- Home
- Entertainment
- TV
- Gunde Ninda Gudi Gantalu:మీనా ఇంట్లో శుభవార్త, తట్టుకోలేకపోయిన ప్రభావతి, రోహిణీ మరో మాస్టర్ ప్లాన్
Gunde Ninda Gudi Gantalu:మీనా ఇంట్లో శుభవార్త, తట్టుకోలేకపోయిన ప్రభావతి, రోహిణీ మరో మాస్టర్ ప్లాన్
Gunde Ninda Gudi Gantalu: చింటూని ఎలాగైనా దత్తత తీసుకోవాలని బాలు అనుకుంటూ ఉంటే.. మరింత దూరం చేయాలని రోహిణీ ప్లాన్లు వేస్తూ ఉంటుంది. మరి, నేటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో టీవీ కంటే ముందుగా...

Gunde Ninda Gudi Gantalu
రోహిణీ తన ఫ్రెండ్ ని కలిసి.. జరిగిన విషయం మొత్తం వివరిస్తుంది.‘ ప్రస్తుతానికి అయితే మా అత్తయ్య మా నాన్న గురించి అడగడం మానేసింది. మెల్లగా సమయం చూసుకొని చింటూ గురించి చెప్పేద్దాం అనుకుంటున్నాను. దాని కంటే ముందు అమ్మని, చింటూ ని ఊరు నుంచి ఇక్కడికి తీసుకువద్దాం అనుకుంటున్నాను’ అని రోహిణీ చెబుతుంది. ‘ ఎందుకే.. అక్కడ బానే ఉన్నారుగా ’ అని ఆమె ఫ్రెండ్ అడిగితే.. ‘ అక్కడే ఉంటే ఆ బాలు, మీనా మాటిమాటికి వెళ్లి కలుస్తున్నారు’ అని రోహిణీ అంటుంది. ‘ కానీ వాళ్లను తీసుకువస్తే.. నీకు సమస్యలు మరింత ఎక్కువ అవుతాయేమో?’ అని ఫ్రెండ్ అడిగితే.. ‘ లేదు.. వాళ్లు దూరంగా ఉండటం వల్లే ఈ సమస్యలు వస్తున్నాయి.. నా కళ్ల ముందే ఉంటే ఆ సమస్యలన్నీ పరిష్కరించుకుంటాను’ అని రోహిణీ ధీమాగా చెబుతుంది. ‘ మరి తన చదువు గురించి ఏం చేస్తావ్?’ అని ఫ్రెండ్ అడిగితే.. ‘ ఇక్కడే ఏదైనా మంచి స్కూల్ లో జాయిన్ చేస్తాను’ అని రోహిణీ చెబుతుంది. ‘ ఐడియా బాగానే ఉంది.. కానీ.. ఏ సమస్యా రాకుండా ఉంటే చాలు’ అని ఆమె ఫ్రెండ్ అంటుంది. ఇక ఇద్దరూ కలిసి ఒక మంచి స్కూల్ కోసం ఆలోచిస్తారు. తర్వాత ‘ నేను తొందరగా కన్సీవ్ అయితే చాలు.. అప్పడు చింటూని తొందరగా ఇంటికి తీసుకొని రావచ్చు’ అని రోహిణీ అంటుంది. ‘ అదెలా?’ అని ఫ్రెండ్ అడిగితే.. ‘ అప్పుడు మనోజ్ యాక్సెప్ట్ చేస్తాడని ఆశ’ అని రోహిణీ చెబుతుంది. ‘ మనోజ్ ఒకే.. మరి అత్తయ్య పరిస్థితి ఏంటి?’ అని అడిగితే.. ‘ మనోజ్ ఒక్కడు ఒప్పుకుంటే చాలు.. తను నాకు అండగా ఉంటే నేను ఏదైనా చేయగలను. నాకు పిల్లలు పుడితే నేను ఈ ప్రాబ్లం నుంచి బయటపడతాను. పెళ్లై సంవత్సరం అవుతుంది. ఇంత వరకు నేను కన్సీవ్ కాలేదు. ఒక డాక్టర్ కి చూపించుకొని చెక్ చేయించుకోవాలి’ అని రోహిణీ అంటుంది.
సంతోషంలో మునిగి తేలిన మీనా..
ఇక.. మీనా ఇంట్లో కూరగాయలు తరుగుతూ ఉంటే.. తన చెల్లెలు సుమతి ఫోన్ చేస్తుంది. ‘ మొన్న నాకు పరీక్షలు అయ్యాయి కదా రిజల్ట్స్ వచ్చాయి.. నేను కాలేజీ టాపర్ అయ్యాను’ అని సుమతి సంతోషంగా చెబుతుంది. ఆ మాట విని మీనా చాలా సంతోషిస్తుంది. ఇక తాను డిగ్రీ చదవడానికి నువ్వే కారణం అని.. తన అక్క మీద సుమతి ప్రేమ కురిపిస్తుంది.ఈ ఆనందంలో మీనా కంట్లో నీరు వస్తుంది. అది చూసి అప్పుడే వచ్చిన బాలు కంగారు పడతాడు. మా అమ్మ ఏమైనా అందా అని సీరియస్ అవుతుంటే.. కాదు సుమతి అని చెబుతుంది. ఫోన్ తీసుకొని సుమతిని మీనాని ఏమన్నావ్ అని అడుగుతాడు. డిగ్రీ పాస్ అయ్యాను బావా అని సుమతి చెబుతుంది. అది విని బాలు కూడా సంతోషిస్తాడు. మీనా కంట్లో వచ్చింది కన్నీళ్లు కాదని.. ఆనంద భాష్పాలు అని తెలుసుకుంటాడు. వెంటనే బాలు కూడా తన సంతోషాన్ని వ్యక్తం చేస్తాడు. చాలా గొప్పగా మాట్లాడతాడు. తర్వాత కంగ్రాట్స్ చెబుతాడు. ఏం కావాలో కోరుకో అని అడిగితే.. అక్కని తీసుకొని ఇంటికి రమ్మని చెబుతుంది. సరే అని బాలు అంటాడు. మరదలి కోరికను నిజం చేయడానికి.. మీనాని పుట్టింటికి తీసుకొని వెళతాను అని బాలు అంటాడు. ముందు ఈ విషయాన్ని ఇంట్లో అందరికీ చెప్పాలి అని మీనా అంటే.. వెంటనే సత్యంకి చెప్పడానికి బాలు వెళతాడు.
శుభవార్త విని సంతోషించిన సత్యం..
సత్యం దగ్గరకు వెళ్లి సుమతి డిగ్రీ పాస్ అయ్యిందని చెబుతారు. సత్యం కూడా చాలా సంతోషిస్తాడు. మీనా పూలు అమ్మి మరీ కష్టపడి చెల్లెలిని చదివించిందని.. దాని ప్రతిఫలమే ఇది అని సత్యం కోడలిని పొగుడుతాడు. ఆ మాటలు విని ప్రభావతి వచ్చి ఏంటి? అని అడుగుతుంది. ‘ ఇంట్లో కొత్తగా మూడు హైడ్ లైట్లు పెట్టారా? మీ ముఖాలు వెలిగిపోతున్నాయి?’ అని ప్రభావతి అడుగుతుంది. ‘ హెడ్ ఉన్నవారికే లైట్లు పెడతారు’ అని బాలు కౌంటర్ వేస్తాడు. ‘ ఇది నిజంగా శుభవార్తే’ అని సత్యం చెబితే.. ‘ మీ పెన్షన్ డబ్బులు పెంచారా?’ అని ప్రభావతి అడుగుతుంది. ‘ శుభవార్తలన్నీ.. డబ్బు వల్లే రావు’ అని సత్యం అంటాడు. ‘ మరి ఏంటది?’ అని ప్రభావతి అడిగితే.. ఎవరూ సమాధానం చెప్పరు. చెప్పినా సంతోషించరులే అని మీనా కూడా అంటుంది. దీంతో.. నిజం ఏంటో చెప్పమని.. ప్రభావతి అనడంతో.. ‘ సుమతి డిగ్రీ పాస్ అయ్యిందని’ చెబుతారు. అది విన్న తర్వాత.. అదేమీ అంత గొప్ప విషయం కాదు అన్నట్లుగా ప్రభావతి మాట్లాడుతుంది.
‘అమ్మ తప్పేమీ లేదు నాన్న.. నాలుగు డిగ్రీలు తెచ్చుకున్న మనోజ్ గాడు.. అవన్నీ ఇంటి ముందు నేమ్ ప్లేట్ మీద రాసుకోవడానికి తప్ప ఎందుకు పనికొచ్చాడు..చివరకు దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. వాటికి అమ్మ ట్రైనింగ్ ఇవ్వాల్సి వచ్చింది. ఆ దొంగతనాలు ఎలా చేయాలో నేర్పించాల్సి వచ్చింది. ఇలాంటి దొంగావతికి డిగ్రీ విలువ ఎలా తెలుస్తుంది.. ఆమె నోటి నుంచి ఇంతకన్నా గొప్ప మాటలు ఏమి వస్తాయి. ఈ మెదడు నుంచి ఎలాంటి మంచితనం ఉత్పత్తి కాదు.. ఈ జీవి అంతే’ అని బాలు అంటాడు. ఆ మాటలకు ప్రభావతికి కోపం వస్తుంది.కుండీతో కొట్టబోతుంది.దానిపై కూడా బాలు కామెడీ చేస్తాడు. కానీ.. తర్వాత.. మీనా తన తల్లి పడిన కష్టాన్ని చాలా గొప్పగా చెబుతుంది. ‘ ఇప్పుడు నేను ఏమన్నాను అని ఇది ఏడుస్తుంది?’ అని ప్రభావతి అంటే.. సత్యం ఛీ కొడతాడు.
ప్రభావతి వెటకారం.. శ్రుతి చురకలు..
అప్పుడే మనోజ్, రోహిణీ.. డ్యూటీకి వెళ్లడానికి రెడీ అవుతారు. ‘ ఏమైంది మీనా?’ అని రోహిణీ అడుగుతుంది. ‘ సుమతి డిగ్రీ ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యింది’ అని సత్యం చెబితే.. రోహిణీ చాలా సంతోషిస్తుంది.. సుమతికి కంగ్రాట్స్ చెప్పమని చెబుతుంది.‘ ఆడపిల్ల ఎన్ని డిగ్రీలు చదివినా.. అత్తవారింటికి వెళ్లాల్సిందే’ అని మనోజ్.. ఏదేదో మాట్లాడతాడు. అందరూ వింతగా చూస్తారు. ‘ రేయ్.. నువ్వు గురూజీ ఉపదేశాలు నమ్మి.. మమల్ని చంపకు.. ఇంట్లో ఒక్క సన్నాసి చాలు’ అని బాలు అంటే.. ‘ ఈ రోజుల్లో డిగ్రీలు చదవడం గొప్ప కాదు.. నేను ఆ రోజుల్లోనే నాలుగు డిగ్రీలు చదివాను’ అని మనోజ్ గొప్పగా చెప్పుకుంటాడు. ‘ చదివి ఏం ఉద్దరించావ్ రా? నాన్న కష్టార్జితాన్ని మింగేశావ్.. సుమతి పరిస్థితి అలా కాదు.. పెన్సిల్ కొనడం కూడా చాలా కష్టం. నిన్ను అలా పెంచలేదు.. నీకు కావాల్సిందల్లా నాన్న కొనిచ్చారు’ అని బాలు అంటే.. ‘ నిజంగానే మీనా వాళ్ల అమ్మ చాలా కష్టపడి సుమతిని చదివించింది.. అందుకు వాళ్లు నిజంగానే గర్వపడాలి’ అని రోహిణీ కూడా చాలా మంచిగా మాట్లాడుతుంది. అయితే.. అదంతా దైవ సంకల్పం అంటూ.. దేవుడికి మనోజ్ దండాలు పెట్టుకుంటూ ఉంటాడు.
అప్పుడే.. రవి, శ్రుతి వస్తారు. వాళ్లకు కూడా సుమతి డిగ్రీ పాస్ అయ్యిందని బాలు చెబుతాడు. వాళ్లు కూడా సంతోషిస్తారు. ‘ఓ బోర్డు రాసి పెట్టుకోరా.. నీ మరదలు డిగ్రీ పాస్ అయ్యిందని’ అని ప్రభావతి సెటైర్ వేస్తే.. ‘ మీరు ఎన్ని డిగ్రీలు చదివారు ఆంటీ? డిగ్రీ విలువ నీకు ఎలా తెలుస్తుంది లేండి’ అని శ్రుతి కౌంటర్ వేస్తుంది. తర్వాత.. రవి.. సుమతిని మెచ్చుకుంటాడు.‘ మీ మమ్మీకి హెల్ప్ చేస్తూ కూడా అంత బాగా చదివింది అంటే.. గ్రేట్ ’ అని శ్రుతి కూడా పొగుడుతుంది. ‘ మనసులోనుంచి వచ్చే మాటలు ఇలా ఉంటాయి.. మీ తల్లీ కొడుకులు ఉన్నారే.. డైనోసార్లు లా గా ఇంత పెద్ద నోరు ఉన్నట్లు.. మీ నోర్లు కూడా అంతే పెద్దగా ఉంటాయి’ అని బాలు అంటాడు. ‘ అయితే.. చిన్నప్పుడు మీనా కూడా చాలా బాగా చదివేదంట. వాళ్ల చెల్లి, తమ్ముడు కోసం చదువు మానేసిందని మీనా చదవు మానేసిందని సుమతి చెప్పింది’ అని శ్రుతి అంటుంది. తర్వాత.. సుమతికి ఇవ్వడం కోసం బిర్యానీ చేయమని రవికి శ్రుతి ఆర్డర్ వేస్తుంది. అది విని ప్రభావతి.. తన ఇంట్లో వండొద్దని.. వాళ్ల ఇంట్లో వండుకుంటారు లే అని అంటుంది. మనోజ్ మాత్రం బిర్యానీ పేరు వినపడగానే.. లంచ్ కి ఇంటికి వచ్చేద్దాం రోహిణీ అంటాడు. అది చాలా ఫన్నీగా ఉంటుంది. ప్రభావతి వద్దు అన్నాసరే.. బిర్యానీ చేస్తాను అని రవి అంటాడు. తర్వాత వాచ్ గిఫ్ట్ గా ఇద్దాం అని శ్రుతి అంటుంది.
సరిగ్గా అప్పుడే.. మీనాకి వాళ్ల అమ్మ ఫోన్ చేస్తుంది. సుమతి డిగ్రీ పాస్ అయిన ఆనందాన్ని.. వాళ్ల అమ్మతో మీనా పంచుకుంటుంది. వాళ్ల అమ్మ గుడికి వెళ్దాం అన్నదని.. మనం కూడా వెళ్దాం అని మీనా అంటే.. వాళ్లు వెళతారు.
ఇక.. రోహిణీ, మనోజ్.. ఫర్నీచర్ షాప్ లో డబ్బులు లెక్క వేస్తూ ఉంటారు. డబ్బులు తక్కువ అవుతున్నాయి అని రోహిణీ అంటే.. తన భోజనానికి నెలకు రూ.30వేలు ఖర్చు అవుతున్నాయి అని చెబుతాడు. దీంతో.. రోహిణీ తిడుతుంది. అంత ఖర్చు పెట్టకూడదని చెబుతుంది. ఇంతలో ఒకతను బ్యాంకు నుంచి వచ్చాను అని చెప్పి పరిచయం చేసుకుంటాడు. తర్వాత క్రెడిట్ కార్డు ఇస్తామంటూ వస్తాడు. క్రెడిట్ కార్డు మనకు వద్దు అని రోహిణీ చెప్పినా మనోజ్ వినిపించుకోడు. క్రెడిట్ కార్డు పేరుతో మనోజ్ కి టోపీ పెట్టే ప్రయత్నం చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.

