంది పారు. ఏం జ్యోత్స్న తీసుకురమ్మంటావా? అని అడుగుతాడు దాసు.
నిజం బయటపడక తప్పదు
మరోవైపు దీప, కార్తీక్ దగ్గరికి వెళ్లి దాసు బాబాయి వచ్చి బయట జ్యోత్స్న, పారిజాతం గారితో మాట్లాడుతున్నాడు. ఏదో ప్లాన్ వేస్తున్నారని కార్తీక్ తో అంటుంది దీప. జ్యోత్స్న దాసు మామయ్య కూతురు. ఆ నిజం బయటపడొద్దంటే అసలైన కూతురు రావాలి. జ్యోత్స్నకు నిజం తెలుసు కానీ పారుకు చెప్పదు. దాసు మామయ్య మాటిచ్చాడు కాబట్టి పారుకు నిజం చెప్పడు. ఇంక వాళ్లు ప్లాన్ చేయడానికి ఏం ఉంటుంది అంటాడు కార్తీక్. ఇంకా ఏదైనా అవకాశం ఉందో ఆలోచించు అంటుంది దీప.
మనం దీన్ని ఆపాలంటే నువ్వు వెళ్లి మా అమ్మకు నిజం చెప్పి.. హాస్పిటల్లో జాయిన్ చేయాలి అంటుంది దీప. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా నువ్వే ఈ ఇంటి వారసురాలివని బయటపడక తప్పదు అంటాడు కార్తీక్. కానీ జ్యోత్స్ననే నిజం ఒప్పుకునేలా చేయాలి అంటాడు. తను ఒప్పుకోదు బావ అంటుంది దీప.
నేను సాయం చేయలేను
మరోవైపు సుమిత్ర అసలైన కూతురు రాకపోతే నీ కూతురు అన్యాయం అవుతుందిరా అంటుంది పారు. ఎప్పటికైనా నిజం బయటపడాల్సిందే అంటాడు దాసు. నేను మీకు సాయం చేయలేనమ్మా అంటాడు. నువ్వు సాయం చేయకపోతే పైనున్న కళ్యాణి నిన్ను క్షమించదు రా అంటుంది పారిజాతం. జ్యోత్స్న ఎవరో నిజం చెప్పడమే అసలైన పరిష్కారం అంటాడు దాసు. ఈ నిజం ఈ రోజు చెప్పేయడే మంచిది అంటాడు దాసు. అంతలో శివన్నారాయణ వచ్చి.. నాతో ఏం చెప్పాలి దాసు అని అడుగుతాడు.
నిజం చెప్పాలి అనుకున్న దాసు
నా కొడుకు తప్పు చేశాడు. అందుకు మీరు నన్ను క్షమించాలి అని అడుగుతాడు దాసు. ఎవరు తప్పు చేస్తే వాళ్లే క్షమాపణకు అర్హులు. నువ్వు ఏ తప్పు చేయలేదు అంటాడు శివన్నారాయణ. ఇంతకీ నువ్వు నాతో ఏం చెప్పాలి దాసు అని అడుగుతాడు శివన్నారాయణ. చెప్పొద్దని సైగ చేస్తుంది జ్యోత్స్న. నాన్నతో చెప్పడానికి ఇబ్బంది అయితే నాతో చెప్పు అంటాడు దశరథ. ఈ విషయం అందరూ వినాల్సిందే. వీలైతే వదినను, దీపను కూడా రమ్మనండి అంటాడు దాసు.
వెళ్లిపో దాసు
వదినను చూడ్డానికి వచ్చినవాడివి పలకరించి వెళ్లిపోకుండా ఇదంతా అవసరమా? నువ్వు వెళ్లిపో దాసు అంటుంది పారిజాతం.
నువ్వు ఎప్పుడూ నన్ను సొంత తమ్ముడిలాగే చూశావు. కానీ నేను నీకు ఒక ద్రోహం చేశాను అన్నయ్య అంటాడు దాసు. ఇప్పుడు నేను చెప్పినా మీరు నన్ను క్షమించరు అంటాడు. ఏం చెప్పాలి అనుకుంటున్నావు అంటాడు దశరథ. జ్యోత్స్న గురించి అని దాసు చెప్పడంతో.. వణికిపోతుంది జ్యోత్స్న. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

