MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • TV
  • Brahmamudi Serial Today Episode: పెద్ద ప్లానే వేసిన ఇందు, వెంకీ వీక్నెస్‍తో ఆడుకున్న రాజు

Brahmamudi Serial Today Episode: పెద్ద ప్లానే వేసిన ఇందు, వెంకీ వీక్నెస్‍తో ఆడుకున్న రాజు

Brahmamudi Serial Today Episode: బ్రహ్మముడి ఎపిసోడ్ రసవత్తరంగా సాగుతోంది. బయటకు వెళ్లడానికి పెద్ద ప్లాన్ వేసింది ఇందు. ఆ ప్లాన్ ఏంటో ఈరోజు ఎపిసోడ్‍లో  చూసేద్దాం.  

3 Min read
Author : Nandini Arava
Published : Mar 12 2026, 10:49 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
వంట చేయడానికి వెళ్లడం ఇష్టమేనన్న ఇందు
Image Credit : jio hotstar

వంట చేయడానికి వెళ్లడం ఇష్టమేనన్న ఇందు

శివరాం వెళ్లిపోయాక రేఖను నిలదీస్తుంది అపర్ణ. ఎంత ధైర్యముంటే నా మనవరాలినే వంట మనిషిగా పంపిస్తావ్ అని కోప్పడుతుంది. ఇందు దుగ్గిరాల వంశానికి వారసురాలు అని అంటుంది. నీ మనవరాలికి లేని నీకెందుకు అని రేఖ అంటుంది. ఆయన చెప్పింది చేస్తే కోట్ల రూపాయలు వస్తాయని భ్రమరాంబ అంటుంది. అయితే నువ్వే వాళ్లింటికి వెళ్లి వంట చేయ్ అంటుంది అపర్ణ. వెళ్లనని చెప్పు ఇందు అని అపర్ణ అంటే వెళ్లడానికి ఇష్టమే అని ఇందు చెప్తుంది. ఆ మాటలకు అపర్ణ, స్వాతి ఆశ్చర్యపోతారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
బయటకు వెళ్లడానికి ఇందు ప్లాన్
Image Credit : jio hotstar

బయటకు వెళ్లడానికి ఇందు ప్లాన్

తర్వాత బెడ్‍రూంలో ఇందుపై అపర్ణ కోప్పడుతుంది. అలా ఎందుకు ఒప్పుకున్నావే, నీకేమన్నా మతిపోయిందా అని అపర్ణ అంటుంది. స్వాతి కూడా ఫీలవుతుంది. తప్పు చేశావక్క అని అంటుంది. మీ చెల్లెలికి కూడా నువ్వు వంటమనిషిగా వెళ్లడం ఇష్టం లేదని అపర్ణ అంటుంది.

రేఖ చెప్పిందల్లా చేయడానికి ఆమె పెంచుకునే గంగిరెద్దును కాదు..నీ మనవరాలిని నానమ్మ అని ఇందు అంటుంది. ఆయన నన్ను వంటమనిషిగా పిలిచారని మీరనుకుంటున్నారు..కానీ నన్ను వాళ్లింట్లో వంటమనిషిగా పిలవమని నేనే చెప్పాను అంటుంది. దీంతో అపర్ణ, స్వాతి షాకైపోతారు. ఆయన నీకు ముందెలా తెలుసని అడుగుతారు. ఓ యాక్సిడెంట్‍ వల్ల ఆయన పరిచమయ్యారని చెప్తుంది ఇందు.

37
శివరాంను కాపాడిన ఇందు
Image Credit : jio hotstar

శివరాంను కాపాడిన ఇందు

ఇందు నడుచుకుంటూ వెళ్తుంటే కారులో వెళ్తున్న శివరాం...గుండెపోటు వచ్చి కారు నడపలేక ఆగిపోతాడు. వెంటనే ఇందు వెళ్లి కాపాడి ట్లాబ్లెట్స్ ఇస్తుంది. నన్ను రక్షించి వందల కుటుంబాలను కాపాడావని శివరాం అంటాడు. మీలాంటి వారు ఇలా ఒక్కరే వెళ్లడమేంటని ఇందు అంటుంది. అలా ఆయన్ని కలిశానని ఇందు చెప్తుంది. 

47
నాకు ఈ ఒక్క హెల్ప్ చేయండని శివరాంను కోరిన ఇందు
Image Credit : jio hotstar

నాకు ఈ ఒక్క హెల్ప్ చేయండని శివరాంను కోరిన ఇందు

మరి వంటకు పిలవమని ఎప్పుడు చెప్పావు అని స్వాతి అడుగుతుంది. ఆయన ఇంటికి వచ్చినప్పుడే చెప్పానని అంటుంది ఇందు. శివరాం కారు దిగి వస్తుండగా ఇందు ఎదురుపడుతుంది. ఇక్కడ ఉన్నావేంటీ అని అడుగుతాడు శివరాం. ఇది మా ఇల్లే అని చెప్తుంది. రేఖ డిన్నర్‍కు పిలిస్తే వచ్చానని శివరాం అంటాడు. నువ్వు చేసిన సాయానికి నీకేం చేయలేకపోయానని గిల్టీగా ఉందని అంటాడు. అయితే నాకు ఇప్పుడో సాయం చేస్తారా అని అడుగుతుంది. ఏంటమ్మా చెప్పు అంటే...నేను చేసిన వంట బాగుందని చెప్పి మీ ఇంట్లో వంట చేయడానికి రమ్మని పిలవండి అని అంటుంది. ఎందుకు ఏమిటి అడగొద్దు...నాకు ఈ ఒక్క హెల్ప్ చేయండంటుంది. సరే అంటాడు. 

57
ఫ్రెండ్‍తో చెప్పి జాబ్ ఇప్పిస్తానన్న స్వాతి
Image Credit : jio hotstar

ఫ్రెండ్‍తో చెప్పి జాబ్ ఇప్పిస్తానన్న స్వాతి

ఏమో అనుకున్నా గానీ....నువ్వు మామూలుదానివి కాదక్కా అంటుంది స్వాతి. బయటకెళ్లి ఎలా జాబ్ చేస్తావ్ అని అడిగావ్ కదా...ఇలా వెళ్తాను అంటుంది ఇందు. నేను నార్మల్‍గా అన్నా...నేను సీరియస్‍గా తీసుకున్నా అంటుంది ఇందు. ఇప్పుడు నేను బయటకెళ్తే ఆపేవారే లేరంటుంది. డిగ్రీనే కంప్లీట్ చేయలేదు అక్కా అంటే..సంకల్పంతో ముందుకు వెళ్తే ఏదైనా సాధించగలమంటుంది. అయితే మా ఫ్రెండ్ వాళ్లన్నయ్య పెద్ద కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. అతనికి చెప్పి నీకు జాబ్ చూడమంటా అంటుంది. 

67
వెంకీ వీక్నెస్‍తో ఆడుకున్న రాజు, అతని ఫ్రెండ్
Image Credit : jio hotstar

వెంకీ వీక్నెస్‍తో ఆడుకున్న రాజు, అతని ఫ్రెండ్

మరోవైపు బార్‍లో రాజు, అతని ఫ్రెండ్ ఉంటారు. బిల్ కట్టడానికి బకరాను వెతుకుతారు. ఎవరో ఎందుకు పెద్ద బకరా మీ తమ్ముడు వెంకీనే ఉన్నాడు కదా...రాజు ఫ్రెండ్ అంటాడు. నా తమ్ముడినే బకరా అంటావా అయినా వాడేలా కడతాడు అంటే...వాడి వీక్‍నెస్ నాకు తెలుసు అంటాడు రాజు ఫ్రెండ్. ఓహో అప్పటి నుంచి నీ మెయింటెనెన్స్ కు మా తమ్ముడినే వాడుతున్నావా అంటాడు రాజు. నీకు చెప్తే నువ్వు కూడా వాడేసుకుంటావ్ అంటాడు రాజు ఫ్రెండ్. ఫోన్ మాట్లాడటానికి రాజు ఫ్రెండ్ పక్కకు వెళ్తుంటే..ఎందుకు పక్కకు వెళ్తున్నావని అడిగితే...నీకు వాడి వీక్నెస్ తెలిస్తే నమ్మకద్రోహం చేస్తావని నాకు తెలుసని రాజు ఫ్రెండ్ అంటాడు. నీ గర్ల్ ఫ్రెండ్‍ను ఇక్కడ చూశానని త్వరగా రా అని వెంకీతో అంటాడు రాజు ఫ్రెండ్.

77
సెల్ఫీ సాకుతో పర్స్ ఖాళీ
Image Credit : jio hotstar

సెల్ఫీ సాకుతో పర్స్ ఖాళీ

మీ తమ్ముడు రాగానే నువ్వు ఇప్పుడే వచ్చినట్లు ఇక్కడికి రా అని రాజు ఫ్రెండ్ అంటాడు. వెంకీ వచ్చి నా గర్ల్ ఫ్రెండ్ ఏది అని అడుగుతాడు. ఇంతలో రాజు వస్తాడు. మీరిద్దరూ కలిసే నన్ను పిలిచారు కదా అని వెంకీ అంటాడు. వెంకీ చేతిలో మందు గ్లాస్ పెట్టి సెల్ఫీ తీసుకుంటారు. ఈ ఫోటో నాన్నకు చూపిస్తామని బ్లాక్ మెయిల్ చేస్తారు. పాపం వెంకీ దగ్గర పర్స్ లాక్కుని పార్టీ ఎంజాయ్ చేస్తారు. 

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sudheer: ఫ్రీడమ్ వచ్చేసింది అంటూ కేకలు వేసిన సుధీర్.. గుద్దితే పళ్ళు రాలిపోతాయ్, సృష్టి వైల్డ్ రియాక్షన్
Recommended image2
Krishnudu Remueration: రెండు వారాలకు కృష్ణుడు పారితోషికం ఎంతో తెలుసా? కూర్చొని లక్షలు సంపాదించాడు
Related Stories
Recommended image1
Brahmamudi Serial Today Episode: సుభాష్ ఆపరేషన్ కోసం అవస్థలు, వంట మనిషిగా ఇందు
Recommended image2
Brahmamudi Today Episode: ఇరుక్కున్న స్వాతి, ఇందు.. రేఖపై పగతో రగిలిపోతున్న నందు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved