- Home
- Entertainment
- TV
- Gunde Ninda Gudi Gantalu: మనోజ్ కి పిల్లలు పుట్టరా? రోహిణీ గతంపై కన్నేసిన ప్రభావతి, మనోజ్ లోనూ అనుమానం
Gunde Ninda Gudi Gantalu: మనోజ్ కి పిల్లలు పుట్టరా? రోహిణీ గతంపై కన్నేసిన ప్రభావతి, మనోజ్ లోనూ అనుమానం
Gunde Ninda Gudi Gantalu: రోహిణీ తన కొడుకును ఇంటికి తీసుకోవడానికి మరో మాస్టర్ ప్లాన్ వేస్తుంది. తాను తొందరగా మరో బిడ్డను కంటే ఈ సమస్యలన్నీ పోతాయి అనుకుంటుంది. నేటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో టీవీకంటే ముందుగా మీ కోసం...

Gunde Ninda Gudi Gantalu
మనోజ్ ఫర్నీచర్ షాప్ కి ఓ బ్యాంక్ అతను వచ్చి క్రెడిట్ కార్డు ఆఫర్ చేస్తాడు. పది లక్షల రూపాయల వరకు వాడుకోవచ్చని, ప్లాటినమ్ కార్డు అని చాలా ఆఫర్లు ప్రకటిస్తాడు. వాటికి మనోజ్ టెంప్ట్ అయిపోయి తీసుకోవాలని అనుకుంటాడు. కానీ, రోహిణీ వద్దని.. అంత డబ్బు చేతిలో ఉంటే...వృథా ఖర్చులు అయిపోతాయని నచ్చచెబుతుంది. కానీ, మనోజ్ వినిపించుకోడు.‘ అదృష్టం మనల్ని వెతుక్కుంటూ వచ్చింది అంటే.. మనం ఎదుగుతున్నాం’ అని మనోజ్ అంటాడు. ‘ ఇంత డబ్బు చేతిలో ఉంటే భవిష్యత్తులో సమస్యలు వస్తాయి’ అని రోహిణీ అంటే.. ‘ చేతిలో డబ్బు ఉంటే బిజినెస్ చేస్తాం.. బిజినెస్ చేస్తే ప్రాఫిట్స్ వస్తాయి.. సమస్యలు ఎందుకు వస్తాయి.. ఎంత బిజినెస్ చేస్తే.. బ్యాంకుల వాళ్లు మన చుట్టూ తిరుగుతారు. క్రెడిట్ కార్డు బాగా వాడితే మన సిబిల్ స్కోర్ కూడా బాగా పెరుగుతుంది. ఫ్యూచర్ లో దీని వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి.. నువ్వు ఇంకేమీ ఆలోచించకు’ అని రివర్స్ లో రోహిణీ ని నచ్చచెప్పి.. ఆ క్రెడిట్ కార్డు తీసుకోవడానికి ఒకే చెబుతాడు.వారం రోజుల్లో కార్డు వచ్చేస్తుంది అని చెప్పి.. బ్యాంక్ వ్యక్తి వెళ్లిపోతాడు. ‘ చూశావా రోహిణీ.. నువ్వు ఇక్కడికి వచ్చిన ప్రతిసారీ ఏదో ఒక మంచి జరుగుతూనే ఉంది.. అందుకు నేను చెబుతునున్నాను.. నువ్వు రోజూ మన స్టోర్ కి రావాలని.. యూ ఆర్ మై లక్కీ క్వీన్ ’ అని పొగుడుతాడు. ‘ ఇలాంటి మాటలకు నేను పొంగిపోను’ అని రోహిణీ అంటే..‘ నిజం చెబుతున్నా రోహిణి.. నువ్వు నా అదృష్ట దేవతవి.. కార్డు వచ్చిన తర్వాత మనం గోవా ప్లాన్ చేద్దాం’ అని చెప్పి మనోజ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
రోహిణీ స్టోర్ లో లెక్కలు చూస్తుంటే.. చింటూ ఫోన్ చేస్తాడు. నీతోనే ఉండాలి అనిపిస్తుందమ్మా.. నీ దగ్గరకు వచ్చేస్తాను అని చింటూ అడుగుతాడు.. దానికి రోహిణీ.. కొన్ని రోజులు ఓపికపడతానని.. తన దగ్గరకే తెచ్చుకుంటాను అని చింటూకి చెబుతుంది. అప్పుడే రోహిణీకి డాక్టర్ అపాయింట్ మెంట్ దొరుకుతుంది. వెంటనే హాస్పిటల్ కి బయలు దేరుతుంది.
ఆనందంలో మీనా కుటుంబం..
మరోవైపు సుమతి తన కుటుంబంతో కలిసి గుడికి వెళ్తుంది. అక్కడకు వాళ్లకు తెలిసిన వాళ్లు వచ్చి కాన్వకేషన్ డ్రెస్ వేసుకోమని అడుగుతారు. ఆ డ్రెస్ వేసుకున్న తర్వాత సుమతితో వాళ్లు ఫోటోలు దిగుతారు. అది చూసి మీనా తల్లి చాలా సంబరపడుతుంది. వాళ్ల నాన్న చిన్నతనంలో చెరుకు రసం బండిని నడిపేవాడు.. దానిని చూసి.. అక్కడకు వెళ్లి తండ్రితో మాట్లాడుతున్నట్లు సుమతి ఊహించుకుంటుంది. వీళ్లు మాట్లాడుకుంటూ ఉన్న సమయంలో బాలు, మీనా వస్తారు. అయితే.. బాలు అంటే.. మీనా తమ్ముడు శివకు నచ్చదు. కాబట్టి.. కాస్త కోపంగా ఉంటాడు. బాలు, మీనాలు వెళ్లి.. కంగ్రాట్స్ చెబుతారు. సుమతికి స్వీట్స్ తినిపిస్తారు.‘ అమ్మా.. ఇప్పుడు నీకు ఎంత తృప్తిగా ఉందో... నీ కళ్లు చూస్తేనే తెలుస్తుంది.’ అని మీనా అంటే.. ‘ నేను ఇంత చదవినాంటే దానికి కారణం నువ్వే కదా అక్క’ అని సుమతి అంటుంది. ‘నేనేం చేశానే..?’ అని మీనా అడిగితే..‘ మాకోసం నీ చదువును మధ్యలో ఆపేసి షాప్ చూసుకున్నావ్ కదా అక్క.. నువ్వు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడం నాకు ఇంకా గుర్తుంది’ అని సుమతి అంటుంది.
ఆ మాట విని బాలు షాక్ అవుతాడు. ‘ మా మీనా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుందా?’ అని అడుగుతాడు. కుటుంబ పరిస్థితుల కారణంగా మీనా తన చదువు త్యాగం చేసిందని వాళ్ల అమ్మ చెబుతుంది. వాళ్లు బాధగా ఏడుస్తుంటే.. బాలు వాళ్లను మోటివేట్ చేస్తాడు. సుమతి ఈ స్థాయికి వెళ్లడానికి అత్తయ్యే కారణం అని గొప్పగా మాట్లాడతాడు. ఆ తర్వాత కాన్వకేషన్ గౌన్ ని... సుమతి తనది దీసి.. మీనాకు వేస్తుంది. మీనాని అలా చూసి బాలు మురిసిపోతాడు. వెంటనే ఫోటోలు తీసుకుంటాడు. తర్వాత.. శివని కూడా బాగా చదివి ఫస్ట్ క్లాస్ తెచ్చుకోవాలని మీనా చెబుతుంది. కానీ.. శివకు అంత బాధ్యత లేదు అని చెప్పి బాలు వెళ్లిపోతాడు. అయితే.. బాలు అన్న మాటకు శివకు కోపం వస్తుంది. కానీ.. మీనా.. తన భర్తకు సపోర్టివ్ గా మాట్లాడుతుంది. అందరూ బాలుకి సపోర్ట్ గా మాట్లాడటంతో శివకు కోపం మరింత ఎక్కువ అవుతుంది. తర్వాత గుడిలోకి వెళ్లి దేవుడికి దండం పెట్టుకుంటారు.
హాస్పిటల్ కి రోహిణీ..
మరోవైపు రోహిణీ..తన ఫ్రెండ్ తో కలిసి హాస్పిటల్ కి వెళ్తుంది. ఇప్పుడంత అవసరమా... కాస్త ఆలోచించుకోకపోయావా? అని ఫ్రెండ్ అడిగితే.. ‘ కచ్చితంగా అవసరం.. నాకు, మనోజ్ కి మధ్య బాండింగ్ పెరగాలంటే.. కచ్చితంగా బిడ్డను కనాలి. చింటూ పుట్టినప్పుడు నాకు ఎలాంటి సమస్యలు రాలేదు. ఇప్పుడు సంవత్సరం అయినా ఇంకా పిల్లలు పుట్టడం లేదు అంటే కొత్తగా ఏదైనా సమస్య ఉందేమో తెలుసుకోవాలి’ అని రోహిణీ అంటుంది. రేపు చింటూ గురించి బయటపడితే..? అని ఫ్రెండ్ అడిగితే.. ‘ అందుకే.. నాకు, మనోజ్ కి బిడ్డ పుట్టాలని కోరుకుంటున్నాను.. అప్పుడు ఆ బిడ్డ కోసం అయినా నన్ను క్షమిస్తాడు’ అని చెప్పి.. హాస్పిటల్ కి వెళ్తుంది.
వీళ్లు వెళ్లిన హాస్పిటల్ కే.. మీనా, వాళ్ల చెల్లి సుమతి కూడా వస్తారు. సుమతి ఇంటర్వ్యూ కోసం అక్కడికి వస్తుంది. ఒకరినొకరు చూసుకోరు. ‘బిడ్డను కనడానికి నాకు ఎలాంటి సమస్యలు లేవు అని తేలే వరకు నాకు చాలా టెన్షన్ గా ఉంటుంది’ అని రోహిణీ అంటుంది. ‘ చింటూ పుట్టినప్పుడు నార్మల్ డెలివరీ అయ్యిందా?’ అని అడిగితే.. అవును అని చెబుతుంది. ఈ లోగా.. సుమతి ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. రోహిణీని డాక్టర్ పిలవడంతో డాక్టర్ దగ్గరకు వెళ్తుంది. సుమతి కూడా ఇంటర్వ్యూకి వెళ్తుంది.
‘నాకు ఆల్రెడీ బిడ్డ ఉన్నాడు. రెండోసారి బిడ్డను కనాలని అనుకుంటున్నాను’ అని రోహిణీ చెబితే.. ‘ ఎలాంటి సమస్య లేదని.. ఒత్తిడి లేకుండా ఉంటే సరిపోతుంది. టైమ్ కి భోజనం చేయాలి..’ అని డాక్టర్ చెబుతారు. అయితే.. ప్రాబ్లం మనోజ్ లో ఉండి ఉంటుంది.. అది తర్వాత కొన్ని రోజులకు బయటపడే అవకాశం ఉంది. ఇక.. డాక్టర్ దగ్గర నుంచి బయటకు వచ్చిన తర్వాత.. తన ఫ్రెండ్ కి డాక్టర్ చెప్పిన విషయాన్ని పంచుకుంటుంది. వాళ్ల ఫ్రెండ్ కాసేపు రోహిణీ మీద సెటైర్లు వేస్తుంది. పనిలో పనిగా మనోజ్ ని వెర్రివాడు అని తక్కువ చేసి మాట్లాడుతుంది. ఆ మాటలకు రోహిణీకి కాస్త కోపం వస్తుంది.
సుమతి కంట పడిన రోహిణీ.. ప్రభావతి ఇంట రచ్చ..
మీనాకి పూల మాల ఆర్డర్ వస్తే..తాను వెళ్లిపోతుంది. సుమతి ఇంటర్వ్యూ కొనసాగుతుంది. అందుకే ఆమెను అక్కడే వదిలేసి మీనా వెళ్లిపోతుంది. అక్కడ ఉన్న దేవుడికి సుమతి దండం పెట్టుకుంటూ ఉండగా.. మెడికల్ షాప్ దగ్గరకు రోహిణీ వస్తుంది. అది కాస్త సుమతి కంట పడుతుంది. మెటర్నిటీ హాస్పిటల్ కి రోహిణీ ఎందుకు వచ్చింది అనే అనుమానం కలుగుతుంది. ఆ తర్వాత కాసేపటికి తనకు ఉద్యోగం వచ్చింది అని సుమతి ఫోన్ చేసి మీనాకు చెబుతుంది. ఆ మాట విని మీనా చాలా సంతోషపడుతుంది. అయితే.. హాస్పిటల్ లో తాను రోహిణీని చూసిన విషయం సుమతి చెబుతుంది. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.
కమింగప్ లో.. మీనా అందరికీ స్వీట్లు పంచుతుంది. రోహిణీ తల్లి కాబోతుందని అనుకోని మీనా ఆ స్వీట్లు పంచుతుంది. కానీ.. రోహిణీ కాదు అని చెప్పేసరికి ప్రభావతి బాధపడుతుంది. తర్వాత రోహిణీ పై ప్రభావతి తనకు అనుమానం ఉంది అంటూ మనోజ్ కి చెప్పడం గమనార్హం.

