- Home
- Entertainment
- TV
- Karthika Deepam 2 Today Episode: అందరిముందు దోషిలా జ్యో- నిజం చెప్పేద్దామన్న కార్తీక్- దాసు క్షమాపణ
Karthika Deepam 2 Today Episode: అందరిముందు దోషిలా జ్యో- నిజం చెప్పేద్దామన్న కార్తీక్- దాసు క్షమాపణ
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (జనవరి 10వ తేదీ)లో అందరిముందు దోషిలా నిలబడిన జ్యోత్స్న. నువ్వు మా వదిన కూతురివేనా అని అడిగిన కాంచన. ఇంట్లో నుంచి వెళ్లిపోతాను అన్న దశరథ. నిజం చెప్పెద్దామన్న కార్తీక్. క్షమాపణ కోరిన దాసు. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరియల్ శనివారం ఎపిసోడ్ లో అందరిముందు దోషిలా నిలబడుతుంది జ్యోత్స్న. మా వదినతో నిజం మేము చెప్పలేకనా.. చెప్పకుండా ఉంది. లేక నీతో ఎవరైనా నిజం చెప్పమని చెప్పారా? అని జ్యోత్స్నను నిలదీస్తుంది కాంచన. అసలు తల్లి అంటే కాస్త కూడా ప్రేమ లేదేంటే నీకు. ఇంత కఠినంగా ఉన్నావు. పెంచుకున్న పిల్లలు కూడా ప్రేమ, అభిమానం చూపిస్తారు. అంతకంటే అధ్వాన్నంగా ఉన్నావు అంటుంది కాంచన.
సమాధానం చెప్పు. అసలు నువ్వు ఏం చేయాలి అనుకుంటున్నావు. ఈ ఐడియా ఇచ్చింది పారిజాతమేనా అని అడుగుతాడు శివన్నారాయణ. నాకు ఏ పాపం తెలియదండి అంటుంది పారు. నీ మనుమరాలు చేసింది పాపమని నీకు అర్థమైంది కదా అంటాడు శివన్నారాయణ. నేను మమ్మీకి జ్యూస్ ఇవ్వడానికి వెళ్లాను. నాకు ఏమైంది అందరూ నన్ను ఎందుకు ఇలా చూస్తున్నారు అని అడిగితే... అంటుంది జ్యోత్స్న. నిజం చెప్పి చంపేయాలి అనుకున్నావా? అని దీప ఫైర్ అవుతుంది. దీప అని గట్టిగా అరుస్తుంది జ్యోత్స్న. నువ్వు చేసిన పని అలాగే ఉంది జ్యోత్స్న అంటాడు శివన్నారాయణ.
ఇంట్లో నుంచి వెళ్లిపోతాను
అప్పుడే గదిలో నుంచి బయటకు వస్తాడు దశరథ. జ్యోత్స్నను ఏం అనకండి నాన్న అంటాడు. అదేంటి అన్నట్లు అందరు దశరథ వైపు చూస్తారు. చావు బ్రతుకుల్లో ఉన్న తల్లిని వదిలేసి అర్థరాత్రి పూట ఇంట్లో నుంచి పారిపోవాలని చూసినప్పుడే తనకు తల్లిపట్ల ఏ మాత్రం ప్రేమ, బాధ్యత లేవని నాకు అర్థమైంది. నేను సుమిత్రను తీసుకొని ఎక్కడికైనా వెళ్లిపోతాను నాన్న. ఇలా నిజం చెప్పి తాను ఏడుస్తుంటే నేను చూడలేను. నాకు భయంగా ఉంది అంటాడు దశరథ.
తల్లి కూతురి పెళ్లి చూడాలి అనుకుంటుంటే.. కూతురేమో తల్లి చావు చూడాలి అనుకుంటోంది. నీ పెళ్లి అయ్యే వరకైనా తనని ఉండనివ్వు జ్యోత్స్న అంటాడు దశరథ. నా వల్ల మీరు ఎందుకు ఇంట్లో నుంచి వెళ్లిపోవాలి. నేనే వెళ్లిపోతాను అంటుంది జ్యోత్స్న. ఎక్కడికి వెళ్తావు? మీ అమ్మను కాపాడాల్సింది నువ్వే అని నీకు తెలుసు కదా అంటాడు శివన్నారాయణ. ఈ ఇంట్లో నేను ఏం మాట్లాడినా, ఏం చేసినా తప్పే అంటూ ఆవేశంగా లోపలికి వెళ్తుంది జ్యోత్స్న. వెనకాలే వెళ్తుంది పారు. కొందరిని మనం భరించడం తప్పా ఏం చేయలేం చెల్లెమ్మ అని బాధపడుతాడు దశరథ.
నిజం చెప్పేద్దామన్న కార్తీక్
జ్యోత్స్న అనుకోకుండా నిజం చెప్పలేదు బావ.. అమ్మను చంపాలి అనుకునే నిజం చెప్పింది. ఏదో కుట్ర చేస్తోంది అంటుంది దీప. నాకు కూడా అదే అనుమానంగా ఉంది అంటాడు కార్తీక్. కానీ అత్తకు ఏమైనా అయితే.. దాసు మామయ్య నిజం చెప్తాడనే భయం జ్యోత్స్నలో ఉంటుంది అంటాడు కార్తీక్. అంతదూరం జ్యోత్స్న ఆలోచించదు. ఇప్పుడు టెస్టులు చేస్తే తన గురించి నిజం బయటపడుతుంది కాబట్టి.. అమ్మే లేకుంటే మంచిది కదా అని ఆలోచిస్తుంది అంటుంది దీప.
అయితే నువ్వే ఈ ఇంటి వారసురాలివి అని నిజం చెప్పేద్దామా అంటాడు కార్తీక్. నిజం తెలిస్తే అమ్మ తట్టుకుంటుందా? అని అడుగుతుంది దీప. చెప్పక తప్పేలా లేదు. జ్యోత్స్న కన్నకూతురు కాదు కాబట్టి అత్తను కాపాడలేదు. నువ్వు కన్నకూతురివి అయినా నిజం చెప్పకపోతే అత్తను కాపాడలేవు. ఏం చేయాలో అర్థం కావడం లేదు దీప. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి అంటాడు కార్తీక్. ముందుగా అమ్మకు వ్యాధి గురించి చెప్పి ఏం కాదనే ధైర్యం ఇవ్వాలి. ఆ తర్వాత ఏదో ఒక దారి దొరుకుతుంది లే బావ అంటుంది దీప.
జ్యోపై పారు ఫైర్
నువ్వు చేసిన పనికి అందరిముందు ఎంత పరువు పోవాలో అంతా పోయింది. నన్ను కాపాలగా పెట్టి పాపం చేయబోయావు. నీ తప్పులో నన్ను ఇరికించావు అని జ్యోత్స్న మీద విరుచుకుపడుతుంది పారు. నేను చేసింది తప్పు అంటావా? ఇప్పుడు నేను చెప్పకపోతే వీళ్లు చెప్పకుండానే ఉంటారా? అది ఎప్పుడైనా తెలియాల్సిన విషయమే కదా అంటుంది జ్యోత్స్న. అదే ఈ విషయాన్ని దీప చెప్తే.. దీప ఈ ఇంటి మంచి కోరుకునే వ్యక్తి అందుకే చెప్పింది అంటారు.
నేను చెప్తే మాత్రం ఇలా నిందలు వేస్తారు. అయినా మా డాడీ, మమ్మీ, దీప, బావ, తాత, మామయ్య అందరూ నాకు అన్యాయం చేశారు గ్రానీ. నన్ను ఎందుకు పనికిరాని వ్యక్తిలా నిలబెట్టారు అని గట్టిగా అరుస్తుంది జ్యోత్స్న. నువ్వు నన్ను కాపాడవని నాకు అర్థమైంది. నన్ను నేను కాపాడుకోవాలి కాబట్టి ఏదో ఒకటి చేశాను అంటుంది జ్యోత్స్న. నిన్ను కాపాడలేను అని నేను చెప్పానా? అని ఫోన్ తీసుకుంటుంది పారు. ఎవరికి ఫోన్ చేస్తున్నావు అని అడుగుతుంది జ్యోత్స్న. నిన్ను కాపాడగలిగే వాడికి అంటుంది పారు.
క్షమాపణ కోరిన దాసు
ఇంతలో దాసు, శ్రీధర్ ఇంటికి వస్తాడు. ఇన్నాళ్లు ఎటుపోయావు బావ అంటాడు శ్రీధర్. ప్రశాంతత కోసం పుణ్య క్షేత్రాలు తిరుగుతున్నాను అంటాడు దాసు. కాశీ చేసిన పని తెలిసింది. వాడు చాలా పెద్ద తప్పు చేశాడు. భార్య, అత్తమామల నమ్మకాన్ని పోగొట్టుకున్నాడు. వాడు ఇంత పెద్ద తప్పు ఎలా చేశాడో నాకు అర్థం కావట్లేదు. అందరూ మనవాళ్లే కదా అంటాడు దాసు. కాశీ చేసిన తప్పుడు పనికి నేను మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నాను. క్షమించు బావ అని అడుగుతాడు దాసు.
మీరు అలా మాట్లాడకండి అన్నయ్య అంటుంది కావేరి. వాడు బావను రోడ్డుకు లాగే ప్రయత్నం చేశాడు. అది చాలా పెద్ద తప్పు. కానీ ఇకపై కాశీ బాధ్యత నీదే బావ. ఏం చేసి అయినా సరే వాడిని నువ్వే మంచిదారిలో పెట్టు అంటాడు దాసు. తప్పకుండా అంటాడు శ్రీధర్. ఇక నేను వెళ్లివస్తాను అంటాడు దాసు. ఇక్కడే ఉండు మామయ్య అంటుంది స్వప్న. ఉండలేను అని వెళ్లిపోతాడు దాసు. కాశీ గురించి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అంటాడు శ్రీధర్. ఏంటండీ అంటుంది కావేరి. రేపు సాయంత్రం చెప్తాను అంటాడు శ్రీధర్.
కన్నీళ్లు పెట్టుకున్న శివన్నారాయణ
మరోవైపు సుమిత్ర గదిలో కూర్చొని బాధపడుతూ ఉంటారు దశరథ, కాంచన, శివన్నారాయణ. ముందు నువ్వు కళ్లు తుడుచుకో అన్నయ్య. వదినకు ఏం కాదు. నువ్వు ఇంతలా కోరుకునే వ్యక్తిని దేవుడు ఎందుకు దూరం చేస్తాడు అంటుంది కాంచన. నువ్వు అయినా అన్నయ్యకు ధైర్యం చెప్పు నాన్న అంటుంది. సుమిత్రకు ఏం కాదు అని నాతో ఎవరో ఒకరు చెప్పే వరకు నా చుట్టూ ఏమవుతుందో అర్థం కానీ పరిస్థితిలో ఉన్నానమ్మ నేను అని కంటతడి పెట్టుకుంటాడు శివన్నారాయణ.
మామయ్య గారు తిన్నారా, టాబ్లెట్ వేసుకున్నారా, ఇది చేయండి, అది చేయండి అంటూ ఎప్పుడూ నా యోగక్షేమాలు చూసుకునే కూతురి లాంటి కోడలు ఇలా అనారోగ్యంతో ఉంది అంటేనే నేను తట్టుకోలేకపోతున్నాను అంటాడు శివన్నారాయణ. అవును నాన్న డాక్టర్ గారు సుమిత్ర గురించి చెప్పినప్పుడు కాసేపు నా ఊపిరి ఆగిపోయినట్లు అనిపించింది అంటాడు దశరథ. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

