MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • TV
  • Gunde Ninda Gudi Gantalu: దినేష్ వేసిన వలలో చిక్కుకున్న మనోజ్.. బాలు,మీనాలను ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మన్న ప్రభావతి

Gunde Ninda Gudi Gantalu: దినేష్ వేసిన వలలో చిక్కుకున్న మనోజ్.. బాలు,మీనాలను ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మన్న ప్రభావతి

Gunde Ninda Gudi Gantalu: ఇంట్లో బొమ్మల కొలువు పెట్టాలని మీనా అనుకుంటుంది. ఇష్టం లేకపోయినా సత్యం మాట కాదనలేక ప్రభావతి ఒప్పుకుంటుంది.మరి, నేటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో టీవీ కంటే ముందుగా మీకోసం... 

4 Min read
Author : ramya Sridhar
Published : Feb 23 2026, 09:37 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Gunde Ninda Gudi Gantalu
Image Credit : Jio Hotstar

Gunde Ninda Gudi Gantalu

ఇంట్లో అందరూ బొమ్మల కొలువు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ఒక బొమ్మ చూపించి.. మీ స్కూల్ లో డ్యాన్స్ నేర్చుకునే రాధిక, ప్రేమ్ కుమార్ లు ఇలానే కనిపించారు అని మీనా చెబుతుంది. అది విని ఇంట్లో అందరూ షాక్ అవుతారు. అప్పుడు.. రాధిక ఏడ్చి అత్తయ్యకు ఫిర్యాదు చేసిందని మీనా చెబుతుంది. ఇక.. ప్రభావతి తిట్టి ఉంటుందని బాలు ఊహిస్తాడు. సత్యం కూడా ప్రభావతిని తిడతాడు. అయితే.. ఇంట్లో అందరూ మీనాకి డ్యాన్స్ గురించి ఏమీ తెలీదని వెటకారం చేస్తారు. కానీ, బాలు, మీనా ఊరుకోరు. ‘మీరందరూ ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు చూశారా? అత్తయ్య చూశారా? నేను చూశాను. డ్యాన్స్ పేరుతో వాళ్లు తప్పు చేస్తున్నారు. అత్తయ్య నేర్పించే డ్యాన్స్ క్లాసులో వాళ్లు అలా చేయడం కరెక్టేనా? రేపు వాళ్ల పెద్దవాళ్లు వచ్చి అడిగితే ఏం సమాధానం చెబుతారు?’ అని మీనా అడుగుతుంది. తాను పిల్లలకు ఎలా డ్యాన్స్ నేర్పించానో.. నా కొడుకు, కోడలు చూపిస్తారు. అని.. రోహిణీ, మనోజ్ తో ప్రభావతి స్టెప్స్ వేయిస్తుంది. వాళ్లకు సరిగా రావడం లేదని.. సత్యంతో ట్రై చేయిస్తుంది. అతను కూడా నాకు రావడం లేదు అంటే... శ్రుతి, రవి కూడా ప్రయత్నిస్తారు.

అయితే, బాలు, మీనా కరెక్ట్ గా వేసి చూపిస్తారు. అంతేకాదు.. రాధిక, ప్రేమ్ కుమార్ ఏ పొజిషన్ లో కనిపించారో కూడా మీనా చూపిస్తుంది. ఇది కాదు నేను నేర్పించిందని..మీనా తన డ్యాన్స్ క్లాస్ క్లోజ్ చేయించాలని చూస్తుందని ప్రభావతి నిందలు వేస్తుంది.కానీ, సత్యం ప్రభావతి మాటలు పట్టించుకోడు. అక్కడ ఏదైనా తప్పు జరిగితే..నీకే తగులుతుందని సత్యం వార్నింగ్ ఇస్తాడు. అయినా.. ప్రభావతి పట్టించుకోదు. నా డ్యాన్స్ క్లాస్ కి మీనా రావడానికి వీళ్లేదు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
మనోజ్ కి మరో ఉత్తరం..
Image Credit : Jio Hotstar

మనోజ్ కి మరో ఉత్తరం..

సీన్ కట్ చేస్తే.. షాప్ లో మనోజ్ డల్ గా కూర్చొంటాడు. బిజినెస్ చాలా డల్ గా ఉందని ఫీలౌతూ ఉంటాడు. రోహిణీ మనోజ్ ని మోటివేట్ చేస్తుంది. అప్పుడే ఒక కస్టమర్ వస్తాడు. అతనికి మనోజ్ షాప్ మొత్తం చూపిస్తాడు. అతను అన్నీ కొంటే లాభాలు వచ్చేస్తాయమని మనోజ్ సంబరపడుతూ ఉంటాడు. తీరా మనోజ్ కొటేషన్ రాసిన తర్వాత... వారం రోజుల తర్వాత ఫర్నీచర్ కొంటాను అని చెబుతాడు. వారం తర్వాత ఎందుకు సార్ అని అడిగితే.. తాను లాటరీ గెలువబోతున్నానని చెబుతాడు. అది విని మనోజ్, రోహిణీ అతని మీద విసుక్కుంటారు. బాడీ గార్డుతో అతన్ని బయటకు గెంటేస్తారు. తర్వాత ఓ వ్యక్తి వచ్చి.. మనోజ్ కి ఒక లెటర్ వస్తుంది. ఆ లెటర్ దినేష్ పంపి ఉంటాడు అని రోహిణీ భయపడుతుంది.

బాలు, మీనా బయటకు వెళ్తూ ఉంటారు. ఇద్దరూ కలిసి ఇటీవల పరిచయం అయిన ముసలి వాళ్ల దగ్గరకు వెళతారు. వెళ్లి.. వాళ్ల యోగ క్షేమాలు అడిగి తెలుసుకుంటారు. వాళ్లు కూడా చాలా ప్రేమగా మాట్లాడతారు. వాళ్ల కోసం మీనా భోజనం తెస్తుంది. తర్వాత బొమ్మల కొలువు కోసం బొమ్మలు పెడుతున్నామని చెబుతారు. దీంతో.. ఆ ముసలావిడ తన దగ్గర ఉన్న గుర్రం బొమ్మ ఇస్తుంది. మీనా చాలా సంతోషంగా తీసుకుంటుంది.

Related Articles

Related image1
Gunde Ninda Gudi Gantalu: మౌనిక మీద సంజూ కుట్ర, బాలు ఫోన్ కొట్టేసిన రోహిణీ, వీడియో దొరికిందా?
Related image2
Gunde Ninda Gudi Gantalu: ప్రభావతికి శాపం పెట్టిన మీనా, భార్య అంటే శ్రుతిలా ఉండాలి, పుట్టింటికి మౌనిక
34
బాలుని మనోజ్ దగ్గర ఇరికించిన దినేష్..
Image Credit : Jio Hotstar

బాలుని మనోజ్ దగ్గర ఇరికించిన దినేష్..

సీన్ కట్ చేస్తే.. డ్యాన్స్ క్లాసులో పిల్లలకు ప్రభావతి డ్యాన్స్ నేర్పుతుంది. తర్వాత.. ఆ బొమ్మల కొలువుకు రమ్మని తన డ్యాన్స్ క్లాసు పిల్లలకు ప్రభావతి చెబుతుంది. డ్యాన్స్ నేర్పిస్తున్నప్పుడు కూడా రాధిక, ప్రేమ్ కుమార్ ఒకరినొకరు చూసుకుంటూ డ్యాన్స్ లు వేస్తారు. అది గమనించిన ప్రభావతి.. వాళ్ళిద్దరినీ దూరంగా పెట్టి డ్యాన్స్ చేపిస్తుంది. కామాక్షి కూడా.. రాధికపై సెటైర్లు వేస్తుంది. ప్రభావతి వాళ్లకు వార్నింగ్ ఇచ్చి తాను చెప్పిన క్లాస్ ప్రాక్టీస్ చేయమని చెబుతుంది. తర్వాత కామాక్షి కూడా.. ప్రేమ్ కుమార్ పై తనకు ఉన్న అనుమానాలన్నీ.. ప్రభావతితో చెప్పి భయపెడుతుంది.

ఇక.. మనోజ్, రోహిణీ, బాడీ గార్డ్ తో కలిసి లెటర్ లో ఉన్న ప్లేస్ కి వస్తాడు. అక్కడికి వెళ్లిన తర్వాత.. దినేష్ స్వామీజీ గెటప్ లో ఉంటాడు. అది రోహిణీ గుర్తుపట్టేస్తుంది. ఆ దొంగ స్వామిజీ దగ్గరకు మనోజ్ పరుగులు తీస్తాడు. తనకు ఒక సమస్య వచ్చిందని.. సమాధానం కోసం వచ్చాను అని మనోజ్ చెబుతాడు. ‘ నువ్వు వెతికేది నీ కళ్ల ఎదురుగా ఉన్నా కూడా నువ్వు తెలుసుకోలేవు. కానీ నీ భార్యకు బాగా తెలుసు. ఏది మంచో, ఏది చెడో బాగా తెలుసు’ అని అంటాడు. తర్వాత రోహిణీ గురించి క్లూస్ ఇవ్వడం మొదలుపెడతాడు. దీంతో.. రోహిణీ భయపడి.. అక్కడి నుంచి వెళ్లిపోదాం అని అంటుంది. కానీ మనోజ్ ఆపుతాడు. ఈ లోగా.. స్వామిజీ గెటప్ లో ఉన్న దినేష్.. మనోజ్ కి మరో లెటర్ ఇస్తాడు. అందులో ‘ నేను పంపిన లెటర్ చూసి నువ్వు ఎంత భయపడ్డావో నాకు తెలుసు. నా గురించి తెలుసుకోవడానికి నీకు ఒక క్లూ ఇస్తున్నాను. దాని ప్రకారం నువ్వు నా గురించి తెలుసుకోవచ్చు. అది నీ తెలివి తేటలకు పరీక్ష. పవన్ కళ్యాణ్ సినిమాల్లోని ఒక పేరే.. నా పేరు’ అని లెటర్ లో రాసి ఉంటుంది. పొరపాటు పడిన మనోజ్.. బాలు మీద డౌట్ పడతాడు. రోహిణీ కాదు అని చెప్పినా మనోజ్ వినడు. ఆవేశంగా అక్కడి నుంచి వెళతాడు. అయితే.. తనకు డబ్బులు ఇచ్చే వరకు ఇలానే చేస్తాను అని దినేష్ వార్నింగ్ ఇస్తాడు.

44
బాలు, మీనాలను ఇంట్లో నుంచి వెళ్లిపోమ్మన్న ప్రభావతి..
Image Credit : Jio Hotstar

బాలు, మీనాలను ఇంట్లో నుంచి వెళ్లిపోమ్మన్న ప్రభావతి..

ఇక.. మనోజ్ ఇంటికి వెళ్లి.. ఇంట్లో అందరినీ పిలుస్తాడు. తనకు లెటర్లు పంపుతున్నది బాలు నే అని ఇంట్లో అందరికీ చెబుతాడు. అయితే.. బాలు అలా చేయలేదు అని మీనా అంటుంది. కానీ.. ప్రభావతి మాత్రం.. ఇదంతా చేసింది బాలు నే అని.. గట్టిగా చెబుతుంది. మనోజ్ మీద అసూయతోనే ఇలా చేశాడు అంటుంది. అక్కడితో ఆగదు.. మనోజ్, రోహిణీని చూసి వీళ్లు ఓర్వలేకపోతున్నారని.. బాలు, మీనాలను ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మని చెబుతుంది. అందుకు మీనా ఒప్పుకోదు. ఈ ఇంట్లో ఉండే హక్కు నాకు కూడా ఉంది అని గట్టిగా చెబుతుంది. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu: నవదీప్‌కు కౌశల్ మందా కౌంటర్.. 'సభ్య సమాజానికి ఏమివ్వాలో చెప్పు' అంటూ షాకింగ్ కామెంట్స్
Recommended image2
Bigg Boss Agnipariksha 2: సృష్టితో డీమాన్ పవన్ రొమాన్స్, డేంజర్ కార్డ్ బయటకు తీసిన అభిజిత్
Recommended image3
Express Hari Marriage: హీరోయిన్‌ను పెళ్లాడబోతున్న ఎక్స్‌ప్రెస్ హరి! వైరల్ అవుతున్న వీడియోలో నిజమెంత?
Related Stories
Recommended image1
Gunde Ninda Gudi Gantalu: మౌనిక మీద సంజూ కుట్ర, బాలు ఫోన్ కొట్టేసిన రోహిణీ, వీడియో దొరికిందా?
Recommended image2
Gunde Ninda Gudi Gantalu: ప్రభావతికి శాపం పెట్టిన మీనా, భార్య అంటే శ్రుతిలా ఉండాలి, పుట్టింటికి మౌనిక
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved