MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • TV
  • Karthika Deepam 2 Today Episode:బిగ్ ట్విస్ట్-దీపే వారసురాలు-నిజం చెప్పిన దశరథ-దీపను షూట్ చేసిన జ్యో

Karthika Deepam 2 Today Episode:బిగ్ ట్విస్ట్-దీపే వారసురాలు-నిజం చెప్పిన దశరథ-దీపను షూట్ చేసిన జ్యో

కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ (మార్చి 12వ తేదీ)లో అడ్డంగా దొరికిపోయిన దీప, కార్తీక్. అబద్ధం ఎందుకు చెప్పారని నిలదీసిన జ్యో. దీపే నా కన్న కూతురని చెప్పిన దశరథ. షాకైన ఫ్యామిలీ. దీపను గన్ తో షూట్ చేసిన జ్యో. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...  

3 Min read
Author : Kavitha G
Published : Mar 12 2026, 08:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
Image Credit : Jiohotstar

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్

కార్తీక దీపం 2 సీరియల్ గురువారం ఎపిసోడ్ లో.. దీపకు అన్ని రకాల టెస్టులు చేస్తుంది మరో డాక్టర్. బయటకు వచ్చి టెస్టులు పూర్తయ్యాయి. రిపోర్ట్స్ రాగానే పంపిస్తాను. మీరు వెళ్లండి అని చెప్తుంది. నా ఫోన్ నంబర్ మీ దగ్గర ఉంది కదా.. దానికే పంపించండి అని డాక్టర్ తో చెప్తుంది జ్యోత్స్న. పద దీప మనం హాస్పిటల్ కి వెళ్దాం అంటాడు కార్తీక్. రిపోర్ట్స్ వచ్చే వరకు ఎవరూ ఎక్కడికి వెళ్లడానికి వీల్లేదు. అందరం మా ఇంటికి వెళ్దాం అంటుంది జ్యోత్స్న. సపోర్ట్ చేస్తాడు శివన్నారాయణ.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
మీ పెళ్లి రోజు గుర్తుందా?
Image Credit : Jiohotstar

మీ పెళ్లి రోజు గుర్తుందా?

మరోవైపు చదువుకుంటూ ఉంటుంది స్వప్న. ఎన్నిసార్లు పిలిచినా దగ్గరికి రావేంటి అనుకుంటూ స్వప్న దగ్గరకు వస్తుంది కావేరి. ఇంతలో స్వప్న అంటూ లోపలికి వస్తాడు దాసు. బావ ఎటు వెళ్లాడు అని అడిగితే పనిమీద బయటకు వెళ్లాడు అని చెప్తుంది కావేరి. అయినా నేను కోడలి కోసం వచ్చానులే అంటాడు దాసు. మామయ్య నేను నీకు కోడలిని కాదు.. మేనకోడల్ని అంతే అంటుంది స్వప్న. అలాగే పిలుస్తాను లే అని స్వప్నకు ప్రసాదం ఇచ్చి బొట్టు పెట్టుకోమంటాడు దాసు. స్వప్న పాపిట్లో కూడా బొట్టు పెట్టుకొని దాసు వైపు చూస్తుంది. నువ్వు ముత్తయిదువు కదా బొట్టు పెట్టుకోవచ్చు, తప్పులేదు అంటాడు దాసు.

కాశీని కూడా పిలిచి ప్రసాదం ఇస్తాడు. నేను ఈ రోజు గుడిలో మీ భార్యాభర్తల పేరు మీద అర్చన చేయించాను అని చెప్తాడు దాసు. నన్ను బాధ పెట్టడానికి కాకపోతే ఇవన్నీ ఎందుకు మామయ్య అంటుంది స్వప్న. దానికో కారణం ఉంది. ఈ రోజు మీ మొదటి పెళ్లి రోజు. సరిగ్గా సంవత్సరం క్రితం పెద్దలను ఎదిరించి భార్యాభర్తలుగా ఒకటైన మీరు.. సంవత్సరం కాకముందే విడిపోయిన దంపతులుగా మిగిలారు అంటాడు దాసు. మీలాంటి జంటలను చూసే తల్లిదండ్రులు ప్రేమ పెళ్లిళ్లు అంటే భయపడుతున్నారు. మీ ఇద్దరిలో ఒక్కరికైనా మీ పెళ్లి రోజు గుర్తుందా అని కాశీ, స్వప్నలను అడుగుతాడు దాసు.

37
కంగారు పడ్డ దశరథ
Image Credit : Jiohotstar

కంగారు పడ్డ దశరథ

మరోవైపు వీళ్లు ముగ్గురు ఎక్కడికి వెళ్లారు, కనిపించడం లేదు, నాన్న.. జ్యోత్స్న, పిన్నిలను తీసుకొని గుడికి వెళ్లి ఉంటాడు అని అనుకుంటాడు దశరథ. ఇంతలో కార్తీక్, దీప ఇంటికి రావడంతో కంగారు పడతాడు దశరథ. మీరు ఇంటికి ఎందుకు వచ్చారు ఏమైందని అడుగుతాడు. అప్పుడే మిగతావాళ్లు కూడా లోపలికి వచ్చి, మేము వేరే హాస్పిటల్ కి వెళ్లాము అని చెప్తారు. అదేంటి ఇంకో హాస్పిటల్ కి వెళ్లాల్సిన అవసరం ఏంటి అని అడుగుతాడు దశరథ. బిడ్డ విషయంలో బావ, దీప అబద్ధం ఆడుతున్నారని మాకు అనుమానంగా ఉంది, అందుకే టెస్టులు చేయించడానికి తీసుకెళ్లాము అంటుంది జ్యోత్స్న.

47
అదంతా అబద్ధం
Image Credit : Jiohotstar

అదంతా అబద్ధం

ఇంతలో దీపకు టెస్టులు చేసిన డాక్టర్ జ్యోత్స్నకు ఫోన్ చేస్తుంది. స్పీకర్ ఆన్ చేసి చెప్పండి డాక్టర్ అని అంటుంది జ్యోత్స్న. దీప కడుపులో పెరుగుతున్న బిడ్డ వల్ల దీపకు ప్రమాదం ఉందని మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అలాంటిది ఏం లేదు. తల్లీబిడ్డ ఇద్దరు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది డాక్టర్.

57
అడ్డంగా దొరికిపోయిన దీప, కార్తీక్
Image Credit : Jiohotstar

అడ్డంగా దొరికిపోయిన దీప, కార్తీక్

ఇప్పుడు చెప్పండి బిడ్డ విషయంలో ఎందుకు అబద్ధం చెప్పారు అని కార్తీక్, దీపలను ప్రశ్నిస్తుంది జ్యోత్స్న. అందరూ జ్యోత్స్నకు సపోర్ట్ చేసి కార్తీక్ ని నిలదీస్తారు. ఈ రోజు కచ్చితంగా నిజం తెలియాల్సిందేనని అంటాడు శివన్నారాయణ. వీళ్ల వాలకం చూస్తుంటే దీపే, కార్తీక్ తో అబద్ధం చెప్పించినట్లు ఉందని అంటుంది పారిజాతం.

ఇక తట్టుకోలేని దశరథ నేను మీతో నిజం చెప్తాను అంటాడు. కార్తీక్ వద్దు అంటాడు. నువ్వు అడ్డుపడితే నా మీద ఒట్టే. ఇక నిజం అందరికీ తెలియాల్సిందే అంటాడు దశరథ. దీప, కార్తీక్ ఎందుకు అబద్ధం చెప్పారో నీకు తెలుసా అని అడుగుతుంది కాంచన. తెలుసు, దీప కడుపులో బిడ్డకు ప్రమాదం ఉందనేది నిజం అంటాడు దశరథ. మరి డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్ అని అడుగుతాడు శివన్నారాయణ. అది కూడా నిజమే.. కానీ దీప కడుపులో బిడ్డకు ప్రమాదం దీప వల్ల కాదు, నా భార్య వల్ల. మీ వదిన ప్రాణాలతో ఉండాలంటే దీప బిడ్డను త్యాగం చేయాలి. అదే విధి రాత అంటాడు దశరథ.

67
దీపే ఈ ఇంటి వారసురాలు
Image Credit : Jiohotstar

దీపే ఈ ఇంటి వారసురాలు

అదేంటి అన్నయ్య నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతుంది కాంచన. దీప ఎవరో కాదు, నా కన్న కూతురు, ఈ ఇంటి వారసురాలు అని నిజం చెప్పేస్తాడు దశరథ. అంతా షాక్ అవుతారు. మరి జ్యోత్స్న ఎవరు అని అడుగుతాడు శివన్నారాయణ. జ్యోత్స్న దాసు కూతురు. పుట్టగానే హాస్పిటల్లో బిడ్డలను మార్చారు అని చెప్తాడు. ఎవరు చేశారు ఆ పని అంటాడు శివన్నారాయణ. పారిజాతం పిన్ని చేసింది. నీ మీద పగతో నా కూతురిని అనాథను చేసి, తన మనుమరాలిని ఈ ఇంటి వారసురాలిని చేసింది అని చెప్తాడు దశరథ. భయంతో వణికిపోతుంది పారు.

77
దీపను షూట్ చేసిన జ్యోత్స్న
Image Credit : Jiohotstar

దీపను షూట్ చేసిన జ్యోత్స్న

ఇప్పుడు నా భార్యను కాపాడేది నా కన్న కూతురు దీపే నాన్న. తను డోనర్ గా ఉంటే కడుపులో బిడ్డను బతికించడం కష్టమన్నారు. అయినా సరే తల్లి కోసం బిడ్డను వదులుకోవడానికి సిద్ధమైంది నా కూతురు. ఈ రోజు నుంచి దీపే ఈ ఇంటి వారసురాలిగా ఉంటుంది. జ్యోత్స్న తన తండ్రి దగ్గరకు వెళ్లిపోతుంది అని కుండ బద్ధలు కొడతాడు దశరథ. నీ మనసులో మాట బయటకు చెప్పించాలని ఇదంతా చేశాను డాడీ. ఈ ఇంటికి ఒక్కరే వారసురాలు. దీపను చంపేస్తే నేనే వారసురాలు అని దీపను గన్ తో షూట్ చేస్తుంది జ్యోత్స్న. అంతా దీప, దీప అనుకుంటూ దగ్గరికి వెళ్తారు. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sudheer: ఫ్రీడమ్ వచ్చేసింది అంటూ కేకలు వేసిన సుధీర్.. గుద్దితే పళ్ళు రాలిపోతాయ్, సృష్టి వైల్డ్ రియాక్షన్
Recommended image2
Krishnudu Remueration: రెండు వారాలకు కృష్ణుడు పారితోషికం ఎంతో తెలుసా? కూర్చొని లక్షలు సంపాదించాడు
Related Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode: జ్యో మాస్టర్ ప్లాన్- ఇరుక్కున్న దీప, కార్తీక్- నిజం బయటపడుతుందా?
Recommended image2
Karthika Deepam 2 Today Episode: దీపను ఊహించని విధంగా చంపుతానన్న జ్యో- దాసు, దశరథ షాక్-శ్రీధర్ డౌట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved